No products in the cart.
జూలై 28 – ఆయన ఆధ్వర్యమునందు!
“మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను సమస్తమును ఆయన పేరట ప్రభువైన యేసుద్వారా చేయుడి,(ఆయన ఆధ్వర్యములో) తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” (కొలస్సీ. 3:17).
దైవ ప్రసన్నత అను పధము అనునది తమిళ భాషయందు పలు వేరు పధములుగా భాషాంతరము చేయబడియున్నది. దైవసమూఖము, ఆధ్వర్యమునందు, ఎదుట, దైవ సన్నిధి, సన్నిధానము, ప్రసన్నమవ్వుట అనియంతా ఆ పధమును చూచుచున్నాము. ప్రభువు యొక్క ప్రసన్నతను కాపాడుకొనుటయును, దానిని కొలత లేకుండా గ్రహించుటయును మనకు లభించియున్న గొప్ప ధన్యతయైయున్నది.
ఒక స్త్రీ వివాహమై భర్తతో జీవించునట్లు అతని కుటుంబమునకు వచ్చెను. అయితే, ఆ కుటుంబసభ్యులు ఆమెను సంతోషముతో అంగీకరించక బహు కఠినముగా నడుచుకొనిరి. ఆమె యొక్క భర్త కూడాను ఆమె పట్ల అక్కరగాని, ప్రేమనుగాని చూపించలేదు. సాతాను ఆ సందర్భమును వాడుకొని, ఆమె మనస్సునందు నిరుత్సాహమును, మనస్సునందు ఒత్తిడిని తీసుకొని వచ్చెను. ఆమె జీవశెవమువలె మారిపోయెను.
ఆమె ఒక దినమన మనస్సునందు నిరుత్సాహముతో ఆలయమునకు వచ్చెను. ఆలయము యొక్క ఆరాధన ముగించబడిన వెంటనే, ఆమె యొక్క పరిస్థితిని ప్రభువు యొక్క సేవకుని వద్ద చెప్పెను. ఆ సేవకుడు ఆమెను చూచి, “సహోదరి మిమ్ములను ఎవరు అభినందించినను అభినందించకపోయిను మీరు చింత పడకుడి. మీరు కుటుంబము కొరకు కష్టపడి పని చేయుట అంతటిని ప్రభువు చూచుచునేయున్నాడు. ప్రభువు మిమ్ములను అభినందించుచున్నాడు. ఆయన మిమ్ములను ప్రేమించుచున్నాడు ఆయన యొక్క కృప మీపై కొలత లేకుండా ఉన్నది. ఆయన తన యొక్క ప్రాణము కంటేను మిమ్ములను అత్యధికముగా ప్రేమించుచున్నాడు” అని చెప్పి ఉత్సాహపరిచెను.
అంత మాత్రమే కాదు, ‘సహోదరీ, మీయొక్క ఇంటి పనులను చేయుటకు ముందుగా ఒక్క నిమిషము మోకరించి’, “ప్రభువా ఈ గృహమును నాకు దయచేసినందున స్తోత్రము. నాకంటూ ఒక చక్కటి కుటుంబమును దయచేసినందున స్తోత్రము అని చెప్పి ప్రార్థించి దైవప్రసన్నతను తీసుకొని రండి” అని చెప్పెను.
ఆ దినము మొదలుకొని ఆ సహోదరి ప్రార్థించి ప్రార్థించి దైవప్రసన్నతను కొలత లేకుండా తీసుకొని వచ్చెను. ప్రభువు తనకు తోడైయుండుటయును, తనను గమనించుటయును, తనను అభినందించుటయును ఆమె గ్రహించి, ఆనందించుటకు ప్రారంభించెను. ఒక దినమున పనిచేసి ముగించిన తరువాత ప్రభువు, ‘చక్కగా చేసావు’ అని మెల్లని స్వరమునందు చెప్పుటను ఆమె ఆలకించెను. ఆమెకు అంతులేని సంతోషము కలిగెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను అభినందించువాడు. “కొద్దిపాటి విషయమునందు నమ్మకముగా ఉండినట్లయితే, అనేకమైన వాటియందు అధికారిగా నియమించెదను” అని వెన్ను తట్టి ఉత్సాహపరచువాడు. ప్రభువు ప్రతి ఒక్క క్షణమును మిమ్ములను గమనించుచూనే ఉన్నాడు అను సంగతిని, మీ విషయమై మనస్సునందు ఆనందించుచున్నాడు అను సంగతిని మరచిపోకుడి.
నేటి ధ్యానమునకై: “కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును” (కీర్తనలు. 100:4,5).