No products in the cart.
జూలై 06 – యుద్ధ యోధునిగా!
“నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట ఎదిరించి నిలువలేక యుండును; నేను మోషేకు తోడైయుండినట్లు, నీకును తోడైయుందును; నిన్ను విడువను నిన్ను ఎడబాయను” (యెహోషువ. 1:5,6).
యుద్ధ యోధుడైన యెహోషువాకు అనుగ్రహించినట్లుగానే, నేడు ఆత్మీయ యుద్ధ సమాచారమును కలిగియున్న మనకు కూడాను ప్రభువు, “నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట ఎదిరించి నిలువలేక యుండును” అని వాగ్దానమును ఇచ్చియున్నాడు.
ప్రభువు మోషేను ఎన్నుకున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను కనాను తట్టునకు నడిపించునట్లు సెలవిచ్చెను. అయితే యెహోషువాను ఏర్పరచుకున్నప్పుడు, యుద్ధ యోధునిగా కనానులోనికి ఏడు జనాంగములను ముఫ్ఫై ఒక రాజులను జయించి, దానిని స్వతంత్రించుకొని ఇశ్రాయేలీయులకు పంచి పెట్టవలెనని నియమించెను.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునందు బానిసలుగా ఉండెను. మోషే యొక్క నాయకత్వమునందు ప్రయాణికులుగా మారిరి. అయితే యెహోషువా యొక్క నాయకత్వమునందు వారు బలమైన యోధులుగా మారిరి. ఇదే విధముగా మనము రక్షింపబడుటకు పూర్వము పాపపు బానిసత్వమునందు జీవించాము. క్రీస్తును అంగీకరించినప్పుడైతే, ఆయన పరమ కానానైయున్న పరలోక రాజ్యము తట్టునకు మనలను త్రోవ నడిపించుచు వచ్చేను.
అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మడు మనలను అభిషేకించి ఆకాశ మండలమునందు గల దురాత్మల సమూహములతో పోరాడి జయించుటకు ఉన్నత బలమును అనుగ్రహించుచున్నాడు. సాతాను తనకు కొద్ది కాలమే ఉందని గ్రహించి, అత్యధికమైన అపవిత్రాత్మల సైన్యము సైన్యములుగా భూమిపైకి దించుచూనే ఉన్నాడు. పరిశుద్ధులతో కఠినమైన యుద్ధమును వ్యూహపరచుచూనే ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి పైన అగ్నిహస్త్రమలను వేయుచూనే ఉన్నాడు.
శత్రువు యొక్క తంత్రములను ఎరిగి (1. పేతురు. 5:8) లయకర్త నీమీదికి వచ్చుచున్న సంగతిని గ్రహించి, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించి ముందుకు సాగి వెళ్ళవలెను కదా? (నహూము. 2:1).
శ్రీలంక సైన్యమును గూర్చి పలు సంవత్సరములకు ముందుగా వార్తా పత్రికలయందు వచ్చిన ఒక వార్తను చదివాను. లోకమంతట గల సైనికయోధులలో క్రమశిక్షణ లేని సైనికయోధులు శ్రీలంక సైనికయోధులే అను సంగతియే అట్టి వార్త.
సైన్యము అని ఒకటి ఉంటే అందులో క్రమశిక్షణ తప్పకుండా ఉండవలెను. లేకున్నట్లయితే జయమును పొందుకొనలేము. అలాగైయితే ప్రభువు యొక్క సైన్యమునందు నిలబడియున్న మనకు ఎంతటి అత్యధికమైన క్రమశిక్షణ కావలెను! ప్రతి ఒక్క దేవుని బిడ్డకును, క్రమశిక్షణ మిగుల ఆవశ్యము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చొప్పున క్రమశిక్షణను నేర్చుకొని పరిశుద్ధాత్మ యొక్క కట్టుబాట్లయందు మీరు అనిగియున్నప్పుడే జయించువారై ఉండగలరు.
నేటి ధ్యానమునకై: “మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలముకలవైయున్నవి” (2. కోరింథీ. 10:4)..