No products in the cart.
మార్చి 06 – గొప్ప ప్రేమ!
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను. 3:16).
“ఎంతో ప్రేమించెను” అని విశ్వసించుచున్నప్పుడు కల్వరి ప్రియుని యొక్క ప్రేమలోని లోతును గ్రహించగలుగుచున్నాము. అట్టి ప్రేమ యొక్క లోతును బట్టి ఆయన మన కొరకు మనుష్యుడుగా మారి భారమైన సిలువను మూసుకొని నడిచి, తన యొక్క చివరి బొట్టు రక్తమును కూడా చిందించి ఇచ్చెను. అట్టి ప్రేమ త్యాగపూరితమైన అగాపే ప్రేమ.
లోకమునందుగల అన్ని విధములైన ప్రేమ క్రీస్తు వద్ద నుండియే ప్రారంభించుచున్నది. ఆయన తన యొక్క ప్రేమ చేత ఈ లోకమును సృష్టించుటతో పాటు, తాను సృష్టించిన వాటియందు అట్టి ప్రేమను ఉంచియున్నాడు. పక్షుల అంతరంగమునందు అట్టి ప్రేమను ఉంచి వాటి పిల్లలను ప్రేమించునట్లు చేసెను. మృగముల అంతరంగమునందు ప్రేమను ఉంచి తమ పిల్లలకు పాలునిచ్చునట్లు చేసెను. మనుష్యుని యొక్క అంతరంగము నందును దాని నుంచి కుటుంబ జీవితమును ఆశీర్వాదకరమైన మార్గమునందు త్రోవ నడిపించుచున్నాడు.
ప్రేమ యొక్క ప్రారంభమే క్రీస్తే. యోహాను: “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము” (1. యోహాను. 4:19) అని చెప్పి ఆనందించుచున్నాడు. ఆయన ఎందుకని మొదట మనలను ప్రేమించెను అను సంగతిని మొదటి మనము అర్థము చేసుకొనలేక పోవుచున్నాము. ఆయన యొక్క గుణాతిశయమే ప్రేమయైయున్నది అను సంగతి మనకు తెలిసియున్నది.
ఒక భక్తుడు ప్రభువు యొక్క ప్రేమను గూర్చి అత్యధికముగా ధ్యానించి దానిని వర్ణించి ఒక కవితను వ్రాసెను. ఆ కవిత్వమునందు: “ఆకాశమునంతటిని కాగితముగా మార్చుడి. సముద్రములోని నీటినంతటిని సిరాగా మార్చుడి. లోకమునందు గల వృక్షములన్నిటిని కలముగా మార్చి అందులో సిరాను పోసి వ్రాసినను, ప్రభువు యొక్క ప్రేమను వ్రాయలేము. ఆయన ప్రేమ అంత లోతైనది, పొడవైనది, ఎత్తైనది” అని సూచించెను.
అట్టి ప్రేమ యొక్క మహత్యమును అపో. పౌలు తన జీవితమునందు గ్రహించెను. “మీరు ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు, దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయ వలెననియు, ప్రార్థించుచున్నాను” (ఎఫెసీ. 3:17,18,19).
దేవుని యొక్క సర్వశక్తిని మనిష్యుని యొక్క అభల స్థితిని ప్రవక్తయైన యెషయా పోల్చి చూచుకొని: “జనములు చేదనుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసుమీది ధూళి వంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి” (యెషయా. 40:15) అని చెప్పెను. దేవుని బిడ్డలారా, త్రాసుమీది ధూళి వంటి మనుష్యుడ్ని ప్రభువు తన యొక్క ప్రాణము కంటే మిన్నగా ప్రేమించుచున్నాడు అంటే, మనిష్యుని పై దేవుడు ఉంచియున్న ప్రేమ ఎంత గొప్పది!
నేటి ధ్యానమునకై: “తాను ఈ లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను” (యోహాను.13:1).
