No products in the cart.
జూలై 24 – దుష్టమృగములతో!
“నేను ఎఫెసులో దుష్టమృగములతో పోరాడిన యెడల మనుష్యరీతిగా, నాకు లాభమేమి?” (1. కొరింథీ. 15:32).
మన యొక్క పోరాటములలో దుష్ట మృగములతో మనకు పోరాటము ఉన్నది. దుష్ట మృగములు అంటే ఎలుగుబంటియే గాని, సింహమే గాని, పులియే గాని, తోడేళ్లే గాని కాదు. ఇక్కడ ‘దుష్టమృగములు’ అని పిలువబడుట దురుపదేశములనే.
ఆది అపోస్తులుల దినములయందు బహువిస్తారమైన దురుపదేశములు ఉండెను. సదుకయ్యులు అను ఒక గుంపువారు పునర్థానము లేదు, నరకము లేదు, సాతాను లేదు అనియంతా మాట్లాడుచున్నారు. ఇంకా ఒక గుంపువారు పాత నిబంధనయందు గల సున్నతి, శుభ ఘడియలు పారంపర్య ఆచారములు జరిగించవచ్చు అని బలవంతము చేసిరి. ఇంకా కొంతమంది దైవీకత్వమును అంగీకరించలేదు.
అపో. పౌలు ఇటువంటి దుష్ట మృగములతో పోరాడవలసినదై ఉండెను. దురుపదేశమును ఎందుకని దుష్ట మృగము అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది? అవును, అంత్య క్రీస్తు యొక్క ఒక పేరు దుష్ట మృగమునైయున్నది. ప్రకటన గ్రంథమునందు ఈ మృగమును గూర్చి అత్యధికముగా వ్రాయబడియున్నది.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “సముద్రములో నుండి యొక క్రూరమృగము పైకి వచ్చుట చూచితిని; …. దాని తలలమీద దేవ దూషణకరమైన పేళ్లును ఉండెను …. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను” (ప్రకటన. 13:1,2). ఆనాడు సముద్ర తీరపు ఇసుక రేణువులో ఉండి మృగము వచ్చినట్లుగా, నేడును పలురకాల దురుపదేశములును, తప్పుడు బోధలను గొర్రె తోలు కప్పుకొనియున్న తోడేలువలె వచ్చుచున్నట్లుగా మన దేశములోనికి వచ్చెను.
ఇట్టి దురుపదేశములను గూర్చి అపో. యోహాను: “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు, గనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది”. (1. యోహాను. 4:1,3) అని హెచ్చరించుచున్నాడు.
మనము అట్టి అబద్ధపు ఉపదేశములకు విరోధముగా పోరాడకుండిన యెడల, ఇట్టి ఉపదేశములు మృగములవలే బలము పొందుకొని అనేకులను వంచించి వేయను. తోడేలవలే ఇట్టి ఉపదేశములు బయలుదేరి వచ్చి, యవ్వన క్రైస్తవులను మత్తిల చేసి వెళ్ళిపోవుచున్నది. ఆత్మలో బలహీనులైన వారిని, తడబడుచున్న వారిని త్రోవ తప్పిపోవునట్లుగా చేయుచున్నది.
దేవుని బిడ్డలారా, మీరు ఆత్మలను వివేచించేటువంటి వరమును ప్రభువు వద్ద నుండి అడిగి పొందుకున్నట్లయితే, అంత్య క్రీస్తు యొక్క ఆత్మలను వెళ్ళగొట్టుటకు అది హేతువుగా ఉండును. ఎట్టి ఉపదేశమునైనను లేఖన వాక్యము యొక్క వెలుగులో పరిశీలించి చూడుడి. ఎట్టి అనుభవములైతే లేఖన వాక్యానుసారముగా ఉన్నదో అను సంగతిని సరి చేసుకుని చూడుడి.
నేటి ధ్యానమునకై: “… ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి” (ఫిలిప్పీ. 1:27).