Appam, Appam - Telugu

మార్చి 15 – ప్రేమా స్వరూపియైయున్నాడు!

“దేవుడు ప్రేమా స్వరూపియైయున్నాడు” (1. యోహాను. 4:8).

ప్రభువు యొక్క ప్రేమను ఈ ఉదయకాల సమయములో ధ్యానించుట మన యొక్క హృదయమును ఆనందింపజేయును. అవును, అయనవలె మనలను ప్రేమించువారు ఏ ఒక్కరును లేరు. అయనవలె ప్రేమ, కనికరముగలవారు వెరెవ్వరును లేరు. మనము ఆయనను ప్రేమించుటకు ముందుగానే ఆయన మనలను ప్రేమించెను. ఇది ఎంతటి ఆశ్చర్యమైనది!

ప్రేమాగా ఉన్నాడు అనుటకును, ప్రేమా స్వరూపియైయున్నాడు అనుటకును వ్యత్యాసము కలదు. ప్రేమా స్వరూపియైయున్నాడు అని మనము చెప్పుచున్నప్పుడు, కొనసాగించి ఎట్టి మార్పును లేకుండా నిరంతరమును ప్రేమతో ఉండేటువంటి స్థితిని చూపించుచున్నది. ప్రభువు మార్గముగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు, ఆత్మయైయున్నాడు అని మనము బైబులు గ్రంథమునందు చదువుచున్నాను. అయితే, ఈ ఒక్క స్థలమునందు మాత్రమే, ప్రేమా స్వరూపియైయున్నాడు అని బైబిలు గ్రంథము మనకు చెప్పుచున్నది. అవును, అట్టి ప్రేమ కల్లా కపటము లేని ప్రేమ. నూటికి నూరు శాతము వాస్తవమును, పవిత్రమైనదైన ప్రేమ.

ఒకసారి ఒక వ్యక్తి ఆయన చేసిన నేరమునకై ఖైదు చేయబడి కావలి వారి వాహనమునందు ఎక్కించబడెను. ఆయన పెంచిన కుక్క ఆయనకు ఏదో ఒక ప్రమాదము కలిగెను అను సంగతిని గ్రహించి, ఆ వాహనము వెంబడించి పరిగెత్తు కొనుచు వచ్చుచుండెను. ఆయన కావలి నిలయమునందు బంధింపబడియున్న ఆ రెండు దినములు కూడును ఏమియు తినక, త్రాగక అక్కడే పండుకొనియుండెను. కావలి నిలయపు వారు దానిని తరిమి చూచిరి, అది ఆ స్థలమును విడిచి పెట్టక అక్కడే ఉండెను.

మూడవ దినమున ఆయన విడిపించబడి బయటకు వచ్చినప్పుడు, ఆ కుక్క బక్కచిక్కిపోయి ఉండినప్పటికిని, తన యజమానునిపై ఉంచిన ప్రేమను వ్యక్తపరచునట్లు తోకను ఆడించుచు చెంతకు పరిగెత్తుకుని వచ్చి ఆయనను నాకుచుండెను. ఆయన యొక్క హృదయము బద్దలాయెను, నేను కావలి నిలయమునందు బంధించబడి ఉన్నప్పుడు ఎట్టి బంధువును నన్ను చూచుటకు రాలేదు, ప్రేమను వ్యక్తపరచును లేదు. అయితే ఈ ప్రేమ గల మృగము నాపై ఎంతటి ప్రేమను పెట్టియున్నది అని చెప్పి దానిని అమాంతముగా ఎత్తుకొని రొమ్మునకు హత్తుకుని కన్నీరు విడిచెను. కుక్క ఒక సాధారణమైన జీవియైయుండినను, దాని హృదయమునందు ప్రభువు ఎంతటి అత్యధికమైన ప్రేమను ఉంచియున్నాడు!

మనుష్యుని యొక్క ప్రేమ మారిపోవచ్చును, బంధువులు మరియు చుట్టాలు యొక్క ప్రేమ మారవచ్చును. అయితే దేవుడు ప్రేమా స్వరూపియైయున్నాడు. అట్టి ప్రేమ చేతనే ఆయన మనకు వాక్కును ఇచ్చుచున్నాడు: “నేను నిన్ను విడువను; నిన్ను ఎడబాయను” అని చెప్పుచున్నాడు. (యెహోషువ. 1:5). అట్టి ప్రేమతో తన యొక్క హస్తమును మీకు తిన్నగా చాపుచున్నాడు.

“నీ దేవుడనైన యెహోవానగు నేను నీ కుడిచేతిని పట్టుకొని; భయపడకుము, నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచుచున్నానడు” (యెషయా. 41:13). దేవుని బిడ్డలారా, అట్టి ప్రేమగల దేవుని వద్ద పూర్ణ హృదయముతోను, పూర్ణ ప్రాణముతోను, పూర్ణ బలముతోను ప్రేమించుటకు తీర్మానము చేయుడి. ఆయన ఎల్లప్పుడును ప్రేమా స్వరూపియైయున్నాడు. నేడు కూడా మిమ్మును బట్టి ఆయన యొక్క హృదయము ఉప్పొంగుచున్నది.

నేటి ధ్యానమునకై: “నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనైయున్నాను” (నిర్గమ. 20:6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.