No products in the cart.
జనవరి 09 – క్రొత్త పాత్ర!
“అతడు క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని చెప్పెను” (2. రాజులు. 2:20)
యెరికో నుండి కొంతమంది మనుష్యులు ఎలీషాను చూచుటకు వచ్చి, “మా యేలినవాడవైన నీకు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని కనబడుచున్నది గాని, నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని” ఎలీషాతో అనగా. అప్పుడు ఎలీషా ‘ఒక క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని’ వారితో చెప్పెను. ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా: ఈ నీటిని నేను బాగు చేసియున్నాను; గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను” (2 రాజులు. 2:19 – 21).
యెరికో మీదన ఒక శాపము ఉండెను. యెహోషువ యెరికోను పట్టుకున్నప్పుడు, యెరికో మీద శాపమును పలికెను. దాని ఫలితముగా ఆ భూమి నిస్సారమైపోయెను, నీళ్లును పనికిరానిదై ఉండెను.
అయితే, అట్టి శాపమును తొలగించుటకు ఎలీషా చేసిన పని ఏమిటి? క్రొత్త పాత్రను తీసుకొని వచ్చునట్లు చేసెను. ఆ కొత్త పాత్రయే దేవుని యొక్క కృప. ప్రతి ఉదయమును ప్రభువు యొక్క కృప క్రొత్తదిగానే ఉండును. శాపములు తొలగిపోవుట దేవుని యొక్క కృపవలనైయున్నది, పాపములు క్షమింపబడుటయు ఆయన యొక్క కృపవలనైయున్నది.
కావున అపోస్తులుడైన పౌలు, “విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే” అని చెప్పెను (ఎఫెసీ. 2:8). కొత్త పాత్రలో ఉప్పు వెయ్యవలసినదై ఉండెను అది దేవుని యొక్క కృపయు, మనుష్యుల యొక్క విధేయతయు, ఏకమవుటను కనపరచుచున్నది.
ఎలిషా చెప్పినప్పుడు ఆ మనుష్యులు అలాగునే ప్రభువు యొక్క మాటకు విధేయులైయిరి. వారు ఎట్టి ఎదురు మాటను చెప్పక, సంసయించక ప్రభువు యొక్క మాటకు విధేయత చూపినప్పుడు, అద్భుతము జరిగెను. ఆ అద్భుతము అట్టి సమయమునకు మాత్రము తాత్కాలికముగా జరిగినదై ఉండలేదు. “నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది” (2. రాజులు. 2:22).
మీరు ఈ సమాజమునకును, దేశమునకును ఆరోగ్యమును తీసుకొచ్చునట్లు భూమికి ఉప్పుగా ఉన్నారు (మత్తయి. 5:13). ఉప్పు ఆహారమునకు రుచిని ఇచ్చుచున్నది. ఉప్పు ఊరగాయ వంటి పదార్ధములను చెడిపోకుండా భద్రపరచును.
మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి (కొలస్సీ. 4:6). అప్పుడు మీరు ప్రభువునకును, ప్రజలకును ప్రయోజనము గలవారై ఉందురు. ఉప్పుసారము లేకున్నట్లయితే, ఇదిగో! ఇతడు ప్రయోజనము లేని మనుష్యుడు సారము లేనివాడని చెప్పుదురు (మత్తయి.5:13).
దేవుని బిడ్డలారా, కొత్త పాత్రయందు ఉప్పుచేత కొత్త కృపను కలిగియున్నవారై, ప్రభువు యొక్క మాటకు విధేయతగలవారై ఉండవలెను. అప్పుడు నిస్సారమైన వాటిని అంతటిని, మీరు సారము గలదానిగా మార్చివేయుదురు.
నేటి ధ్యానమునకై: “నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చ వలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను” (లేవీ. 2:13).