No products in the cart.
ఫిబ్రవరి 06 – ప్రతి ఉదయమును నూతన కృప!
“ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది” (విలా.వా. 3:22,23).
ఉదయకాలమున లేచి వ్యక్తిగత ప్రార్థన చేయుచున్నవారు, ప్రతి ఉదయమును నూతన కృపలను పొందుకొనుచున్నారు. అవును, మనము నిర్మూలము కాకుండా ఉండుట ప్రభువు యొక్క కృపయే. ఆయన యొక్క వాత్సల్యము ఎడతెగక నిలుచుచున్నది. ప్రభువు యొక్క కృప ప్రతి ఉదయమును నూతనముగా ఉన్నది.
పాత నిబంధన కాలమునందు ప్రతి ఉదయమును ప్రభువు మన్నాను ఇశ్రాయేలీయుల యొక్క పాళెమునందు కురిపించుచూ వచ్చెను. ప్రతి దినమును నూతన మన్నా కురిచూనే ఉండెను. మునుపటి రోజు యొక్క మన్నాను మస్సటి రోజునకు ఉపయోగించలేము. ఒక్క రోజులోనే అది చెడిపోవును.
వేడిమికి అది కరిగిపోవును అనుటచేత, సూర్యుని యొక్క వేడిమి అధికమైన తర్వాత దానిని నేల మీద నుండి తీయలేము. ఒక కుటుంబము కొరకు మరొక్క కుటుంబము తీసి పెట్టను లేదు. ఒక్కొక్క కుటుంబమునకు కావలసిన మన్నాను ప్రభువు కురిపించుచున్నాడు. అట్టి మన్నా దేవుని యొక్క కృపను బయలుపరచుచున్న ఒక అంశమునైయున్నది.
దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నూతన కృప మిమ్ములను ఆవరించునట్లు ప్రతిదినమును మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్ధించుడి. మీరు అలాగున చేయుచున్నప్పుడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు (యెషయా. 54:10) అను తన యొక్క వాగ్దానమును కనికరముగల ప్రభువు మీ యొక్క జీవితమునందు నెరవేరునట్లు చేయును.
ప్రభువు మనకు అనుగ్రహించుచున్న కృప ఎటువంటి కృప? అది ఎన్నడును మనలను విడచి ఎడబాయని కృప. దేవుడుని ఎల్లప్పుడును ప్రార్థనయందు వెదుకుచున్న దావీదును చూచి దేవుడు: “దావీదు, సౌలు యొద్ద నుండి నా కృపను ఎడబాపినట్లుగా నేను నీ కుమారుడైన సలోమోను వద్దనుండి నా కృపను ఎడబాపను” అని వాక్కును ఇచ్చెను.
“నేనతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ సంతానమును, నీ రాజ్యమును, నీ మట్టుకు నిత్యము స్థిరమగును” (2 సమూ. 7:14-16) అని ప్రభువు చెప్పుచున్నాడు.
సొలోమోను ఎన్నోసార్లు ప్రభువును విడచి, దేవుని మార్గమును విడిచి వైతొలగి పోయినను, ప్రభువు కృపతో సొలోమోనుపై కనికరించెను. దావీదు యొక్క ప్రార్ధన దావీదు యొక్క కుమారునిపై కృపను తీసుకుని వచ్చెను. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన మీకు మాత్రము కాదు, మీయొక్క పిల్లల పిల్లలపైనను దేవుని కృపను తీసుకొని వచ్చుచున్నది.
దేవుని బిడ్డలారా, దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మనకు కృపను చూపించియున్నాడు. అవును, అది సంపూర్ణమైన దేవుని యొక్క కృప. అది ఫలించి అభివృద్ధిచెందు దేవుని యొక్క కృప. అది మనలను విడిచి ఎన్నడును ఎడబాయని దేవుని కృప.
నేటి ధ్యానమునకై: “యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక” (2 పేతురు. 1:1,3).
