Appam, Appam - Telugu

ఫిబ్రవరి 07 – యేసు యొక్క వ్యక్తిగత ప్రార్థన!

“వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమై యుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను” (యోహాను. 17:21).

యేసు క్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రార్థన గూర్చి కొత్త నిబంధన అంతయును గమనించి చూచుచున్నప్పుడు, మిగుల పొడవాటి వ్యక్తిగత ప్రార్థనను యోహాను 17 ‘వ అధ్యాయమునందు చూచుచున్నాము. ఆ ప్రార్ధనను చదివి చూచినట్లయితే అది మనకు తాజా తనాని, ఉత్సాహమును ఇచ్చుచున్నది. మనము కూడాను ప్రార్థించునట్లుగా మనకు మాదిరిక్రరముగా దారి చూపుచున్నది.

వ్యక్తిగత ప్రార్థన దేవునితో సంభాషించుటకు మనలను పూరికొల్పి లేపుచున్నది. హృదయమును దేవుని ఎదుట కుమ్మరించుటయే ప్రార్ధనయైయున్నది. సంచలమును, చింతలను ఆయన పాదములయందు పెట్టుటయే ప్రార్ధన.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “జనులారా, యెల్లప్పుడును ఆయనయందు నమ్మికయుంచుడి; ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి; దేవుడు మనకు ఆశ్రయము” (కీర్తనలు. 62:8). “బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱ పెట్టుచున్నాను; నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ జెప్పుకొనుచున్నాను” (కీర్తనలు. 142:2). “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి” (1. పేతురు. 5:7).

యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రార్థనను కాస్త శ్రద్ధతో గమనించినట్లయితే ఆయన ఆనాడు ఉన్న శిష్యులు కొరకు ప్రార్థించుట మాత్రము గాక, నేడు జీవించుచున్న మన కొరకు కూడాను కలిపి ప్రార్థించెను అను సంగతిని తెలుసుకొనవచ్చును.

మరల పైన సూచింపబడియున్న ప్రార్ధనను చదివి చూడుడి. “తండ్రి, నేను నా శిష్యులైయున్న వీరికొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరి కొరకును ప్రార్థించుచున్నాను” అని చెప్పుట మిమ్ములను నన్ను కూడాను ఏకము చేయుచున్నది కదా!

ఆనాడు మన కొరకు ప్రార్ధించిన యేసు నేడు కూడాను మన కొరకు ప్రార్ధించుచూనే ఉన్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” (రోమీ. 8:26). క్రీస్తు మన కొరకు చేయుచున్న ప్రార్థనను అపో. పౌలు గ్రహించి: “చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును; దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే” అని సూచించుచున్నాడు (రోమీ. 8:34).

నా కొరకు ప్రార్థించుటకు ఎవరూ లేరే అని ఇకమీదట మీరు కలత చెందవలసిన అవసరము లేదు. నా యొక్క భారమును ఎవరు మోయుదురు, నా యొక్క కన్నీటిని ఎవరు తుడుచుదురు. నా యొక్క బాధలను ఎవరు తీసివేయదురు అని కలవరము చందవలసిన అవసరము లేదు. దేవుని బిడ్డలారా నేడును యేసుక్రీస్తు దేవుని యొక్క కుడి పాషమునందు ఉండి, ఉచ్చరింప శక్యముకాని గొప్ప మూలుగులతో, మన కొరకు విజ్ఞాపన చేయుచునే ఉన్నాడు.

నేటి ధ్యానమునకై: “సీమోనూ, సీమోనూ, ఇదిగో, సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు అనుమతిని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పి పోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనస్సు (తిరిగిన) స్థిరపడిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను” (లూకా. 22:31,32).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.