Appam, Appam - Telugu

జూన్ 04 – వ్యాధియందు ఆదరణ

“అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి;. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పెను”   (మత్తయి. 8:3). “

వ్యాధి యందు అవస్థపడుతున్న సమయములు సంచలపడుతున్న సమయములైయున్నవి. వ్యాధి యొక్క తీవ్రత ఒకపక్క దాడి చేయుచుండగా, శారీరక బలహీనత మరోవైపు దాడి చేయుచున్నది. ఏమి జరుగునో అను భయము ఒకవైపు మనస్సును పిండివేయుచున్నది. అయితే వ్యాధిసయమము నందును ప్రభువు మీతో కూడా ఉన్నాడు అను సంగతిని మీరు మర్చిపోకూడదు.

అయన సమస్తమును మీ యొక్క మేలు కొరకు చేయుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “దేవుని ప్రేమించువారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము”    (రోమీ. 8:28). వ్యాధి సమయములందు కూడా మీ యొక్క చెంతన కూర్చుండి, మీయొక్క కొదువులను గ్రహింపజేసి, దానిని నివృత్తి చేసుకొనుటకు ప్రభువు సహాయ పడుచున్నాడు. మీతో కూడా మాట్లాడి మిమ్ములను ఉత్సాహ పరచుచున్నాడు.  మీకు శారీరక విశ్రాంతిని ఇచ్చి మిమ్ములను ఆత్మయందు బలపడునట్లు చేయుచున్నాడు.

ఆనాడును ప్రభువు  ఇశ్రాయేలీయుల ప్రజలతో నిబంధననుచేసి,   “నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రాయ్యనిను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే”   (నిర్గమ.15: 26)  అని చెప్పెను. అట్టి వాత్సల్యత గల ప్రభువే తనయొక్క వాక్కును పంపి మిమ్ములను స్వస్థపరచును. తన యొక్క గాయపడిన హస్తముచే మిమ్ములను ముట్టి స్వస్థపరచువాడు.

క్రీస్తుయొక్క హస్తములు కుష్టరోగులను స్వస్థపరచు తైలముగా ఉండెను. పేతురు యొక్క అత్తయ్య  జ్వరమును తొలగించు మహా గొప్ప ఔషధముగా ఉండెను. ఊచగల చెయ్యిని తిన్నగా చేయు శక్తిగలదై యుండెను. సిలువలో చాపబడి, చాపబడిన ఆహస్తములు నేడును గాయములు గలవైయున్నవి.

శరణాగతుల విశ్రమ స్థానమందు ప్రభుత్వము ఒక వైద్యశాలను నిర్మించెను. ఆ వైద్యశాలకు సమీపాన ఒక చిన్న క్రైస్తవ వైద్యశాల కూడా ఒకటి ఉండెను. అయితే ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళకుండా, సమీపమున ఉన్న ఆ చిన్న క్రైస్తవ వైద్యశాలకే వెళ్లి వైద్యమును చేయించుకొనిరి.

” ఈ రెండు స్థలముల యందును వైద్యము ఒక్కటే, చికిత్సయు ఒక్కటే. అయితే హస్తమలయందే గొప్ప వ్యత్యాసము. క్రైస్తవ వైద్యశాల యందు కనికరముతోను, ప్రేమతోను చికిత్స ఇవ్వబడుటచే, ఆ హస్తములు మమ్ములను ఆదరించుచున్నది. హస్తములను మేము క్రీస్తు యొక్క హస్తములుగానే చూచుచున్నాము. అందుచేత ఆరోగ్యముతో కూడా ఆదరణను, సమాధానమును, సంతోషమును పొందుకొనుచున్నాము”   అని ప్రజలు తెలియజేసిరి.

దేవుని బిడ్డలారా, వ్యాధి సమయములయందు భయపడి, వ్యాధి అధిగమించునేమో, నేను మరణించుదునేమో అనియంతా తలంచి ఎన్నడును కలత చెందకుడి. ప్రభువు నిశ్చయముగానే తనయొక్క గాయము పొందిన హస్తమును మీ పై ఉంచి మీకు స్వస్థతను, బలమును, ఆరోగ్యమును ఆజ్ఞాపించును. ఆయన  యొక్క ఆదరణ తప్పక మీకు కలదు.

 నేటి ధ్యానమునకై: ” ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి”   (1. పేతురు.2: 24).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.