Appam, Appam - Telugu

ఫిబ్రవరి 14 – వహించుచున్నాడు!

“ఆయనే మన బలహీనతలను వహించుకొని, మన రోగములను భరించెను” (మత్తయి. 8:17).

మన యొక్క బలహీనతలను, రోగములను ఆనందముతో వహించుచున్న ప్రియ ప్రభువును తేరి చూచుచున్నప్పుడు, మన యొక్క అంతరంగము ఆనందముతో పరవశించుచున్నది. మన యొక్క కండ్లు ఆనంద భాష్పాములను కురిపించుచున్నది. అయనవలె మనలను ప్రేమించువారు వేరెవ్వరు కలరు? నిజముగానే ఆయన మన బలహీనతలను ఆనందముతో వహించెను. రోగములనంతటిని సిలువపై మోసి తీర్చెను.

లోకస్థులను చూడుడి‌. ఒకరి యొక్క బలహీనతలను వహించువారు ఏ ఒక్కరును లేరు. ధనము ఉన్నట్లయితే దానిని పంచుకునేంతవరకు అనేకులు ముందుకు వచ్చేదరు. ఒకరి యొక్క సంతోషమును, ఔనత్యమును, పేరు ప్రఖ్యాతులను పంచుకొనుటకును, వహించుకొనుటకును విస్తారమైనవారు వచ్చెదరు. అయితే, మరొక్కరి యొక్క వేదనలను, కన్నీళ్లను, రోగములను వహించుటకైతే మనుష్యులు ఎవరును లేరు అనుట లోకము యొక్క పరిస్థితియైయున్నది.

ఒక బిడ్డ రోగముచేత పీడింపబడుచున్నది అని అనుకున్నట్లయితే, ఆ బిడ్డ యొక్క తండ్రి ఆ ఆరోగమును వహించుటకు గాని, భరించుటకు గాని ఉండదు. మహా పోతే ఒక వైద్యుని అయితే తెప్పించగలడు. బిడ్డ నొప్పి చేత విలవిలలాడినట్లయితే ఏదో ఒక నొప్పి నివారణ మందును ఇచ్చి, వైద్యుని వద్ద బతిమిలాడ గలడు. ‘నా బిడ్డ యొక్క వేదనను నావల్ల చూస్తూ ఉండలేను అని’ కాళ్ళ మీద పడి పతిమిలాడవచ్చును.

యోబు యొక్క పరిస్థితిని చూడుడి. తన పిల్లలను, ఆస్థిని కోల్పోయి నిలబడియున్న పరిస్థితిలో శరీరమంతయును భయంకరమైన వ్యాధియు, ఆయనను పట్టుకొనెను. అప్పుడు, ఆయన యొక్క భార్య: ‘నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణముకమ్ము” అని అనెను (యోబు. 2:9).

మీయొక్క దుఃఖ సమయమునందు మిమ్ములను ఆదరించుటకు ఒకరు కూడా లేక పోయినను. అయితే, ఒక్క సంగతిని మాత్రము మర్చిపోకండి. మనలను అంతరంగీక ప్రేమ చేత ప్రేమించుచున్న క్రీస్తు ఒకడు ఉన్నాడు. మన కొరకు ఆయన శరీరమంతయు కొరడాలచే కొట్టబడుటకు సమర్పించుకొనెను. దెబ్బలను వహించెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుచున్నాము అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. మన యొక్క రోగములను వ్యాధులను ఆయన భరించి వహించుటకు గల గుర్తే ఆయన యొక్క గాయములును దెబ్బలునైయున్నది.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి” (1. పేతురు. 2:23,24).

దేవుని బిడ్డలారా, ఆయన ముందుగానే వాటిని భరించి తీర్చి వేసినందున, మీరు దుఃఖముతో ఎందుకు వాడిపోవలెను? అట్టి కల్వరి సిలువను తేరి చూడవలెను. అక్కడ మీకు ఆదరణ కలదు. మీకు విడుదల కలదు.

నేటి ధ్యానమునకై: “మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను; ఇవి మీకు మహిమ కరములైయున్నవి” (ఎఫెసీ. 3:13).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.