Appam, Appam - Telugu

జూన్ 26 – నిస్సారమైన ఉప్పు!

“ఉప్పు నిస్సారమైతే, అది దేనివలన సారము పొందును?” (మత్తయి. 5:13).

ఉప్పును గూర్చి మొట్టమొదటిగా ఆదికాండము 14:3 నందు చదువుచున్నాము. అక్కడ ఉప్పు సముద్రమును గూర్చి చదువుచున్నాము. అది మృత సముద్రము అని కూడాను అనేకులు చేత పిలబడుచున్నది.

రెండోవదిగా, ఉప్పును గూర్చి ఆదికాండము 19:26 నందు చదువు వచ్చును. లోతు యొక్క భార్య వెనకకు తిరిగి చూచి ఉప్పు స్తంభముగా మారెను. మూడోవదిగా, ఉప్పును గూర్చి లేవీ కాండము 2:13 నందు, ఉప్పు అనునది ప్రభువు చేత అంగీకరింపబడుచున్న ఉప్పుగాను, సారవంతమైన ఉప్పుగాను, ఆశీర్వాదకరమైన ఉప్పుగాను ఉండుటను చూచుచున్నాము.

ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను” (లేవి.కా. 2:13)

దేవుని సమూకమఖమునందు ఉప్పు పరిశుద్ధముగా మారుచున్నది. అవును, దాని యొక్క రంగు తెల్లనిదిగాను పరిశుద్ధతను కనబరుచుచూనే ఉండును. నిలువ ఉంచబడియున్న సముద్రపు నీటియందు సూర్యుని యొక్క కాంతి పడుచున్నప్పుడు అది పరిశుద్ధమైన ఉప్పుగా మారుచున్నది.

ప్రభువు కొరకు ప్రత్యేకింప బడుచున్నప్పుడు నీతి సూర్యుడు మనయందు ప్రకాశించి పరిశుద్ధముగా మార్చుచున్నాడు. రోమీయులు ఉప్పును పరిశుద్ధమైనదిగా చూచిరి. యూదులకు సంధ్య వేళ అర్పణగా ఉండెను. మిమ్ములను మీ యొక్క శరీరములను పరిశుద్ధముగాను దేవునికి ఇష్టమైన సజీవ బలిగా అర్పించుకుందురా? (రోమీ. 12:1).

ఉప్పు యొక్క తర్వాతి గుణలక్షణము పదార్థములను కాపాడుచున్నదైయున్నది. మరణించిన శరీరము కొన్ని గంటల సమయము వరకు చెడిపోక ఉండుటకు ఐసు గడ్డలతో ఉప్పును కలిపి భద్రపరచుదురు. మృతదేహము కుళ్ళిపోకుండా ఉంటకు అది సహాయపడును. ఇంటయున్న ఊరగాయలు చెడిపోకుండా ఉండుటకు దానిని ఉప్పుతో ఊరబెట్టుదురు. అప్పుడు క్రిములు అందులో ప్రవేశింపకుండా ఊరగాయ భద్రపరచబడి దీర్ఘకాలము చెడిపోకుండా ఉండును.

నేను మీ యొక్క కుటుంబమును, దేశమును కాపాడునట్లు ఉప్పుగా ఉండుట అవశ్యమైనది. (యెహేజ్కేలు. 3:17) అని ప్రభువు సెలవిచ్చుచున్నాను. మిమ్ములను గూర్చి దేవునికి ఒక ఉద్దేశమును ప్రణాళికయు కలదు. అది ఏమిటి? మనము మన దేశము యొక్క ప్రజలను కాపాడుటయే అది.

ఉప్పు యొక్క తర్వాతి ప్రయోజనము ఏమిటి? అది శుద్ధికరించుచున్నది. కొబ్బరి చెట్టు కాయలను కాయక పురుగులు పట్టినప్పుడు చెట్టు యొక్క మట్టలయందు ఉప్పును ఉంచెదరు. ఆ ఉప్పు చెట్టును శుభ్రపరచును. పురుగులన్నిటిని చంపి వేయును. ప్రభువు కొరకు మీరు ఫలమును ఇవ్వవలెను అంటే మీకు శుద్ధికరణ అవస్యము. ఏరికో పట్టణము యొక్క ప్రజలు అక్కడున్న నీళ్లు చెడ్డదని వేదనతో ఎలిషా వద్దకు వచ్చి చెప్పినప్పుడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పును వేయమని చెప్పి, నీటిని శుద్ధికరించి స్వస్థపరచెను. దేవుని బిడ్డలారా, ప్రయోజనకరమైన ఉప్పుగా ఉండుడి.

నేటి ధ్యానమునకై: “నేను లోకసంబంధిని కానట్టు, వారును లోకసంబంధులు కారు. నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము” (యోహాను. 17:16,17).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.