No products in the cart.
మార్చి 24 – సమస్తమును చేసి ముగించును!
“యెహోవా నా పక్షమున సమస్తమును (కార్యము సఫలముచేయును) చేసి ముగించును” (కీర్తనలు. 138:8).
నా కొరకు వాదించుటకు ఎవరు కలరు, ఎవరు నాకు సహాయము చేయుదురు, ఎవరు నా అంశములను బాధ్యత వహించి నడిపించువారు అని లోక ప్రజలు నేడు కన్నీటితో అంగలార్చుచు తపించుచున్నారు. అయితే, దావీదు, తన పూర్తి భారమును పూర్తి నమ్మికను ప్రభువుపై ఉంచి: ‘ప్రభువు నా కొరకు సమస్తమును చేసిన ముగించును’ అని చెప్పి స్తుతించుచున్నాడు.
ఒక వ్యక్తి అద్దె ఇంటిలో పలు సంవత్సరములుగా ఉండి మనస్సునందు నొప్పించబడి ఉండెను. ఇల్లు కట్టుటకు ధనము లేదే, ఏమి చేయుట అని బాధపడిన ఆయన ఈ వచనమును దృఢముగా పట్టుకొని ఆసక్తితో ప్రార్థించుటకు ప్రారంభించెను. ప్రభువు ఆయన కొరకు సమస్తమును చేసి ముగించుటకు చాలినంత ధనమును దయచేసెను.
అయితే, ఇల్లు కట్టే పనిలో బాధ్యతగా చూసేటువంటి సామర్థ్యత ఆయనకు లేదు. భావన నిర్మాణ కాంట్రాక్టర్లు తన వద్ద నుండి ధనమును తీసుకుని మోస పుచ్చినట్లయితే ఏమి చేయుట అను భయము ఆయనకు కలిగెను. ‘ప్రభువు నా కొరకు సమస్తమును చేసి ముగించును’ అని చెప్పి మరలా విశ్వాసముతో స్తుతించెను. అప్పుడు భావన నిర్మాణమునందు నైపుణ్యత కలిగియున్న ఆయన యొక్క పాత స్నేహితుడు ఒకడు తనకు తానుగా ముందుకు వచ్చి, ఆ బాధ్యతను స్వీకరించెను. అందమైన ఒక ఇల్లు ఆయన కొరకు కట్టి ముగించబడెను.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “ఇదిగో, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను; నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మియా. 32:27).
మీరు ఆరాధించుచున్న దేవుడైయున్న ప్రభువును తేరి చూడుడి. ఆయన మిమ్ములను ప్రేమించుచున్నాడు. అదే సమయమునందు మీ కొరకు సమస్తమును చేసి ముగించగల శక్తిగలవాడు. రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగల సమర్థుడు (లూకా. 3:8). మీ చుట్టూతాను అగ్ని రగులుకొని మండినను అందులోనుండి మిమ్ములను కాపాడుటకు శక్తిగలవాడు (దానియేలు. 3:27).
వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు (రోమీ. 4:21). మీరు అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా మిమ్ములను ఆశీర్వదించుటకు సమర్ధుడు (ఎఫేసి. 3:20). మీరు దేనిని ఆయన వద్ద అప్పగించితిరో దాని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడుటకు సమర్థుడు (2. తిమోతి. 1:12).
ఒకవేళ పరుస్థితులు భయంకరముగా ఉండవచ్చును. వైద్యులు వీలు కాదు అని చెప్పి ఉండవచ్చును. న్యాయవాదులు వీలు కాదు అని చెప్పి ఉండవచ్చును. వివాహము జరగదు, పిల్లలు పుట్టరు, ఉద్యోగము దొరకదు, పరిచర్య ఎదగదు అని పలు రకములుగా మాట్లాడి సాతాను మిమ్ములను సొమ్మసిల్లునట్లుగా చేసి ఉండవచ్చును. భయపడకుడి; మీతో ఉన్నవాడు సర్వ శక్తిమంతుడు. అన్ని పరిస్థితులయందును మీ కన్నులు అట్టి శక్తిమంతుడ్ని ప్రేమతో తేరి చూచి: ‘ప్రభువు నా కొరకు సమస్తమును చేసి ముగించును’ అని చెప్పవలెను.
సృష్టియందు మీ కొరకు సమస్తమును చేసి ముగించినవాడు, కల్వరి సిలువయందు మీ కొరకు సమస్తమును చేసి ముగించినవాడు, నేడు మీరు ఉన్న స్థితిలోను మీ కొరకు సమస్తమును చేసి ముగించువాడు.
దేవుని బిడ్డలారా, ప్రభువు మీ కొరకు సమస్తమును చేసి ముగించును. ఆయన యొక్క వాగ్దానములు నిశ్చయముగా నెరవేరును.
నేటి ధ్యానమునకై: “మహోన్నతుడైన దేవునికి, నా కార్యమును సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను” (కీర్తనలు. 57:2).
