No products in the cart.
మార్చి 02 – ఎర్రటి రంగుగల రోజా పుష్పము
“నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు వల్లిపద్మము వంటిదానను” (ప.గీ. 2:1).
భారతదేశము యొక్క మొదటి ప్రధాన మంత్రియైన జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక చిన్న పాప ప్రతి దినమును అందమైన రోజాను తీసుకుని వచ్చి ఇచ్చుచుండెను. ఆయన కూడాను ఆమెను సంతోషింపజేయుటకు కోరి ఆ రోజా పుష్పమును ప్రేమతో తీసుకుని, తన యొక్క వస్త్రమునకు దానిని పెట్టుకొను చుండెను. ఇక దినములు గడిచే కొలది ఆయనకు రోజా పుష్పముపైన అమితమైన మక్కువ కలిగెను. అందుచేత, తన ఇంటి వెనక భాగమునందు గల స్థలములో ఒక అందమైన రోజా తోటను వేసుకొని, ప్రతి దినమును తనకు ప్రియమైన రోజా పుష్పమును తుంచి వస్త్రమునకు పెట్టుకొను చుండెను.
ఆయన మరణించినప్పుడు ఆ తోటమాలి ఒక రోజా పుష్పమును తుంచి తీసుకొని పరిగెత్తుకొని వచ్చెను. ‘బాపూజీ, మీరు కోరుకునే పువ్వును తీసుకొని వచ్చియున్నాను, కన్నులను తరిచి చూడండి, దీనిని తీసుకొని మీ వస్త్రమునకు పెట్టుకొనుడి’. అని చెప్పి బోరున ఏడ్చెను. అయ్యో! నిత్యమైన ఔన్నత్యమును ఇచ్చు పరలోకపు షారోను రోజాను ఆయన తన వస్త్రమనకు పెట్టుకొనలేదు.
రోజా పుష్పము యొక్క రంగు ఎరుపు రంగైయున్నది. అది యేసు యొక్క రక్తమును, త్యాగమును, కల్వరి మరణమును ప్రేమతో జ్ఞాపకముచేయుచున్నది. లిల్లీ పుష్పము ధవళ వర్ణముతో యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను, పవిత్రమైన జీవితమును బయలుపరచుచున్నది. అవును! ఆయన ధవళ వర్ణుడును, రక్తవర్ణుడు కదా!
నేను ఒకసారి యెరూషలేమునందు గల గెథ్సమనె తోటకు వెళ్లియున్నప్పుడు, యేసు రక్తమును చెమటగా చిందించిన స్థలములో ఎర్రటి రంగులో అందమైన పుష్పములు పూచి, క్రీస్తు యొక్క రక్తమే చిందింపబడియున్నదా అని తలంచునట్లుగా కనబడుచున్నది. అక్కడ ప్రభువు యొక్క ప్రేమను, కల్వరి యొక్క నేస్తమును అత్యధికముగా ధ్యానించాను.
ఆయన కల్వరి గుట్టపై కొట్టబడి, నలగగొట్టబడి అమూల్యమైన తన రక్తమునంతటిని చిందించి ఇచ్చెను. మనలను అమూల్యమైన వారిగా మార్చవలెను అనుట కొరకు ఆయన చేసిన త్యాగము ఎంతటి శ్రేష్టమైనది! భరించలేని శ్రమలను సహించినను, అనేకమందియైన తన సంతానమును మహిమలో సమకూర్చి చేర్చెదను అను దృఢనిశ్చయముతో ఆయన ముఖము సారోను రోజావలె వికసించి ఉండెను. ఆయన కలతచెందాను లేదు, భయపడను లేదు.
మనము ఏ స్థలమునకు వెళ్ళినను సారోనురోజాను మనతోపాటు తీసుకుని వెళ్లుదముగాక! క్రీస్తు యొక్క గుణాతిశయములను మనతో తీసుకుని వెళ్లుదుముగాక! మన యొక్క జీవితమును ఆయన కొరకు సుగంధ సువాసనగా మార్చుదుముగాక! అప్పుడే సంతోషము చేత నింపబడినవారిగాను, సమస్త మేలుల చేత నింపబడినవారిగాను మనము కనబడుదుము.
మీరు ఒక రోజా పుష్పమును తీసుకుని దానిని చేతులతో నలిపివేసినను, కాళ్లతో తొక్కి వేసినను అది బదులుకు మీ చేతులను కాళ్ళను పరిమళింప చేయుచున్నది. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే పగయు, ద్వేషమును ఉంటున్నదో అక్కడ ప్రేమను, ఎక్కడైతే చేదును, గాయములును ఉన్నదో అక్కడ క్షమాపణను, ఎక్కడైతే సందేహము ఉన్నదో అక్కడ విశ్వాసమును మనము బాహ్యముగా కనబరచవలెను.
నేటి ధ్యానమునకై: “మా ద్వారా …. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచున్న …. దేవునికి స్తోత్రము. రక్షింపబడువారి పట్లను, నశించువారి పట్లను, మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము” (2. కోరింథీ. 2:14,15).
