Appam, Appam - Telugu

మార్చి 07 – అంతమువరకు ప్రేమించెను!”

“తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను” (యోహాను. 13:1).

యేసుని ప్రేమ శ్రేష్టమైనది! ఎందుకంటే ఆయన అంతము వరకు మనలను ప్రేమించుచున్నాడు. అంతము వరకు అను పదమును కాస్త ఆలోచించి చూడుడి. అంతము వరకు అనుటకు చివరి వరకు, నిరంతరము, నిత్యా నిత్యముగా అనుటయే అర్థమునైయున్నది.

అంతము వరకు అను పదము, ఆయన యొక్క లోతైన ప్రేమను మనకు వ్యక్తపరచుచున్నది. అంతేకాదు, ఆయన మనతో కూడా చేసిన ఒఢంబడికను జ్ఞప్తి పరుచున్నది. ఏ మనుష్యుడైనను కల్వరి వద్దకు వచ్చి: “ప్రభువా నీవు నా కొరకు మరణించితివి; నా యొక్క పాపము వలన మరణించితివి; ఇప్పుడు నన్ను కడిగి శుధ్దీకరించుకొనుము” అని వేడుకొనుచున్నప్పుడు, ఆయన కనికరించి వాత్సల్య పూర్ణుడై, అతనితో నిత్య ఒఢంబడికను చేసుకొనుచున్నాడు.

ప్రభువు ఒక మనుష్యుని పై ఉంచుచున్న ప్రేమ నిత్యా నిత్యమైనది, ఎన్నటికిని మారనిదైయున్నది. దానిని ఎవరైనా విరిచి వేయనే లేరు. లోకమునందు పలు రకములైన ప్రేమలను మనము చూచినను, కల్వరి శిలువయందు ప్రత్యక్షమైన అట్టి త్యాగమైన ప్రేమయే మన అంతరంగమును స్రవింపజేయు ప్రేమయైయున్నది. కల్వరి నాయకుడైయున్న క్రీస్తు మనలను ప్రేమించుచున్న ప్రేమ ప్రత్యేకమైనది. మరి ఎట్టి ప్రేమతోను పోల్చలేనిది.

“అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము” (ప.గీ. 2:3). క్రీస్తు ఈ భువికి దిగివచ్చి, మనుష్యుల యొక్క ప్రేమ కొరకు పరితపించినప్పుడు, ఆయన యొక్క నెలవరులు ఆయనను అంగీకరించక నిర్లక్ష్యము చేసిరి.

కొందరు ఆయనను పాపుల యొక్క స్నేహితుడు అని చెప్పిరి. బయిల్జెబు యొక్క నాయకుడు అని చెప్పిరి. ఆయన యొక్క ఉపదేశమును కఠినమైన ఉపదేశము అని చెప్పిరి. ఆయనను వెంబడించిన వారు కూడాను ఆయనతో నడవక వెనుతీసి నడుచుటకు ప్రారంభించిరి.

యేసు తన యొక్క శిష్యులను ఒకసారి చూసి: “మీరు కూడాను విడిచి వెళ్లిపోవలెనని యున్నారా?” అని అడిగెను. ఎంతటి దుఃఖముతో ఆయన ఆ మాటలను అడిగి ఉంటాడు అను సంగతిని ఆలోచించి చూడుడి. మనలను ప్రేమించుచున్న ప్రభువు మన యొక్క ప్రేమ కొరకు ఎంతగా పరితపించుచున్నాడు అను సంగతిని ఆలోచించి చూడుడి. అవును, జగతుత్పత్తికి ముందుగానే ఆయన మనలను ప్రేమించెను. మన కొరకు తన్నుతాను వధించబడు గొర్రె పిల్లగా అర్పించుకొనెను.

అంత మాత్రమే కాదు, మనుష్యుడ్ని ఎంతగానో ప్రేమించి, అతనిని అతి శ్రేష్టముగా సృష్టించుటతోపాటు, కల్వరి సిలువయందు కూడాను అతనిని ప్రేమించుటకు సంకల్పించి ఉండెను. సిలువలో తన యొక్క రక్తమును శరీరమును మన కొరకు అర్పించుకొనెను.

దేవుని బిడ్డలారా, ఆయన శిలువులో మాత్రము కాదు, నిత్యత్వమునందు కూడాను ప్రేమించుచున్నవాడై ఉన్నాడు.

నేటి ధ్యానమునకై: “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను” (యిర్మీయా. 31:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.