No products in the cart.
ఫిబ్రవరి 26 – దూరముగా ఉండుడి!
“ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి” (1. థెస్స. 5:22).
పరిశుద్ధమైన జీవితము జీవించవలెను అంటే మన యొక్క అంతరంగమునందు స్థిరమైన తీర్మానమును, అర్పణయు కావలెను. దూరముగా ఉండవలెను అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నప్పుడు, దూరముగా ఉండవలసిన వాటిని విడిచిపెట్టి, దిట్టముగా విడిచి పెట్టవలెను. లోక స్నేహితులను విడిచి, అపవిత్రమైన తలంపులను విడిచి, తలంపుల్లోనికి తీసుకుని వచ్చుచున్న సమస్తమును విడచి పెట్టవలసినది అవస్యము.
చిన్న, చిన్న పాపములే కదా, అని తలంచి వాటిలోనికి ప్రవేశించినట్లయితే, ఆ తరువాత అందులో చిక్కుకొని పట్టబడుదురు. దినములు గడిచే కొలది దానికి బానిసలై తపించవలసిన పరిస్థితిలోనికి వచ్చెదరు. పాపము చేయుచున్నవాడు పాపమునకు బానిసయైయున్నాడు అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది కదా! ఒక్క సిగరెట్టే కదా అని ప్రారంభించి, ఆ తరువాత పొగ పట్టు అలవాటునకు బానిసలై పోవుచున్నారు. స్నేహితులను అధికారులను సంతోషపరచుట కొరకు కొద్దిపాటి మత్తు పానీయ్యమే కదా అని సేవించి, ఆ తరువాత అందులోనే చిక్కుకొని పోవుచున్నారు. చెడును అలవాటు చేసుకొనుట సులువే, విడిచిపెట్టుట బహుకఠినము.
ఒకసారి వరద పొంగు వచ్చినప్పుడు మార్గమునందున్న వృక్షములు, చెట్లు, తీగల అన్నియును కొట్టుకొని వచ్చెను. వాటితో పాటు కలిసి ఒక నల్లటి కంబలి తేలుచు వచ్చుచున్న సంగతిని ఒకడు చూచెను. దానిని తీసుకొనవలెనని తలంచి, వేగముగా ఈదుకుని వెళ్లి ఆశతో దానిని పట్టుకున్నప్పుడే అది ఒక ఎలుకబంటి అను సంగతిని గ్రహించెను. అది అతనిని గట్టిగా పట్టుకొనెను. ‘అయ్యో, కాపాడండి’ అని కేక పెట్టి విలపించెను. గ్రామ ప్రజలు అతని కేకకు బదులు ఇచ్చి, “దానిని విడిచిపెట్టి రమ్ము” అని చెప్పిరి. అందుకు అతడు చెప్పెను: “మొదట నేనే దానిని పట్టుకున్నాను. ఇప్పుడు అది నన్ను పట్టుకొనెను. విడిచి పెట్టుటకు కోరుచున్నాను, నావల్ల విడిపించుకో లేకపోవుచున్నాను” అని చెప్పెను. పాపపు అలవాట్లు కూడాను అలాగునే.
ఈ లోకమునందు మనుష్యులు పలు ఆశేఛ్చల తట్టునకు పరిగెడుచున్నారు. సంతోషమును ఇచ్చును, సమాధానమును ఇచ్చును అని తలంచి దుష్కార్యములలో చిక్కుకొనుచున్నారు. ఎండమావులను వెతికి విడవక పరిగెత్తి, దప్పికతో తపించి చనిపోవు దుప్పులవలె మనుష్యులు పాపేఛ్చలను వెతుకుచూ వెళ్లి పట్టుకొని తరువాత అందులో పడిపోయి లేవకుండునట్లు తపించుచున్నారు. సాతాను కూడా అట్టి వారిని వాడుకొనుచున్నాడు.
పాపపు అలవాటులను చిగురు లోనే తుంచి పారవేయుడి. పరిశుద్ధమైన జీవితమునకు పరిపూర్ణముగా సమర్పించుకుని క్రీస్తును విడవక పట్టుకొనుడి. అప్పుడు మీ కాళ్లు జారుచున్నప్పుడల్లా ఆయన యొక్క కృప మిమ్ములను ఆదుకొనును. ఆయన తొట్టిలకుండా మిమ్ములను కాపాడుటకు శక్తి గలవాడైయున్నాడు.
విషపు మొక్కలు ఎంతటి పచ్చగా కనబడినను మనము వాటిని మనకు ఆహారముగా తీసుకొనము. పంచజ్ఞానము గల జీవులు కూడా వాటిని గుర్తించి తొలగి ప్రక్కకు పోవుచున్నాయి. అదేవిధముగా ఆత్మీయ జీవితమునందును మనము అత్యధిక జాగ్రత్తగాలవారమై ఉండవలెను. దేవుని బిడ్డలారా, కీడుగా కనబడుచున్న ప్రతి వాటిని విడచి దూరముగా ఉండుడి.
నేటి ధ్యానమునకై: “మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి” (ప.గీ. 2:15).