Appam, Appam - Telugu

జూలై 25 – పంచుకొనుడి!

“క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా, అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక, అందరును మృతిపొందిరనియు; జీవించువారు ఇకమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము” (2. కోరింథీ. 5:14,15).

దేవుని ప్రసన్నతకును, పంచుకొనుటకును ఒక సంబంధము ఉండుటను గ్రహించుచున్నాను. కొన్ని సమయములయందు మన యొక్క సాక్ష్యములను, ప్రేమను, మేలు కరమైన చర్యలను పంచుకొనుచున్నాము. దాని తరువాత ప్రార్ధించుటకు ప్రారంభించినప్పుడు ఒక దైవీక సంతోషముతో ప్రభువు యొక్క ప్రేమగల ప్రసన్నత మనలను హక్కున చేర్చుకొనుటను గ్రహించగలము.

ఒక రోజున మా యొక్క తండ్రి గారు, వీధిలో ఒంటరిగా నడిచి వెళ్ళుచున్నప్పుడు ఆయనకు ఎదురుగా ఒకరు వచ్చుచుండెను. ఆయన మా తండ్రిగారి తట్టున తిరిగి చూచి: “దెగ్గర్లో ఏదైనా ధర తక్కువ గల భోజనశాల ఉన్నదా? అతిపెద్ద భోజనశాలకు వెళ్ళుటకు నా వల్ల కాదు”. అని చెప్పెను.

ఆయన చెప్పిన మాట వినగానే ఆయన వద్ద చాలినంత డబ్బులు లేదు అను సంగతిని మా నాన్నగారు గ్రహించుకొనెను. కావున ఆయనకు సహాయము చేయవలెను అని ప్రేరేపింపబడెను. మా నాన్నగారు తన వద్ద ఉన్న వంద రూపాయలను ఆయనకు ఇచ్చి దీనిని మీ వద్ద ఉంచుకొనుడి. దెగ్గర్లో ఒక పెద్ద భోజనశాల ఉన్నది. సంతోషముగా తిని వెళ్ళండి అని చెప్పెను. ఆయన ఎవరు అన్న సంగతి మా తండ్రిగారికి తెలియదు. ఆయనకు డబ్బు ఇచ్చిన మా తండ్రిగారు ఎవరు అను సంగతి కూడాను ఆయనకు తెలియదు.

మా నాన్నగారు ఇంటికి వచ్చి ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు, ఆయనకు తెలియని ఒక సంతోషము ఆయనలో నిండి పొర్లునట్లుగా చేసెను. ఆ దినమంతయును దేవుని యొక్క ప్రత్యేకమైన కృప ఆయనను ఆదుకునెను. “అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక, నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను”. (మత్తయి. 25:40) అని ప్రభువు మా నాన్నగారితో మాట్లాడుటను గ్రహించి ఆనంద భాష్పబిందువులను రాల్చెను.

కొన్ని సమయములయందు ప్రభువు మీకు చేసిన మేళ్లను మరొకరితో పంచుకొనుచున్నప్పుడు ఒక గొప్ప సంతోషమును, దేవుని యొక్క ప్రసన్నతను మీ వలన గ్రహించగలరు. యవ్వనస్తులు గ్రామ పరిచర్యకు వెళ్లి, సాయంకాల సమయములో తిరిగి వచ్చి ఆలయము ఎదుట నిలబడి పాటలు పాడి ప్రభువును స్తుతించుచు ఉండుటను చూచియున్నాము.

“జయం జయం హల్లెలూయా జయం జయం ఎల్లప్పుడు, యేసు నాధుని నామమునకు జయము జయము ఎల్లప్పుడు” అని ఆ పాటను పాడి స్తుతించి మహిమ పరచున్నప్పుడు దేవుని ప్రసన్నత కొలత లేకుండా దిగిరాగా, ఉల్లసించుటను నేను చూచియున్నాను.

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ప్రసన్నత మీలో నిండి పొర్లుచున్నప్పుడు మీ యొక్క ప్రేమను, సాక్ష్యమును, ఇతరులతో తప్పకుండా పంచుకొనుడి.

నేటి ధ్యానమునకై: “మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు” (1. యోహాను. 3:1).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.