No products in the cart.
డిసెంబర్ 10 – ముందుకు చూచుచు!
“అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి, ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను” (ఫిలిప్పీ. 3:13,14).
ప్రతి ఒక్క మనుష్యుడును అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో తన్నుతాను స్థిరపరచుకొని, నూతన తీర్మానములను, నూతన ప్రతిష్టలను చేయుచున్నాడో, అతడు విజయము తట్టునకు నడిచి వెళ్ళుచున్నాడు. ప్రభువు యొక్క సన్నిధిలోని ఆనందము తట్టునకు నడిచి వెళ్ళుచున్నాడు అను సంగతిని మనము మర్చిపోకూడదు. అపో. పౌలు, “వెనుకున్నవి మరచి, ముందున్న వాటికొరకై వేగిరిపడుచు, గురు యొద్దకే పరిగెత్తుచున్నాను” అని వ్రాయుచున్నాడు. అదియే ఆయన యొక్క తీర్మానముగా ఉండెను.
మొదటిగా, వెనక్కున్నవి మరచి:- అవును, వెనకున్న వాటిని, నీచమైనవాటిని, దేవుడు కోరుకొనని వాటినన్నిటిని మరచిపోవలెను. సొదొమును విడచి బయటికి వచ్చిన మనము సొదొమును తిరిగి చూచుచూనే ఉండకూడదు. ఐగుప్తును విడిచి బయటకు వచ్చిన మనము ఐగుప్తునందుగల కీరదోస కాయలను, వెల్లుల్లిపాయలను, మాంసములను తలంచుకొనుచు ఉండకూడదు.
అనేకులు గతకాలపు స్మృతులలోనే జీవించుచు ఉందురు. కొందరికి గతకాలపు జ్ఞాపకాలు అంతరంగమునందు దుఃఖమును, వేధనను తీసుకుని వచ్చుచున్నది. నేడును కొందరు గతకాలములో జరిగిపోయిన పాత అనుభవములనే మాట్లాడి మాట్లాడి నూతన ఒరవడికి తమ్మును సమర్పించుకొనక ఉందురు. ఒకసారి ఫెర్నాఢర్షా చెప్పిన మాట: “గతకాలపు జ్ఞాపకాలు మనుష్యుని బుద్ధిమంతుడిగా చేయుట లేదు. భవిష్యత్కాలమును గూర్చిన బాధ్యతగల గ్రహింపే బుద్ధిమంతునికి సూచన”.
రెండోది, ముందున్న వాటికొరకై వేగిరిపడుచు:- ముందున్న వాటిని కొరకును, గొప్ప ఔన్నత్యమునైయున్నన వాటి కొరకును వేగిరపడుడి. నూతన కార్యములను వెంటాడుడి. ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “మునుపటివాటిని జ్ఞాపకము చేసుకొనకుడి; పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేనొక నూతన క్రియను చేయుచున్నాను” (యెషయా. 43:18,19).
అవును, ప్రభువు నూతన కార్యమును మన యొక్క జీవితమునందు చేయుచున్నాడు. ప్రభువు దయచేయుచున్న ముందున్న వాటిని, ఔనత్యమైన వాటిని పొందుకొనుటకు ముందుకు రండి. పరిశుద్ధాత్మ యొక్క నూతన నింపుదల, నూతన శక్తి, నూతన కృప మొదలగు వాటిని ప్రతి దినమును మీపై కుమ్మరించుటకు ఆయన కోరుచున్నాడు. అట్టి ముందున్న వాటి కొరకు మీరు వేగిరపడుదురా?
మూడోది, గురు యొద్దకే:- దేవుని యొక్క బిడ్డలకు ఒక గురి ఉండవలెను. గురి ఉంటేనే మనము తీవ్రముగా ఒకే ఉద్దేశముతోను, ఒకే పట్టుదలతోను చెప్పగలము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునుండి బయలుదేరినప్పుడు, వారు తమకు గురియునైయున్న కనాను తట్టునకు తీవ్రముగా వెళ్ళిరి. మనకు ఒక గురి కలదు. భూమియందు క్రీస్తు యొక్క పరిపూర్ణతయు, నిత్యత్వమునందు పరమ కానాను అనుటియే అట్టి గురి.
దేవుని బిడ్డలారా, మీరు గురితట్టున నడుచుచున్నారా? మీ యొక్క ఉద్దేశము ముందుకు కొనసాగి పోవుచున్నదై ఉన్నదా?
నేటి ధ్యానమునకై: “మనము కూడా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున, ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కడముట్టించు వాడునైయున్న యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయు. 12:1,2).