bandar togel situs toto togel bo togel situs toto musimtogel toto slot
Appam, Appam - Telugu

నవంబర్ 17 – బంగారముగాను, మేలిమి బంగారముగాను!

“నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగని దేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను” (యిర్మీయా. 2:2).

‘నేను ఎప్పుడంతా ప్రభువును సన్నిహితముగా సమీపించవలెను అని తలంచుచున్నానో, అప్పుడంతా నా జీవితములో పోరాటము అత్యధికముగా పెరుగుచున్నది. శోధనలన్నియును తట్టుకోలేక చాలును ప్రభువా అని చెప్పవలసినదై యుండును’ అని అనేకులు లోక ప్రకారముగా దుఃఖముతో చెప్పుటను వినియున్నాను.

చాలును ప్రభువా, నా ప్రాణమును తీసుకొనుము అని చెప్పి విలపించుట సహజమైనదే. శోధనలును, శిక్షలును, బాల్య క్రైస్తవులకు మాత్రము కాదు, ఎదిగిన క్రైస్తవులకు కూడాను వచ్చుట వాస్తవమే. అయితే ఇట్టి శోధనలును, శిక్షలును మిమ్ములను దుఃఖములో ముంచి వేయుటకు కాదు, బంగారమును పుటమువేసి మేలిమి బంగారముగా మార్చుట కొరకే అను సంగతిని మరిచిపోకూడదు.

ఇట్టి శోధనల సమయములయందే అత్యధికముగా ప్రభువును పట్టుకొనవలెను. ఆయన యొక్క కృపలో ఆనుకొనవలెను. ఆయనను ప్రేమించుటకు మీ యొక్క హృదయమును త్రిప్పవలెను. భక్తుడైన యోబును అత్యధికమైన శోధనలును, తట్టుకోలేని శోధనలును అన్ని వైపుల నుండి తుఫానువలె దాడి చేసెను.

అట్టి సమయమునందు ఆ భక్తుడు చెప్పెను: “నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు; పడమటి దిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు, దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు. నేనాయనను కనుగొనలేను. అయినను

నేను నడచు మార్గము ఆయనకు తెలియును; ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును” (యోబు. 23:8-10). యోబు యొక్క అట్టి నమ్మిక శిక్షలను తట్టుకొనుటకును, శోధనలను జెయించుటకును సహాయకరముగా ఉండెను.

ఒక కంసాలి ఎంతవరకు బంగారమును పుటము వేయును? మొదటిగా, ఆ బంగారమునందుగల అపవిత్రతలను, మస్టులను పూర్తిగా తొలగించి పుటము వేయను. రెండోవదిగా, ఆ కంశాలి యొక్క ముఖము ఆ బంగారమునందు తేటగా కనబడేంతవరకును పుటము వేయును. అదేవిధముగా ప్రభువు మనలను అమూల్యమైన వారిగా చూచి, ఆయన యొక్క పోలికలో రూపాంతరము చెందు వరకును పుటము వేయుచునే ఉండును.

ప్రభువునకును మనకును ఉండవలసిన సత్సంబంధమును బైబిలు గ్రంథమునందు పలు రకాల ఉదాహరణముల ద్వారా చెప్పబడియున్నది. కుమ్మరికిని జికట మన్నునకును గల సంబంధము, కాపరికిని గొర్రెలకు గల సంబంధము, మూలరాయికిని, దానిపై కట్టబడుచున్న జీముగల రాళ్లకు మధ్యగల సంబంధము అని పలురకాల సంబంధములు ఉండినప్పటికీని, పెండ్లి కుమారునికి తగిన పెండ్లి కుమార్తెగా ఉండవలెను అను సంబంధమే మహా గొప్ప ఉన్నతమైన సంబంధమునై ఉన్నది.

దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలపు శ్రమలు ఇక మనయందు బయలుపరచ బడుచున్న మహిమకు సాటియైనది కాదు. మీరు పరిశుద్ధులుగా అట్టి తేజోమయమైన దేశమునందు దేవుని దూతలు మిమ్ములను ఎంతగానో ఉత్సాహముతో ఆహ్వానించెదరు!

నేటి ధ్యానమునకై: “ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలే” (ప్రకటన. 19:8)..

Leave A Comment

Your Comment
All comments are held for moderation.