No products in the cart.
డిసెంబర్ 02 – “అబ్రహాము కంటే గొప్పవాడు!”
“మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావు” (యోహాను. 8:53)
ఒక దినమున యేసుక్రీస్తు అబ్రాహామును గూర్చి మాట్లాడెను. మీ తండ్రియైన అబ్రహాము నా దినమును చూచుటకు ఆశకలిగి ఉండెను. దానిని చూచి ఆనందించెను అని చెప్పెను. అప్పుడు యూదులు ఆయనను చూసి, నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అనిరి.
చూడండి! ఆనాడు ఉండిన యూదులకు అబ్రహామే గొప్పవాడుగా కనబడెను. ఆయననే తమ యొక్క తండ్రి అని పిలిచిరి. అబ్రహాము కంటే గొప్పవాడు తమ మధ్యలో ఉన్నాడన్న సంగతిని వారు తెలుసుకొనలేదు. యేసు వారి తట్టు చూసి, ‘అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని నిశ్చయముగా మారి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను’ అనెను. అవును, మన ప్రభువు గొప్పవాడు.
అబ్రహాము చనిపోయెను, అయితే యేసు మృతులలో నుండి సజ్జీవుడుగా లేచియున్నాడు. అబ్రహాము యొక్క సమాధి మూత వేయబడియున్నది. అయితే యేసు యొక్క సమాధి, అయన ఇక్కడ లేడు సజ్జీవుడై లేచియున్నాడు అని సాక్ష్యమును చెప్పుచునేయున్నది. అవును, మన ప్రభువు గొప్పవాడు.
అబ్రహాము గొప్పవాడని అతిశయించిన యూదులు, అబ్రహామును గూర్చి మాట్లాడుచున్నప్పుడు, అబ్రహాము చనిపోయెననియు, ప్రవక్తలు చనిపోయెననియు ఒప్పుకొనుచున్నారు (యోహాను. 8:53). అబ్రహాము నూట డెబ్బదియైదు సంవత్సరములు జీవించి దాని తర్వాత మృతి పొందెను. అబ్రహాము యొక్క సమాధి మమ్రే ఎదుటనున్న మక్పేలా గుహలో నేడును ఉన్నది (ఆది.25: 9).
అయితే యేసు అబ్రహాము కంటే గొప్పవాడు. మరణమే గాని, పాతాళమే గాని అయనను బంధించి ఉంచలేకపోయెను. ఆయన సజీవుడిగా లేచి నేడును జీవించుచున్నాడు. తండ్రి యొక్క ఒడిలో కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయుచునేయున్నాడు. యేసు మరలా వచ్చును అని మనము విశ్వసించుచున్నాము.
నేడు లోకమునందు వందల కొలది మతములు, మార్గములు ఉండవచ్చును. మత స్థాపకులును, తత్వ జ్ఞానులును జీవించుచు ఉండవచ్చును. వారు జీవించిరి, మృతి పొందిరి. వారి మధ్యలో యేసు జీవము గలవాడుగాను, శక్తి గలవాడుగాను, మహిమ గలవాడుగాను ఉండెను. మరణమును, పాతాళమును జయించినవాడై మనము ఆరాధించుచున్నాము.
అందుచేతనే మీరు మరణమునకును, పాతాళమునకును సవాలు విడుచుచు,. ‘మరణమా నీ ముల్లెక్కడ? పాతాళమా నీ విజయము ఎక్కడ? అని బేరించుచున్నాము. సజీవుడైయున్న విమోచకుడుని ఆనాడు యోబు భక్తుడు చూచినప్పుడు సంతోషముతో, “నా విమోచకుడు సజీవుడైయున్నాడు” అని చెప్పి రొమ్మును తట్టి హూంకరించెను (యోబు. 19:25).
అబ్రహామును మూలపితులందరును మృతి పొందిరి. ఇప్పుడు విశ్రాంతిని పొందుచుచున్నారు. ఆనాడు డానియేలునకు దేవుని యొక్క దూత సెలవిచ్చెను: “నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో లేచెదవు” (దానియేలు. 12:13). దేవుని బిడ్డలారా, మన ప్రభువు పునరుత్థానుడును, జిముగలవాడైయున్నాడు. ఆయన గొప్పవాడు.
నేటి ధ్యానమునకై: 📖”నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను” (ప్రకటన.1: 18).