Appam, Appam - Telugu

జూలై 04 – “సన్నిధిరొట్టెలు!”

“నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను” (నిర్గమ. 25:30).

దేవుని సన్నిధిని మనము వెంటాడుచున్నప్పుడు, దాని యొక్క సంతోషము చేత నింపబడవలెను. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధియందు ఉండేటువంటి రొట్టెలు మన యొక్క ఆత్మీయ ఆహారముగా ఉండవలెను. శరీరమునకు ఎలాగు ఆహారము కావలెనో అదేవిధముగా ప్రాణమునకు కూడాను ప్రభువు యొక్క మాటలు అత్యవసర మైనదైయున్నది.

పాత నిబంధనయందు, ప్రభువు సన్నిధి రొట్టెల కొరకైన ఉపదేశములను ఇచ్చెను. ఆ సన్నిధి రొట్టెలు ప్రత్యక్షపు గుడారమునందు గల పరిశుద్ధ స్థలమునందు ఉండేటువంటి పరిశుద్ధ బల్లపై ఉంచబడి ఉండెను. ఈ సన్నిధి రొట్టెలను గూర్చిన ఉపదేశములను లేవీ కాండము 24: 5-9 వరకు గల లేఖన భాగములయందు మనము చదివి తెలుసుకొనగలము.

సమస్త ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు ప్రతి దినమును మన్నాను కురిపింపజేసి, వారికి కావలసిన దానికంటే అత్యధికముగా దయచేసెను. అయితే, ఆయన యొక్క పరిశుద్ధ స్థలమునందు వాంఛతో ఉండి, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారికి మాత్రమే అట్టి సన్నిధి రొట్టె లభించెను. మనుష్యులందరికిని చదువుకొనునట్లు ప్రభువు తన మాటలను లేఖన వచనములుగా దయచేసియున్నాడు. ఇదియే మనకు అనుగ్రహించియున్న మున్నా.

ఆయన యొక్క సన్నిధిని వెదకి వాంఛించి, ఆయన యొక్క పరిశుద్ధ స్థలమునందు ఉండే వారికి లేఖన వాక్యము యొక్క ప్రత్యక్షతలను, లోతైన మర్మములను, ఉన్నతమైన ఉపదేశములను బయలుపరచి ఇచ్చుచున్నాడు. ఇది దేవుని సన్నిధి యొక్క రొట్టె. దేవుని సన్నిధిని వాంచించుటకు ఆసక్తి లేనివారు అట్టి ప్రత్యక్షతలను పొందుకొనలేరు. పాత నిబంధనయందు యాజకులు, ఆ దైవ సన్నిధి యొక్క రొట్టెను ఆయన యొక్క సన్నిధిలో భుజించిరి. కొత్త నిబంధనయందు ప్రభువు మనలనే యాచకులుగా చేసియున్నాడు (ప్రకటన. 1:6).

మనము రొట్టెను తినకయున్నట్లయితే ఆత్మీయ బలమును కోలిపోదుము. అంతరంగ పురుషునియందు బలము ఉండదు, శత్రువు యొక్క పోరాటములను ఎదిరించి నిలబడను లేము. మన యొక్క జీవితమునందు పోరాటములును, శోధనలును, కష్టములును వచ్చుటకు ముందుగా మనము దేవుని సన్నిధిని ఆశ్రయించి, ఆయన యొక్క సన్నిధిలో లేఖన వాక్యమునందుగల వాగ్దానములను ఆసక్తితో భుజింపవలెను. మన కొరకు పేర్చబడియున్న పంన్నెండు రొట్టెలను ప్రభువు ఉంచియున్నాడు కదా?

అట్టి పంన్నెండు రొట్టెలు అనుట అపోస్తులుల ఉపదేశములను సూచించుచున్నది. యేసునకు పంన్నెండు శిష్యులు ఉండెను కదా? వారి ద్వారా వ్యక్తిగత మనుష్యుని యొక్క జీవితమునకును, సంఘము యొక్క ఎదుగుదలకును, అపోస్తుల యొక్క ఉపదేశములను ప్రభువు దయచేసెను. కదా!

అనేకులు కావలసినంత సన్నిధి రొట్టెలను తిననందున చిన్న శోధనలు వచ్చినప్పటికిని సోలిపోవుచున్నారు. వారి యొక్క అంతరంగ పురుషునియందు బలము లేకుండా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మాత్రము గాక, దేవుని సన్నిధి రొట్టెలైన లేఖనముల యొక్క ప్రత్యక్షతలను వాంచించి పొందుకొనుటకు ముందుకు రండి.

నేటి ధ్యానమునకై: “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి” (యిర్మియా. 15:16).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.