No products in the cart.
జూలై 26 – ముఖ్యమైన బుద్ధిమతి!
“అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని (హెచ్చరించుచున్నాను) బుద్ధి చెప్పుచున్నాను” (1. తిమోతి. 2:1).
ఆత్మీయ తండ్రియైన అపో. పౌలు, తన యొక్క పత్రికల అన్నిటియందును విస్తారమైన బుద్ధిమతులను వ్రాసినను, వాటియందు ప్రాముఖ్యమైన బుద్ధిమతిగా ప్రార్థనను గూర్చి వ్రాయుచున్నాడు. ఆ ప్రార్ధన దేశమునందుగల రాజుల కొరకును, అధికారుల కొరకును, పదవులయందు ఉన్నవారి కొరకును గోజాడి చేయవలసిన ఒక ప్రార్ధన.
ఒకానొక దేశమునందుగల ఒక గొప్ప పట్టణములో ప్రార్ధన ద్వారా సువార్త ప్రకటించు పనితీరు ప్రారంభించబడెను. అట్టి పనియందు, ఆ నగరమునందు గల అందరిని ప్రభువు దర్శించవలెను అను ఉద్దేశముతో, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతముగాను, ప్రభుత్వము కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు చేయబడుచుండెను.
నగరమును పలు విభజనులగా విభజించి అక్కడ ఏలుబడి చేయుచున్న వేల కొలది మంది పేర్లను పట్టిక వేసి, అక్కడ ఉన్న సంఘముల ద్వారా వారు ప్రార్ధించుచు వచ్చిరి. అధికారమునందు ఉన్నవారు సంధించ బడినట్లయితే, దేశమంతయును సంధించబడును అని వారి యొక్క కదల్చబడని విశ్వాసము.
మన యొక్క దేశమునందును, ఏలుబడి చేయుచున్న జనుల యొక్క పేర్లను పట్టిక వేసి అలాగున ప్రార్థన చేయవలసినది ఎంతటి అవశ్యము! అపో. పౌలు సెలవిచ్చుచున్నాడు: “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, రాజుల కొరకును అధికారులందరి కొరకును చేయవలెనని, ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు” (1. తిమోతి.2:1,2,3).
మనము ప్రభువు యొక్క మాటను బట్టి ప్రార్థించకుండా ఉండిన యెడల ఏమి జరుగును? దేశమంతటను కలవరములు ఏర్పడును. నెమ్మదిలేకుండా పోవును. సమాధానము, సంతోషము ఉండకుండా పోవును. మనుష్యుల మధ్య మంచితనమును, దైవభక్తి కనబడకుండా పోవును. అటువంటి కీడైన సంభవములు మన దేశమునందు వచ్చుటకు ముందుగా మనము మన యొక్క బాధ్యతను గ్రహించి ప్రార్థించవలెను.
అపోస్తులుడైన పౌలు ఇచ్చుచున్న ముఖ్యమైన బుద్ధిమతిని అంగీకరించవలెను. దేశమునందుగల మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, మంత్రుల కొరకును, అధికారమునందు ఉన్నవారి కొరకును, వారి యొక్క రక్షణ కొరకును, వారి యొక్క ఆశీర్వాదముకొరకును, ప్రభువు యొక్క రాకడకొరకు వారిలోని ప్రతి ఒక్కరును సిద్ధపడునట్లుగాను, మనము విజ్ఞాపనములను, ప్రార్ధనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను.
దేవుని బిడ్డలారా, దేశమునందు నెమ్మది కావలెను అంటే, దేశము యొక్క అధికారమునందు గల అందరి కొరకును, ప్రార్థించవలసినది అవశ్యము. నేడే ప్రభువు యొక్క సముఖమునందు కూర్చుండి ప్రార్థించుటకు ప్రారంభించుడి.
నేటి ధ్యానమునకై: “ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూల మైనదియునైయున్నది” (1. తిమోతికి. 2:3).