No products in the cart.
మార్చి 19 – నిలిచియుండుడి!
“నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు” (యోహాను. 15:4).
కొన్ని సంవత్సరములకు పూర్వము వేల్స్ దేశమునందు ఒక స్వరంగమునందు పనిచేయు సిబ్బంది మిగుల భక్తిపరుడుగా ఉండెను. ఆయన దేవుని ప్రసన్నతను కొలత లేకుండా గ్రహించుటతోపాటు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుచుండు వాడుగాను ఉండెను. దాని రహస్యమును అడిగినప్పుడు ఆయన చెప్పినది ఏమిటో తెలియునా?
“అయ్యా, నేను ప్రతి దినమును ప్రశాంతమైన ఉదయకాల సమయములో ఎక్కువసేపు ప్రభువు యొక్క పాదములయందు కనిపెట్టుకొని యుందును. దాని తరువాత, ప్రభువా, ఈ జీవితమునందు నేను ఒంటరిగా నడువను. నీవు నాతో నా భాగస్వామిగా ఉన్నావు. మనమిద్దరము కలిసియె ఈ దినములోనికి వెళ్ళబోవుచున్నాము అని చెప్పి ఆ దినమున నేను చేయబోవుచున్న బాధ్యతలును, పనులును అన్నిటినిలోను ప్రభువు భాగస్వామిగా నాతో ఉన్నట్లుగా భావించుకొని పనిచేయుదును.
నేనును ప్రభువును భాగస్వామిగా ఉన్నందున నా బాధ్యతలు అని నేను దేనిని భావించటలేదు. మా బాధ్యతలు అని భావించి చిన్న చిన్న అంశములైనను ప్రభువు వద్ద ఆలోచనను అడిగెదెను. మనుష్యుడునైన నేను దేవుడునైయున్న ఆయనతో ఏకమైయున్నాను” అని ఆయన చెప్పెను.
ప్రభువును మీ యొక్క భాగస్వామిగా అంగీకరించియున్నారా? ఆయన మీ కొరకు పూటబడువాడును, మధ్యవర్తియు మాత్రము కాదు మీ యొక్క భాగస్వామిగా కూడాను ఉన్నాడు. ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడిగా ఉన్నప్పటికిని మీ ప్రతి ఒక్కరి యొక్క పనులలో అక్కర గలవాడైయున్నాడు.
మీరు ప్రభువు యొక్క చేతులలో చేయి వేసి నడువవచ్చును. హానోకు దేవునితో సంచరించెను. మధురమైన తోటివాడిగాను, పరిశుద్ధమైన తోటివాడిగాను, ఇతరులచే ఎరగబాడనివాడై మనతో నివసించు తోటివాడు.
“నేను నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను; నీ మీద దృష్టియుంచి, నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తనలు. 32:8). దేవుని ప్రసన్నతను మనము గ్రహించుచున్నప్పుడు పలు సమయములయందు సహోదరుడువలె ఆయన చెంతకు వచ్చును. స్నేహితునివలె నిండుమనస్సుతో మాట్లాడును. ప్రియమైన తండ్రివలె త్రోవ నడిపించుకొని వెళ్ళుచున్నాడు.
దావీదు రాజునకు ఒక కాపరివలె ఉండి, పచ్చికగల చోట్లలోను శాంతి కరమైన జలముల వద్దకును తీసుకొని వెళ్లి చేర్చేను. ఆయన చెప్పుచున్నాడు: “పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు, శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు” (కీర్తనలు. 23:2,3).
దేవుని బిడ్డలారా, మిమ్ములను కూడా ఆయన త్రోవ నడిపించుకుని వెళ్లునట్లుగా ఆయన యొక్క ప్రసన్నతను ఎల్లప్పుడును దృఢముగా పట్టుకొనుడి. ప్రతి ఒక్క నిమిషమును మీరు ఆయనతోను, ఆయన మీతోను ఉన్నాడు అను సంగతిని మరచిపోకుడి.
నేటి ధ్యానమునకై: “కాబట్టి, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే రక్తమాంసములు గలవాడాయెను” (హెబ్రీ. 2:14).
