No products in the cart.
నవంబర్ 14 – పారిపోవును!
“ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును (ఎగిరి) పారిపోవును” (యెషయా. 35:10).
యెహోవాచేత విమోచింపబడినవారి తట్టునకు ఆనందమును, సంతోషమును పరిగెత్తుకొని వచ్చును. అదే సమయములో దుఃఖమును, నిట్టూర్పును పారిపోవును. దుఃఖమును తీసివేసేటువంటి యేసుక్రీస్తే అట్టి అద్భుతమును మీ యొక్క జీవితములో చేయుచున్నాడు.
ఆదామును అవ్వయు ఏనాడైతే పాపమును చేసారో, ఆ దినము మొదలుకొని భూమికి శాపము అనుచున్న దుఃఖము వచ్చెను. స్త్రీ బాధపడి గర్భవేదనను సంధించ వలసినదైయుండెను. “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములుగలవాడై మిక్కిలి బాధనొందును” (యోబు. 14:1). “నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదు” (అది.కా. 47:9).
సొలోమోనునకు విస్తారమైన జ్ఞానమును, సంపదయు, ఐశ్వర్యమును, పేరు ప్రఖ్యాతులును ఉండినప్పటికీని కూడాను, దుఃఖము ఆయనను కూడాను విడిచిపెట్టలేదు. “సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలనన్నిటిని నేను గమనించి చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాసపడు బాధపడునట్టున్నవి” అని ఆయన చెప్పెను (ప్రసంగి. 1:14).
యేసుక్రీస్తు ఇట్టి దుఃఖము యొక్క వేదనలో నుండి మనలను విమోచించుటకు సంకల్పించుచున్నాడు. దాని కొరకే ఆయన ఇట్టి దుఃఖముతో నిండిన లోకమునకు దిగివచ్చెను. దుఃఖములో నుండియు, వేదనలో నుండియు మనలను విమోచించుటకై తన యొక్క రక్తమునే విమోచన క్రయ ధనముగా సమర్పించుకొనెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “వెండి బంగారముల వంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింప బడలేదుగాని, అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్ల వంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా” (1. పేతురు. 1:18,19).
మనము దుఃఖించువారి గుంపులో నిలబడక, విమోచింపబడిన వారి గుంపులో నిలబడుచున్నాము. “యెహోవాచేత విమోచించినవారు ఆనందాల సంతోషముతో పాటలుపాడుచు, తిరిగి సీయోనునకు వచ్చెదరు” అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది (యెషయా. 35:10). మనము యెహోవా చేత విమోచింపబడినది వాస్తవమైతే కలత చందుటకు గాని, దిక్కించుటకు గాని అవసరము లేదు. ‘నేను యేసుక్రీస్తు చేత విమోచింప బడియున్నాను, నేను రాజాధిరాజు యొక్క బిడ్డను, నేను ప్రభువు యొక్క స్వాస్థ్యమును’ అని ఉత్సాహముగా చెప్పగలము. “నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము” అని జ్ఞాని సెలవిచ్చుచున్నాడు (ప్రసంగి. 11:10).
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు; సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అని నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు” (యెషయా. 54:5,6). దేవుని బిడ్డలారా, పలు విధములైన దుఃఖములు మిమ్ములను ఇరికించుటకు ప్రయత్నించుచున్నప్పుడు మిమ్ములను విమోచించిన యేసును తేరి చూడుడి. ఆయనే మిమ్ములను ఓదార్చును, ఆదరించును మీ పక్షముగా మాట్లాడును.
నేటి ధ్యానమునకై: “ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును. ఆయన హృదయపూర్వకముగా నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు” (విలాప. 3:32,33).