Appam, Appam - Telugu

జూలై 27 – జెయించుటకు!

“ఏలయనగా, …. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను మనము పోరాడుచున్నాము” (ఎఫెసీ. 6:12).

సుమారు రెండువేల సంవత్సరములకు పూర్వము, కల్వరి సిలువయందు సాతాను ఓడించబడినప్పటికిని, నేడును అతడు నిత్య నరకాగ్నిలోనికి త్రోయబడలేదు. ఇంకను అతడు ఈ లోకమునందు చుట్టూతా తిరిగి వచ్చి జనులను వంఛించి మోసపుచ్చుచూనే ఉన్నాడు.

అయితే, యేసుక్రీస్తు ఈ లోకమును విడచి వెళ్ళిపోవుటకు ముందుగా మనకు తన యొక్క అధికారమును, శక్తిని, ఏలుబడిని అనుగ్రహించి, “నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు; పాములను ఎత్తి పట్టుకొందురు; మరణకరమైనదేది త్రాగినను అది వారికి హానిచేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను” (మార్కు. 16:17,18).

మనము అనేక రకములైన అపవిత్రాత్మలను వెల్లగొట్టవలసినదైయున్నది. అబద్ధపు ఆత్మలు, విభజన ఆత్మలు, వ్యభిచారపు ఆత్మలు వంటి పలు ఆత్మలను మనము మొక్కాళ్ళ మీద నిలబడి దేవుని శక్తితో యుద్ధమును చేసి వెళ్లగొట్టవలసినది అవశ్యమునైయున్నది.

జీవితమునందు ఎదురుచూడని రోగములును, పోరాటములును ఆవరించుచున్నప్పుడు, మనము మోకాళ్ళయందు నిలబడి చీకటి యొక్క ఆధిక్యతను ఎదిరించి ప్రార్థించవలసినదైయున్నది. వ్యక్తిగత ప్రార్థనయందు గల ఆసక్తిగల ప్రార్థనయే అంధకార శక్తులను జయించుటకు సహాయకరముగా ఉండును.

బోధకుడైన పాల్యాంగిచో గారికి ఒక సారి ఆయన మీద ఆయనకి ఒక విరక్తి ఏర్పడెను. “నేను పరిచర్యను చేసి ప్రయోజనము ఏమిటి? ఇంతగా కష్టపడి శ్రమపడుట వలన నాకు లాభము ఏమిటి? అని ఆయన యొక్క అంతరంగమునందు ఒక గొప్ప నీరసము కలిగెను.

దాని తరువాత ఆలయముపై ఆయనకు విరక్తి, సంఘపెద్దలపై విరక్తి, విశ్వాసులపై విరక్తి కలుగుచూనే ఉండెను. అప్పుడు ప్రార్థించలేకుండునట్లు శరీరమునందు నొప్పియు వేదనయు అలసటయు పైబడెను. ఇది సాతాను తీసుకొచ్చిన శోధన అను సంగతిని ఆయన ఎరుగక అలసట తీర్చుకొనుటకై నిద్రించి విశ్రమించుటకు తలంచెను.

అయితే ఆయన యొక్క భార్య, మీరు కుటుంబ ప్రార్థన చేయకను, ఏకాంత ప్రార్ధన చేయకును ఇలాగున పండుకొనియుండుట తప్పు అని చెప్పి ఆయనను ప్రార్థించుటకు పిలిచెను. అప్పుడు ఆయన ప్రార్థించగా ప్రార్థించగా దేవుని యొక్క శక్తి బహుబలముగా దిగివచ్చెను. వెంటనే సాతాను కిటికీ అద్దమును పగులగొట్టుకొని బయటకు పరిగెత్తుకొని వెళ్ళుటను ఆయన చూచెను.

దేవుని బిడ్డలారా, మీరు సాతానును ఎదిరించి నిలబడుటకును, మీకు వచ్చు అలసటను, పోరాటమును, సమస్యలను జెయించుటకును, ఈ లోకమునందు మీరు విజయవంతులుగా జీవించుటకును మీకు ప్రార్ధన అవసరము. వ్యక్తిగత ప్రార్థనయు, కుటుంబ ప్రార్ధనయు అత్యవసరమైనది అను సంగతిని మరచిపోకుడి.

నేటి ధ్యానమునకై: “దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని” (యోహాను. 10:10).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.