No products in the cart.
నవంబర్ 05 – తీర్మానించుడి!
“నా నోటి మాటచేత నేను అతిక్రమింప కుండునట్లు, తీర్మానించితిని” (కీర్తనలు. 17:3).
జీవితము అనునది పలు తీర్మానములతో కూడినది. ప్రతి దినమును మనము పలు తీర్మాణములను తీయుచున్నాము. ధరించుట మరియు వండుట వంటి సాధారణమైన అంశముల కొరకైన తీర్మానములు కలవు. పిల్లల యొక్క పై చదువులు, ఉద్యోగపు అవకాశములు, వివాహ అంశములు వంటి మిగుల ప్రాముఖ్యమైన తీర్మానములు కలవు.
కొంతమందికి తీర్మానములు అని చెప్పిన వెంటనే నూతన సంవత్సరపు తీర్మానములే జ్ఞాపమునకు వచ్చును. పాత సంవత్సరమును ముగించుటకు ముందే తొందర తొందరగా, “ప్రభువా, నూతన సంవత్సరమునందు నీవు నన్ను ఆశీర్వదించునట్లు నేను సరిగ్గా బైబిలు గ్రంధమును చదివెదను. కుదురుగా ప్రార్థన చేసెదను. క్రమముగా ఆలయమునకు వెళ్లెదను” అని చెప్పి కొన్ని దినములలోగా ఆ సంగతిని గాలిలోనికి ఎగరవేయుచున్నాము. మీరు ప్రభువు కొరకు వైరాగ్యముతోను తీర్మానము చేయుచున్నప్పుడు, ప్రభువు కూడాను వైరాగ్యముతో మీతో కూడా ఉండి, మిమ్ములను గొప్ప ఔన్నత్యముతో హెచ్చించుచున్నాడు.
బైబిలు గ్రంధమునందు ప్రాముఖ్యమైన తీర్మానములను చేసిన ముగ్గురిని మీ ఎదుట నిలబెట్టాలని కోరుచున్నాను. మొదటిగా, యాకోబు యొక్క తీర్మానము. అది పదియవ వంతును చెల్లించెదను అని ఆయన చెప్పుచున్న తీర్మానము. తీర్మానము చేయుటకు ముందుగా ప్రభువు వద్ద ఒక శరత్తును ఉంచి, యాకోబు ఇలా చెప్పుటను చూడుడి.
“దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసి, నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండియెడల, యెహోవా నాకు దేవుడై యుండును; స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతును నిశ్చయముగా నీకు చెల్లించెదను అని చెప్పి మ్రొక్కుకొనెను” (ఆది.కా. 28:20-22).
అయితే, మనము ప్రభువునకు కానుకలను ఇచ్చుటకు తీర్మానించుచున్నప్పుడు శరత్తులు ఏమియు పెట్టకయే, దేవుని ప్రేమ చేత ఆకర్షింపబడి ఆయనకు పదియవ వంతును చెల్లించవలెను. ఆ విధముగా ఇచ్చుచున్నప్పుడు మలాకి. 3:10 ‘వ వచనమునందు వాగ్దానము చేసినట్లుగానే ఆకాశము యొక్క వాకింగ్లను తెరచి పట్టజాలనంతగా ప్రభువు ఆశీర్వదించును.
రెండవదిగా, దావీదు వలె లేఖన వచనములను పఠించెదను, ధ్యానించెదను, దాని చొప్పున జరిగించేదెను అని తీర్మానించుడి. “నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను; నీ వాక్యమును నేను మరువకయుందును” (కీర్తనలు. 119:15,16). బైబిలు గ్రంథమును పఠించి, ధ్యానించి, దాని ప్రకారము నడుచుచున్న యధార్థ ప్రవర్తనలు నిశ్చయముగానే ధన్యులుగా ఉందురు. లేఖన వచనములను ధ్యానించవలసినది మన యొక్క బాధ్యత.
మూడవ తీర్మానము దానియేలు యొక్క తీర్మానము. పరిశుద్ధ జీవితము కోరకైన తీర్మానము. “రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తన హృదయమునందు తీర్మానించుకొనెను” (దానియేలు. 1:8). దేవుని బిడ్డలారా, మీ యొక్క తీర్మానములు ఏమిటి? క్రీస్తును ప్రేమించు విషమును గూర్చియు, ఆయనకు పరిచర్య చేయుటను గూర్చియు తీర్మానమును చేసి ప్రభువును సమీపించి జీవించుడి.
నేటి ధ్యానమునకై: “నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల, దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు; నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము” (ప్రసంగి. 5:4,5).