SLOT QRIS bandar togel bo togel situs toto musimtogel toto slot
Appam, Appam - Telugu

డిసెంబర్ 30 – (TV) దూరదర్శిని!

“ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము; ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును” (1. కోరింథీ. 13:12).

నేడు దూరదర్శని పెట్టె (TV) లేని గృహములే లేవని చెప్పవచ్చు. దూరదర్శిని ద్వారా ఆశీర్వాదములు కలవు, శాపములు కలవు. కావున, తమ యొక్క బిడ్డలు ఎటువంటి కార్యక్రమములను చూచుచున్నారు అనుటను గూర్చి తల్లిదండ్రులు అక్కరగలవారై ఉండవలెను. ఇట్టి దూరదర్శిని పెట్టెలు ఈ లోకముతోను, లోకము యొక్క ఆశ పాశములతోను, లోకపు పాపేఛ్చలతోను దగ్గరి సంబంధమును కలిగియుండుటను చూచుచున్నాము.

ఒకసారి ఒక సహోదరి తన యొక్క భర్త మిగుల వ్యాధి బారిన పడి అవస్థ పడుతున్నట్లు చెప్పి ప్రార్థించమని నన్ను బలవంతముగా ఆహ్వానించిరి. వారి యొక్క ఇంటికి వెళ్లినప్పుడు ముందు గదిలో ఉన్న దూరదర్శిని పెట్టెలో ఒక మోసకరమైన కార్యక్రమము వచ్చుచుండెను.

ఆ సహోదరీ యొక్క చిన్న బిడ్డలు ఇద్దరును ఆ దూరదర్శనిలో వచ్చుచున్న మోసకరమైన కార్యక్రమములను చూచుచునే నిద్రపోయియున్నారు. ఆ ఘోరమైన దృశ్యము బైలునకు ముందుగా సాష్టాంగముగా పడి నమస్కరించుచున్నట్లు ఉండెను. దానిని దాటుకుని ప్రార్ధించుట కొరకు ఆమె యొక్క భర్త పండుకొనియున్న గదిలోనికి వెళ్లాను. అక్కడ మరొక్క దూరదర్శిని పెట్టె ఉన్నది. అందులో అసభ్యకరమైన చలన చిత్రము వచ్చుచుండెను. ఆ సహోదరి యొక్క భర్త భయంకరమైన వ్యాధితో మరణపు శయముమీద ఉన్నప్పుడు కూడాను, అట్టి చలన చిత్రమును ఆసక్తితో వీక్క్షీస్తూ ఉండెను. మమ్ములను ఒక కంట చూస్తూ, దూరదర్శిని కార్యక్రమమును మరొ కంట చూస్తూ మార్చి మార్చి చూస్తూనే ఉండెను.

మునుపైతే కుటుంభములో బైబులు చదువుటయు, కుటుంభ ప్రార్థనయు, ప్రభువును స్తుతించే స్తుతియు ఉండెను. అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా అవి మరువబడి దూరదర్శిని ద్వారా అసబ్యకరమైన నాటకములును, నృత్యములును, ఘోరమైన సాతాను యొక్క ఇచ్ఛలును సమయమును ఆక్రమించుకొనెను.

దూరదర్శనిలో వార్తలేగా వినుచున్నాను. అందులో తప్పు ఏమిటి అని చెప్పుచున్నవారు, ఆపై వార్తలకు మించి తమ యొక్క కన్నులను పరుగులెత్తిస్తారు. ప్రభువు భూమి మీద మీకు ఇచ్చిన బంగారపు సమయమును వ్యర్థము చేయకుండునట్లు జాగ్రత్తగా ఉండుడి. దూరదర్శిని కార్యకముల ద్వారా అనేక బిడ్డలు తమ యొక్క చదువులలో వెనకబడిపోయి, ఓటమిపాలవుచున్నారు. హత్యలును, దొంగతనమును చేయుటకు అడ్డదారులను నేర్చుకొనుచున్నారు. భయంకరమైన పాపపు అలవాటులకును, మత్తు పానీయములకును, మత్తు పదార్ధములకు బానిసలై పోవుచున్నారు.

దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్న దూరదర్శిని కార్యక్రమమును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అసభ్యకరమైన కార్యక్రమములును, చలన చిత్రములును, దూరదర్శిని ధారావాహికలును మొదలగు వాటిని మీరు చూచుచున్నప్పుడు ప్రభువు దుఃఖముతో ఇంటి బయట నిలబడియుండును అను సంగతిని మరిచిపోకుడి. సరి చేయవలసిన వాటిని సరిచేసి నేడే ప్రభువు వద్దకు తిరుగుడి.

నేటి ధ్యానమునకై: “ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి, నిన్ను విడువకుండునట్లు, నీ పాళెము పరిశుద్థముగా ఉండవలెను” (ద్వితీ. 23:14).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.