నవంబర్ 22 – వేషధారణ!
“గ్రుడ్డిపరిసయ్యుడా! గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపలట శుద్ధిచేయుము” (మత్తయి. 23:26).
ఒక భోజనపు పాత్రయైనది వెలుపట శుభ్రముగా ఉండుటకంటేను లోపట శుభ్రముగా ఉండుట మిగుల ఆవశ్యము. అనేకమంది వెలుపట మాత్రమే శుభ్రపరచుకుని ఆకర్ష్నియ్యముగా కనబడుచుందురు. అయితే ప్రభువు, లోపటి భాగమునే చూచువాడు. అంతరంగ పరిశుద్ధతనే కాంక్షించువాడు.
వేషధారులను, “సున్నము కొట్టబడిన సమాధి” అని యేసు పిలిచెను. వెలుచూపునకు సౌందర్యముగా కనబడును. లోపలయైతే కల్మషమును, ఎముకలును, దుర్గంధమును మొదలగు వాటిని కప్పి పెట్టి వెలుపట భాగము మాత్రము తెల్లాగా మార్చి, స్పటిక రాళ్లను పేర్చి పరిశుద్ధమైనదిగా కనపడునట్లు చేయుచున్నారు.
అలాగునే పరిశయ్యులును, సదుకయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును మనుష్యుల ఎదుట తమ్మును భక్తిపరులవలే కనబరిచి నటించుచున్నారు. అయితే ప్రభువు, వారి యొక్క ముఖరూపమును చూచి మోసపోవుటలేదు. “గ్రుడ్డి పరిసయ్యుడా, గుడ్డివారికి త్రోవ చూపుచున్న గ్రుడ్డివారులారా” అని వారిని వేదనతో పిలుచుచున్నాడు.
ఒక పాఠశాల విద్యార్థి ఒక దుకాణమును పగలగొట్టి దొంగిలించినందున ఖైదు చేయబడెను. వెలుచూపునకు అతడు మంచి బాలుడే. చక్కటి ఒక ధనికుల కుటుంబమునందు పుట్టినవాడే. అతడు దొంగిలించవలెను అను అవసరము గాని, ధనాపేక్షతో ఆ కార్యమును చేయలేదు.
పలు నిపునులైన ఆలోచనకర్తలు అతని వద్ద మాట్లాడి, అతని గూర్చి పరిశోదించినప్పుడు, అతడు చెప్పిన మాట: “నేను ఎందుకని ఇలా చేసాను అను సంగతి నాకు తెలియలేదు. నాలో ఉన్న ఒక విరక్తిగల గ్రహింపే దీనికి గల కారణము. కస్మాత్తుగా నా యొక్క తల్లిదండ్రులు ఇకమీదట నీవు కాలి బంతాటను ఆడుకూడదు, వెళ్లకూడదు, నీ స్నేహితులతో చేరకూడదు అని కఠినముగా నిషేధించారు. అది నా మానసిక స్థితిని దెబ్బతీసింది. నా యొక్క ద్వేష భావాలను మనస్సులో అనుచుకోలేక నా వేదనను వారికి తెలియజేసి వారి యొక్క మనస్సును గాయపరచవలెను అనుటకొరకే అలా నడుచుకున్నాను” అని చెప్పెను.
క్రైస్తవ జీవితమునందు తలంపులు, ఆలోచనలు, ఊహలు అను ఒక రంగమును, ఆచరణ అను మరొక్క రంగమును కలదు. తలంపులయందు పరిశుద్ధత ఉండినట్లయితే ఆచరణలోను పరిశుద్ధత ఉండును. ఒక చెట్టు యొక్క వేరులు పరిశుద్ధమైనట్లయితే దాని కొమ్మలు కూడాను పరిశుద్ధముగా ఉండును.
పరిశుద్ధతకు చెందినంత మట్టుకు, అంతరంగ పరిశుద్ధతకు మనము మిగుల ప్రాముఖ్యతను ఇవ్వవలెను. దాని కొరకు బాహ్యమైన పరిశుద్ధతయందు శ్రద్ధను ఉంచకూడదు అనుటకాదు, అంతరంగమందును పరిశుద్ధముగా ఉండవలెను అనుటయే ప్రభువు యొక్క గురి. బాహ్యమందు కూడాను ప్రభువు యొక్క స్వారూప్యమును మనము ప్రతిభంమించవలెను. బాహ్యరూపము ఇతరులకు ఆటంకముగా ఉండకుండునట్లు మన యొక్క పరిశుద్ధతను కాపాడుకొనవలసినది అవశ్యము. దేవుని బిడ్డలారా, ప్రభువు మీ జీవితము యొక్క ఉద్దేశమును చూచుటకు కోరుచున్నాడు. అది పరిశుద్ధతగలదై ఉన్నదా? ప్రభువు ఎదురుచూచుచున్న పరిశుద్ధత మీయందు కనబడుచున్నదా?
నేటి ధ్యానమునకై: “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును, నా హృదయ ధ్యానమును, నీ దృష్టికి అంగీకారములగును గాక” (కీర్తనలు. 19:14).
