No products in the cart.
మార్చి 09 – కుటుంబమునందు ప్రేమ!
“పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి; అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి” (ఎఫెసీ. 5:25).
ప్రభువును ప్రేమించుచున్న ప్రతి ఒక్కరును తన కుటుంబమును ప్రేమించువారై ఉండవలెను. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబమును క్రీస్తు యొక్క ప్రేమను లోకమునకు బయలు పరచుచున్నదై ఉండవలెను.
ఎఫెసీలు 5 ‘వ అధ్యాయము నందు భర్త, భార్య, పిల్లలకు సంబంధించిన సంబంధమును గూర్చి ప్రత్యేకముగా వ్రాయబడియున్నది. భార్యలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి అనియు, పురుషులారా, క్రీస్తు సంఘమును ప్రేమించునట్లుగా మీరు మీ భార్యలను ప్రేమించుడి అనియు అపో. పౌలు ఆలోచనలు చెప్పుచున్నాడు. (ఎఫెసీ. 5:22,25).
అవును, భార్య భర్తకు లోబడవలెను. భర్త భార్యను ప్రేమింపవలెను. అప్పుడే కుటుంబమునందు ఏకమనస్సును ప్రేమ ఆప్యాయతయు ఏర్పడును. ఎట్టి సమస్యయు తల ఎత్తదు. భర్త భార్యను ఎంతగా ప్రేమించవలెను? అవును, ఆ కొలతను అపో. పౌలు వ్రాయుచున్నప్పుడు, “క్రీస్తు సంఘమును ప్రేమించుచున్నట్లుగా” అని వ్రాయుచున్నాడు. అవును, అట్టి ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమకు సాటియైనదై ఉండవలెను. ఆ తరువాత, కుటుంబమునకు అపో. పౌలు ఇచ్చుచున్న ఆలోచన తల్లిదండ్రులకును పిల్లలకును సంబంధించిన ప్రేమ ఆప్యాయతయైయున్నది.
నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” (నిర్గమ. 20:12). అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. తల్లిదండ్రుల యొక్క స్థానమును ఏ ఒక్కరు నింపజాలరు. వారు ఎంతటి వయస్సుగలవారై ఉండినప్పటికీని, వారు శ్రేష్టమైనవారే. తల్లిదండ్రులను సన్మానించుట పిల్లల యొక్క బాధ్యత.
మూడోవదిగా, మన తోటి సహోదరులను ప్రేమించునట్లు ఆజ్ఞను పొందియున్నాము (1. పేతురు. 2:17). తోటి సహోదరుని ప్రేమించుట మనకు బలముగలదిగాను, ప్రభువునకు మహిమగలదిగాను ఉన్నది. ఏ కుటుంబమునందు సహోదరులు ఐక్యమత్యముతో ఉంటున్నారో అట్టి కుటుంబమును శత్రువు సమీపించలేడు.
కొన్ని కుటుంబములు యందు ఆస్తులను పిల్లలకు పంచిపెట్టుచున్న సమయము వచ్చినప్పుడు సహోదర ప్రేమ మాయమై మరుగైపోవుచున్నది. నేడును కొన్ని కుటుంబముల యందు సహోదరుల యొక్క భార్యల పొరపాటైన చొరవ కారణముగా, సహోదరులలో చీలిక వచ్చుచున్నది. అయితే, దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితులయందును సహోదర ప్రేమ తక్కువ కాక, సహోదర ఆప్యాయత తగ్గుముఖము కాక ప్రేమించుచున్నవారై ఉండవలసినది మన యొక్క బాధ్యతయైయున్నది.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతర కారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు” (1. యోహాను. 2:10,11).
నేటి ధ్యానమునకై: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్తనలు. 133:1).
