No products in the cart.
డిసెంబర్ 05 – నీ సాత్వికము!
“నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు; నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను; నీ సాత్వికము నన్ను గొప్పచేసెను” (కీర్తనలు. 18:35).
ఈ వచనమును కొద్దిగా లోతుగా ధ్యానించి చూడుడి. మూడుసార్లు “నీ” అను పదము మాటిమాటికి వచ్చుటను మనము చూడవచ్చు. 1. నీ కేడము, 2. నీ కుడిచెయ్యి, 3. నీ సాత్వికము. ఈ మూడింటిని కొద్దిగా ఆలోచించెదమా?
- నీ రక్షణ కేడెము:- బైబిలు గ్రంథము చెప్పుచున్నది: “ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము” (సామెతలు. 30:5).
కేడెము అను మాటను కొద్దిగా ఆలోచించి చూడుడి. అది మనకు భద్రతను ఇచ్చుచున్నది. సాతాను మనపై అగ్ని బాణములను వేయుచున్నప్పుడు, దుష్టులైన మనుష్యులు చిల్లంగి తనపు శక్తుల చేత మనపై దాడి చేయుచున్నప్పుడు, ప్రభువు ఒక్కడే మనకు కేడెముగా ఉన్నాడు.
మనపై రావలసిన శిక్షను యేసుక్రీస్తు తనపై మోసుకొనెను. యుద్ధ కాలమునందు శత్రువులు విషపు బాణములను వేయును, బల్లెములను విసురును. ఎదిరించి నిలబడు యోధుడు తన యొక్క చేతులలో కేడెము పట్టుకొని నిలబడిన యెడల అతడు కాపాడబడును. దేవుని బిడ్డలారా, ప్రభువే మీకు కేడముగా ఉన్నాడు.
- మీ కుడి చెయ్యి:- ప్రభువు యొక్క హస్తమును తేరి చూడుడి. ఆయన యొక్క హస్తమును గూర్చి, అది చాచబడియున్న బాహువు అనియు, ఎత్తబడియున్న హస్తము అనియు బైబులు గ్రంథము చెప్పుచున్నది. ప్రేమ గల దేవుడు తన యొక్క నిత్య బహులోను, శక్తిగల హస్తముతోను మనలను కాపాడుచున్నాడు.
“శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము; నిత్యముగనుండు బాహువులు నీకు ఆధారము” (ద్వితీ. 33:27) అని మోషే చెప్పి, ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొక్క బలమైన హస్తములలోనికి ఆప్పగించెను.
కారణము దేవుని యొక్క హస్తములు నిత్యము నిలిచియుండు హస్తములు, మన యొక్క కాళ్లు రాయికి తగలకుండా కాపాడు హస్తములుగాను (1. సమూ. 2:9). మనలను వృద్ధాప్యము మట్టుకును ఎత్తుకొని మోసేటువంటి హస్తములుగాను ఉన్నాయి (యెషయా. 46:4). దేవుని యొక్క హస్తము మీతో కూడా ఉన్నట్లయితే మీరు భద్రముగా ఉందురు.
- నీ సాత్వికము:- నీ సాత్వికము నన్ను గొప్పచేసెను” అని దావీదు ఆనందముతో చెప్పుచున్నాడు (కీర్తనలు. 18:35).
మన యొక్క సొంత సామర్థ్యముచేత గాని, యధార్ధతచేత గాని మనము గొప్పవారము గాక, ప్రభువు యొక్క సాత్వికము చేతనే గొప్పవారము అవ్వుచున్నాము. ఆయన యొక్క సాత్వికము చేత మనలను ఆకర్షించుకొనెను (యిర్మీయా. 31:3). ఆయన యొక్క సాత్వికము చేత మనలను పిలిచెను (2. పేతురు. 1:3). కేడెముతో కప్పినట్లు…. వారిని సాత్వికముతో కప్పెదవు (కీర్తనలు. 5:12).
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క కాపాడేటువంటి హస్తమును, ప్రభువు యొక్క సాత్వికమును ఎల్లప్పుడును మీతో కూడా ఉండవలెను. అప్పుడు మీరు గొప్పవారైయుందురు.
నేటి ధ్యానమునకై: “వారు ఎంతో (క్షేమముగా) సాత్వికముగా ఉన్నారు? వారు ఎంతో సొగసుగా ఉన్నారు? ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షా రసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు” (జెకర్యా. 9:17).