No products in the cart.
జూన్ 17 – కన్నీటియందు ఆదరణ
“యేసు ఆమెను చూచి, అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకుచున్నావు? అని ఆమెను అడుగెను” (యోహాను. 20:15).”
“ఎందుకని ఏడ్చుచున్నావు” అని ప్రియుని ప్రేమ స్వరము ఆనాడు మద్గలేనే మరియు యొక్క మనస్సును ఎంతగానో ఆదరణ కలిగించెను! ఎంతగా ఆమెను పరవశింపజేసేను! ఆమె “రబ్బూనీ” అని సంతోషముతో ఆర్బట్టించెను.
ఎందుకని ఏడ్చుచున్నావు అని అడిగిన ప్రభువు, తన యొక్క ముఖదర్శనమును మరియకు కృపగా దయచేసెను. సమాధి యందు నిలబడి ఏడ్చున్న ఆమె యొక్క మనస్సు రెప్పపాటులో సంతోషముతో గంతులు వేసెను. సజీవుడైయున్న తన విమోచకుడుని ముఖాముఖి చూచెను. కన్నీళ్లు అంతయు మురుగైపోయెను. ఆ! ఎంత సంతోషము! ఎంత ఆనందము!
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను” (ప్రకటన. 21: 4).
హిజ్కియా రాజు ఒక దినమున కన్నీరు విడిచి ఏడ్చెను. ఆయన మరణమును సంధించుటకు సిద్ధముగా లేదు. ప్రభువు తన యొక్క జీవిత దినములను ఇంకా కొన్ని సంవత్సరములకు ఆజ్ఞాపించడా అని తపించెను. హిజ్కియా రాజు తన యొక్క ముఖమును గోడ వైపునకు తిప్పుకొని ప్రభువుని తేరి చూచి బహుగా ఏడ్చి విన్నపము చేసేను అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.
ప్రభువు వెంటనే తన యొక్క ప్రవక్తయైన యెషయాను పంపించెను. “నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యును నీకిచ్చెదను” (యెషయా.38:5,6). “ఇదిగో, నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. (2. గాజులు. 20:5) అని ప్రభువు ఆయనతో మాట్లాడెను.
మీ యొక్క కన్నీళ్లు ప్రభువు యొక్క హృదయమును కరిగించును. మీయొక్క కన్నీళ్లను నిరాకరించి ఆయన ఎన్నడును దాటి పోవువాడు కాదు. ఆయనే భూమియందు జీవించిన దినములయందు కన్నీరును చిందించెను అను సంగతిని బైబిలు గ్రంథమునందు చదువుచున్నాము. ఒక మనుష్యునిగా లాజరు యొక్క మరణము నందు ఆయన కన్నీరును చిందించెను.
యెరూషలేము పట్టణము యొక్క విమోచనకై, యెరూషలేమును చూచి కన్నీరు విడిచి ఏడ్చెను. గెత్సేమనే తోటయందు విశ్వమంతటి కొరకు దేవుని వైపు తేరి చూచి బలమైన శబ్దముతోను కన్నీటితోను విజ్ఞాపన చేసెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు మీ కన్నీళ్లను చూచువాడును, కన్నీళ్లను తుడుచువాడును, కన్నీళ్ల విడచు సమయమునందు ఆదరణను కలిగించువాడు మాత్రము గాక, మీకు విడుదలను, సమాధానమును ఇచ్చి మిమ్ములను ఓదార్చువాడగాను ఉన్నాడు. ఆయన మీ కన్నీళ్లను చూడకుండా ఉండునా?
నేటి ధ్యానమునకై: “ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును” (యెషయా.25:8).