Appam, Appam - Telugu

జూలై 02 – ఆత్మవలన మాట్లాడుడి

“అన్యభాషతో మాటలాడువాడు, ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు, వాడు మాట్లాడుతున్నది మనుష్యుడెవడును గ్రహింపడుగాని, అతడు మనుష్యులతో కాదుగాని దేవునితో మాటలాడుచున్నాడు”    (1. కొరింథీ. 14:2) 

ప్రభువు యొక్క కుటుంబము నందు గల బిడ్డలు, అన్యభాషలో మాట్లాడుచున్నప్పుడు ప్రభువు యొక్క అంతరంగమంతయును ఆనందించి సంతోషించున్నది. అన్య భాష అనుట పరలోకము యొక్క భాష. పలు సమయమునందు అది దేవునితో మాట్లాడు పలు రకాల లోకమందుగల భాషగా కూడా ఉండవచ్చును.

అన్యభాషతో మాట్లాడుచున్న వాడు ఆత్మ వలన రహస్యములను మాట్లాడుచున్నాడు. అతడు దేవునితో మాట్లాడుచున్నాడు  అని‌ బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది.

ఒక శిశువు మాట్లాడుచున్న ముద్దు ముద్దు పలుకులనేది, వెలుపటనుండి వచ్చుచున్న వారికి ఒకవేళ అర్థము చేసుకొనలేక ఉండవచ్చును. అయితే ఆ శిశువు యొక్క తల్లితండ్రులకు మాత్రమే అది చక్కగా అర్థమగును. అదే విధముగా మనము అన్యభాషలో మాట్లాడుచున్నది సాతానునకు అర్థము కానిదై ఉండను. అయితే ప్రభువునకు అది బట్టబయలైయున్నది. మధురమైనది గాను ఉండును.

అన్య భాషలో చాలా సేపు మాట్లాడుటయు, ప్రార్థించుచు ఉండుటయు, మనలో ఒక గొప్ప ఆత్మీయ సంతోషమును తీసుకొనివచ్చును. దైవ ప్రసన్నతను తీసుకొనివచ్చును. ఒక ఆత్మీయ తృప్తిని ప్రాణమునందు తీసుకొనివచ్చును. మన యొక్క అంతరంగమంతయును పొంగి గంతులు వేయును.

అంత మాత్రమే కాదు, ఆత్మయందు మాట్లాడుతున్నప్పుడు, మనయందు భక్తిలో ఒక క్షేమాభివృద్ధి కలుగుచున్నది. అన్యభాషలో మాట్లాడుచున్నవాడు తన మట్టుకు తానే భక్తియందు క్షేమాభివృద్ధి కలుగునట్లు మాట్లాడుచున్నాడు.  అని అపోస్తులుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు.

మీరు అన్యభాషలో నిండి మాట్లాడుచున్నప్పుడు, మీరు ఎరుగకుండానే ఒక భక్తియందు అభివృద్ధి మీయందు కలుగుచున్నది. ఒక దైవీక ప్రేమ కలుగుచున్నది. ప్రభువు పై కొలత లేనంతగా ప్రేమ కలుగుచున్నది. ఒక గొప్ప ఆదరణయు, ఓదార్పును కలుగుచున్నది. మీరు ఆత్మలో నింపబడి మాట్లాడుచున్నప్పుడు ఆత్మీయ వరములు మీయందు క్రియ చేయుటకు ప్రారంభించుచున్నది.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది:    “ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి బోధించు వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానము గ్రహింపచేయు వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలు మాట్లాడుటయు, మరి యొకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి”   (1.కోరింథీ. 12:8,9,10).

దేవుని బిడ్డలారా, ఆత్మీయ వరములు మీకు మిగుల అవశ్యము. ఇట్టి వరములు ఉంటేనేగాని ప్రభువే దేవుడును సంగతిని నిరూపించగలము. సాతాను యొక్క కట్లను తెంచి వేయగలము. ఆత్మలను ప్రభువునకై సంపాదించగలము. కావున ఆత్మతో నింపబడి అన్యభాషలో మాట్లాడవలెను!

నేటి ధ్యానమునకై: 📖”అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి”     (అపో.కా. 2:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.