No products in the cart.
జూన్ 09 – వ్యతిరేకతలయందు ఆదరణ
“దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే” (రోమీ. 8:33).”
నేటి దినములయందు లోకమంతయును నేరము మోపెటువంటి ఆత్మచేత నింపబడిqయున్నది. న్యాయస్థానమునందు నేరస్తుడిగా నిలబడియున్న ఖైదీపై వకీలు నేరమును మోపును. ఒక దేశముపై మరొక దేశము నేరమును మోపూచున్నది. రాజకీయ పార్టీలు ఒక దానితో ఒకటి నేరమును మోపుకొనుచున్నది. ఇరుగుపొరుగు నందు నివాసముండు వారును, కుటుంబ సభ్యులు కూడాను ఒకరినొకరు నేరమును మోపుకొనుచున్నారు.
నేటి ఆత్మసంబంధమైన లోకమందు విశ్వాసులను ఎదిరించి విశ్వాసులును, సేవకుల నెదిరించి సేవకులును నేరమును మోపుకోనుచూనే ఉన్నారు. ఇది ఎంతటి వేదన కరమైనది! దేవుని బిడ్డలారా, అనేకులు మీపై నేరమును మోపునట్లు లేచియున్నారా? మీయొక్క మనస్సును నొప్పించేటువంటి మాటలతో దెప్పి పొడుచుచున్నారా? మీ మనస్సు యొక్క గాయము ఆరక బాధ కలిగినదై ఉండుటచేత జీవితమునందు ఒక పట్టులేనివారై తిరుగుచు నడుచుచున్నారా?
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే” (రోమీ. 8:33).
దానియేలుపై నేరమును మోపుటకు బబులోను దేశపు ప్రధానులు ఎంతగానో ప్రయత్నించిరి. దేవుని విషయముందు మాత్రమే అతనిపై నేరమును మోపగలమని తలంచి, రాజుగారి వద్ద అతనిని గూర్చి కొండెములను చెప్పిరి. అందువలన దానియేలు సింహపు గృహలో వేయబడ వలసిన భయంకరమైన పరిస్థితి వచ్చెను. అయినను, సింహపు గృహలో వేయబడినప్పుడు సింహములు అతనికి ఎట్టి హాని చేయలేదు.
రాజు దానియేలును పిలచి, “జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను సింహముల బారినుండి రక్షించుటకు శక్తికలిగనవాడై యుండెనా? అని యతనిని అడిగెను” (దాని. 6:20).
దానికి బదులుగా దానియేలు, “ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. అది ఎందుకనగా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను” (దాని. 6:22).
దానియేలు మనుష్యులచే నేరము మోపబడినను, దేవుని ఎదుట నీతిగలవాడై యుండెను. ప్రభువు అతని పక్షమందు నిలిచెను. ఆయన సింహపు గృహలో పడవేయ బడినప్పుడు కూడా, ప్రభువు ఆయనను తప్పించుటకు శక్తిగలవాడై యుండెను.
దేవుని బిడ్డలారా, ఇతరులు మీపై అబద్ధముగా నేరమును మోపినను, ప్రభువు మీపై మోపబడిన నేరమును చూచు వాడుకాదు. ఆయన మీయొక్క నీతిని చూచి, మిమ్ములను ఆశీర్వదించి, హెచ్చించువాడై యున్నాడు. వ్యతిరేకతల మధ్యను, ప్రభువు యొక్క దృష్టి యందు మీకు కృప దొరుకుట నిశ్ఛయము. దానిని తలంచి ఆదరణ పొందుడి.
నేటి ధ్యానమునకై: “ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు” (సంఖ్యా. 23:21).