No products in the cart.
మార్చి 11 – ఐక్యత వలన విజయము!
“సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!… ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. (కీర్తన. 133:1,3)
ఓటమిని జయముగా మార్చుట ఎలాగు అను సంగతిని గూర్చి కొనసాగించి ధ్యానించు వచ్చుచున్నాము. ఒక కుటుంబము సైక్యతతోను, ఏకమస్సుతోను ఉండినట్లయితే, నిశ్చయముగా విజయము కలదు. జయము పై జయము మీకు లభించవలెను అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించవలసినది అవశ్యమైయున్నది. మీరు అందరు క్రీస్తునందు సహోదురులైయున్నారు. ఆయన మీకు జేష్ఠ సహోదరుడైయున్నాడు.
మీరు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఉండవచ్చును. అయితే, సిలువ చెంతకు వచ్చి నిలబడుచున్నప్పుడు, మీరు ప్రభువు యొక్క కుటుంబ సభ్యులు అను సంగతిని గ్రహించుచున్నారు. ఒకే రక్తము మిమ్ములను కడిగి ఆలన చేసియున్నది. ఒకే ఒక తండ్రియైన దేవుడు మీకు కలడు. ఒకే ఒక్క పరిశుద్ధాత్ముని ద్వారా మీరు దప్పిక తీర్చబడియున్నారు. మీరు ప్రభువు యొక్క ఇంటివారును, ఆయన మేపేటువంటి గొర్రెలైయున్నారు.
ఒక పుల్లను తీసుకొని విరిచి వేయుట సులువు. అయితే నాలుగు పుల్లలు ఏకమై ఉన్నట్లయితే, వీరుచుట కఠినము. ఒక పశువు ఒంటరిగా ఉన్నప్పుడు సింహము దానిని కబలించ వచ్చును. అయితే, నాలుగు పశువులు కలసి వచ్చినట్లయితే, సింహము కూడా వెనుకంజ వేయును. అదే విధముగా మీరు ఒకరికొకరు ప్రార్థించి, ఒకరి భారమును మరియొకరు భరించి ఏకముగా ఉండుటకు ముందు వచ్చిన్నట్లయితే, ఒకరిపై ఉన్న మంటయు, అగ్నియును ఇతరుల పైన కూడా రగులుకొని మండును.
పొయ్యిలో పలు కట్టెలు ఉన్నప్పుడు, అవి అన్నియు కలిసి మండును. ఒక కట్టెను తీసి బయట ఉంచినట్లయితే, అది ఆరిపోవుచున్నది. మరలా ఆ కట్టెను మండుచున్న మిగతా కట్టెలతో చేర్చి ఉంచినప్పుడు, మరల చక్కగా రగులుకొని మండును. “కలసి ఉంటే కలదు సుఖము. విడిపోవుట యందు కలుగును దుఃఖము” అని లోకమందుగల ఒక కవి పాడెను.
ఒక ఇంట నలుగురు ఐదుగురు సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్లయితే, ఎవరును అంత సులువుగా వారి వద్దకు జరగడమునకు రాలేదు. అట్టి కుటుంబము కలసి ప్రార్ధించు కుటుంబముగా ఉండినట్లయితే, సాతాను ఆ ఇంటి వైపున కూడా తలను ఎత్తి చూడడు. పాత నిబంధనయందు నూట ఇరువదిమంది ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా, దేవుని యొక్క మహిమ అచటకు దిగివచ్చెను. (2. దీనవృ. 5:12,13) అని చదువుచున్నాము.
కొత్త నిబంధనయందు, నూట ఇరువదిమంది ఏక మనస్సుతో కూడి ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చెను అనుటయును, కూడియున్న అందరును పైనుండి వచ్చిన శక్తిచేత నింపబడిరి అను సంగతిని (లూకా.24: 49). సాక్షులై ఉండెను అను సంగతిని బైబులు గ్రంథమునందు (అపో.కా. 1:8) చదువుచున్నాము.
దేవుని బిడ్డలారా, మీ ఇంట మంచి ఐక్యతయు, ప్రేమయు ఆప్యాయతయు కలుగును. అప్పుడు మీ ఇల్లంతయు దేవుని ప్రసన్నతచేత నిండియుండును. ప్రభువు యొక్క ప్రసన్నత మీ ఇంట ఎల్లప్పుడు మెండుగా ఉండవలెను.
నేటి ధ్యానమునకై: 📖”ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు;….గనుక వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును” (ప్రసంగి. 4:9,10).