No products in the cart.
ఫిబ్రవరి 08 – శక్తి కావలెను!
“ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన దానిని, మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి వచ్చు శక్తిని పొందువరకు యెరూషలేము పట్టణములో నిలిచియుండుడి” (లూకా. 24:49).
నేడు ఎక్కడ చూచినను దేవుని యొక్క బిడ్డలు శక్తి కొరకు తపించుచు ఉండుటయును, అభిషేకము కొరకు కనిపెట్టుకొని ఉండుటయును, నూతన బలముచే నింప బడవలెను అనియు ఆశించుటను చూచుచున్నాము. “శక్తి కావలెను దేవా, శక్తిని దయచేయుము దేవా. నేడే కావలెను దేవా, ఇప్పుడే దయచేయుము దేవా” అని మనము పాడుచున్నాము.
అవును మనకు వాస్తవముగానే శక్తి కావలెను. పాపమును జయించుటకు శక్తి కావలెను. శత్రువును లోబరుచుకొనుటకు శక్తి కావలెను. లోకమును శరీరమును జయించుటకు శక్తి కావలెను. విజయవంతమైన క్రైస్తవునిగా తలెత్తుకుని నడుచుటకు శక్తి కావలెను. ఆ శక్తి మనుష్యుని యొక్క శక్తి కాదు. పైనుండి వచ్చుచున్న శక్తి. పరిశుద్ధాత్ముని వద్దనుండి వచ్చుచున్న శక్తి.
కీర్తనకారుడు దిట్టముగాను స్పష్టముగా చెప్పుచున్నాడు: “బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను” (కీర్తనలు. 62:11). అవును, దేవుని వద్ద మెండైన శక్తి కలదు.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు, యెహోవా అతనికి ప్రత్యక్షమై: నేను సర్వశక్తిగల దేవుడను; నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము” అని చెప్పెను (ఆది.కా. 17:1).
మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కించలేని అద్భుత క్రియలను చేయుటకు శక్తిగల దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏదియు లేదు.
మీరు ప్రార్ధించుచున్నప్పుడు, ప్రభువు అట్టి శక్తిని మీకు అనుగ్రహించుచున్నాడు. ఉన్నతమైన బలము చేత మిమ్ములను నింపుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చుచున్నప్పుడు మహోన్నతమైన దేవుని యొక్క శక్తిని మీరు స్వతంత్రించుకొనుచున్నారు.
మీకు శక్తి పైనను, పైనుండి వచ్చు శక్తిపైనను, అభిషేకము పైనను ఆకలి దప్పిక ఉన్నదా? దాని కొరకు తపించి, కాంక్షించి దేవుని సముఖమునకు వచ్చుచున్నారా? ఆ శక్తి కొరకు ఉపవాసముండి ప్రార్థించుచున్నారా? ఆత్మీయ వరములచే అలంకరింపబడుటకు మీకు ఇష్టమా?
ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉండుట నూతన బలమును మనకు తీసుకొని వచ్చుచున్నది. పైనుండి వచ్చు బలమును పొందుకునేంతవరకును మనము కనిపెట్టుకొని ఉండుట అవశ్యము. కనిపెట్టు కొనియున్న దావీదు రాజు: “గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్మును పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నాకొరకు పొంచియున్ననవారి గతి నా కన్నులు ఆశతీర చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను” అని చెప్పుచున్నాడు (కీర్తనలు. 92:10,11). ఇట్టి ప్రార్థన తరువాత దావీదునుకు సమస్తము విజయమే.
దేవుని బిడ్డలారా, మిమ్ములను బలపరచుటకు, తన యొక్క శక్తి చేత నింపుటకు ప్రభువు ఆసక్తితో ఉన్నాడు. ప్రభువు యొక్క సముఖమునందు ఏకాంతములో కనిపెట్టుకొనియుండి ప్రార్థించి బలమును పొందుకొనుట మీ చేతులలో ఉన్నది.
నేటి ధ్యానమునకై: “నన్ను బలపరచు క్రీస్తునియందే నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పీ. 4:13).
