Appam, Appam - Telugu

మార్చి 08 – పైకిలేవనెత్తు ప్రేమ!

“నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకిలేవనెత్తి నా పాదములు బండమీద నిలిపి, నా అడుగులను స్థిరపరచెను” (కీర్తనలు. 40:2).

ప్రభువు మన మీద ఉంచిన ప్రేమ మనలను పాపముల నుండి బయటకు తీసుకొని వచ్చుచున్నది. జిగట గల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తుచున్నది. అట్టి ప్రేమ మనలను వెదకి వచ్చుచున్న ఒక ప్రేమ.

ఒక గొర్రె కనబడకుండా పోయినప్పుడు కాపరి యొక్క మనస్సు ఏ విధముగా పరితపించును! రాత్రింపగళ్లు అనియు, ఎండ వాన అనియు చూడక ఆ గొర్రెను ఎంతటి అక్కరతో అతడు వెతుకుటకు ప్రయత్నించును! ఆ గొర్రె ముండ్లపదలో చిక్కుకొని యుండినట్లయితే, తన చేతులకు ముండ్లు గుచ్చుకున్నను సరే దానిని సహించుకొని ఆ గొర్రెను విడిపించును కదా?

ప్రభువు చూపించుచున్న ప్రేమలో ప్రత్యేకమైనది మన యొక్క ప్రాణమును లేవనెత్తుచున్న ఒక ప్రేమయైయున్నది. పాతాళమెక్క పట్టులో నుండియు, శత్రుయొక్క శక్తులబారి నుండియు మనలను విమోచించుచున్న ప్రేమ అది. అవును ఆయన మనలను పాతాళము యొక్క శక్తులబారి ఉండి పైకి లేవనెత్తుటకు సంకల్పించెను.

ఒకసారి ఒక బొగ్గు గనుల స్వరంగమునందు ఒక భూకంపన విపత్తు సంభవించెను. అనేకమంది సిబ్బందులు స్వరంగమునందు చిక్కుకొనిరి. పలు రకాల తాడులను తీసుకుని వచ్చి స్వరంగమునందున్న వారిని కట్టి బయటకు తీసుకుని వచ్చుటకు ప్రయత్నించిరి. ఆ ప్రయత్నమునందు వాడిన తాళ్లు మరల మరల తెగిపోట చేత ఎవరిని కూడా పైకి తెలేక పోయెను. చివరకు ఆ స్వరంగము యొక్క అధ్యక్షుడు ఒకడు కొత్త తాడును ఒకటి తీసుకుని వచ్చెను. ఆ తాడుతో కట్టి లాగినప్పుడు ప్రయత్నము విజయవంతమాయెను. అనేకులు కాపాడబడిరి. ఆ తాడు చేత మాత్రమే ఎలా తెగిపోకుండా ఉండెను అను సంగతిని పరిశీలించినప్పుడే ఆ తాడుతో పాటు ఇనుప తీగలు అల్లబడి ఉండుటను కనుగొనిరి. అదే విధముగానే మిగతా ప్రేమలన్నియును మరుగై, క్షీణించి, మార్పు చెందినవై ఉండగా ప్రభువు యొక్క ప్రేమ మాత్రమే మరుగై పోవక, క్షీణింపక, మార్పు చెందక బలము గలదైయున్నది.

క్రీస్తు యొక్క ప్రేమలోని పాశమునందు రక్తము ప్రవహించుచూనే ఉన్నది. ఆయన యొక్క కల్వరి ప్రేమ గట్లపై పోరలి ప్రవహించుచున్నది. అది ప్రాణములను ప్రభువు వైపునకు ఆకర్షించుచున్నది. జిగట గల దొంగ ఊబిలో నుండి ప్రభువు మనలను పైకి లేవనెత్తుచున్నప్పుడు ఆయన మన కొరకు రక్తపు క్రయ ధనమును చెల్లించెను అను సంగతిని మరచిపోకుడి.

మీరు యేసు క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడి పరలోకముతో జతపరచబడియున్నారు. అట్టి కల్వరి ప్రేమ యొక్క పాశము ఎన్నడును తెగిపోదు. ప్రేమ గల దేవుడు మిమ్ములను తన యొక్క ప్రేమగల పాశముతో ఐక్యపరచి ఉన్నాడు. ఆయన యొక్క చేతులలో నుండి ఎవరు మిమ్ములను అపహరింపలేరు. దేవుని బిడ్డలారా, ప్రాచీన పాపములు మిమ్ములను జయించునేమో, సాతాను మిమ్ములను అపహరించుకుని తీసుకుని వెళ్లిపోవునేమో అని ఎన్నడను కలత చెందకుడి! క్రీస్తుని రక్తము చేత కలుగజేయబడిన పాశము ఎన్నడను తెగిపోనేరదు.

నేటి ధ్యానమునకై: “విలువపెట్టి కొనబడినవారు, గనుక దేవునికి సొత్తైయున్న మీరు మీ దేహముతోను మీ ఆత్మతోను దేవుని మహిమపరచుడి” (1. కొరింథీ. 6:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.