No products in the cart.
ఆగస్టు 29 – దైవ ప్రసన్నత!
“క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచ బడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును, అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను” (2. తిమోతికి. 1:10).
దైవ ప్రసన్నత మిమ్ములను బహు చక్కగాను, మధురముగాను, మహిమతో కప్పునుగాక! ఈ భూమి మీద ప్రభువు మనకు అనుగ్రహించియున్న ధన్యతలలో బహు శ్రేష్టమైన ధన్యత దేవుని ప్రసన్నతయైయున్నది.
దైవీక ప్రసన్నతయందు మధురమైన సంతోషమును, శక్తియు ఉన్నది. ఆయన యొక్క ప్రసన్నతను గ్రహించుచున్నప్పుడు ప్రభువు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి మనస్సు యొక్క మెండుతనమును, విశ్వాసము మనలను ఉల్లసింపచేయుచున్నది.
బైబిలు గ్రంథమునందు ప్రభువు తన యొక్క ప్రసన్నతను మనకు వాక్కునిచ్చియున్నాడు. “నేను నిన్ను విడిచి యెడబాయను; నిన్ను చెయ్యి విడచి పెట్టను” అను వాగ్దానమే ప్రభువు యొక్క ప్రసన్నతను గూర్చి మనకు అనుగ్రహింపబడియున్న అమూల్యమైన వాగ్దానమైయున్నది.
మన యొక్క జీవితమునందు ఎన్నో సమస్యలును, పోరాటములును వచ్చినను, ప్రభువు తన యొక్క ప్రసన్నతను ఎల్లప్పుడును మనకు అనుగ్రహించెదనని దృఢముగా చెప్పియున్నాఢు. ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “నీవు జలములలో పడిదాటునప్పుడు నేను నీకు తోడైయుందును; నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు; నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు; జ్వాలలు నిన్ను కాల్చవు” (యెషయా. 43:2).
“ఏలయనగా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో, అక్కడ నేను వారి మధ్యన ఉందును” (మత్తయి. 18:20). అనుటయే ప్రభువు యొక్క వాగ్దానము. అవును, పరిచయము లేనివాడిగా ఆయన మన యొక్క చెంతనే నిలబడియున్నాడు. “వారు ఒకవేళ దేవునడైయున్న తన్ను తడవులాడి కనుగొందురేమోయని, తన్ను వెదకు నిమిత్తము … ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు కదా” (అపో.కా. 17:26,27).
దైవ ప్రసన్నత నన్ను విడిచి ఎడబాయునేమో, భవిష్యత్తు కాలమునందు ఆయన యొక్క ప్రసన్నత నాతో కూడా ఉండునా లేక ఉండదా అనియంతా మనము సందేహపడి కలవరపడవలసిన అవసరంలేదు. ఆయన యుగసమాప్తి వరకు ప్రతి దినమును మనతో కూడా ఉండెదను అని వాక్కును ఇచ్చియున్నాడు (మత్తయి. 28:20).
అనేకమంది ప్రభువు యొక్క ప్రసన్నతను వెంటాడుటలేదు, కాంక్షతో వెతుకుటలేదు. ప్రభువు యొక్క ప్రసన్నతలోని ఆశీర్వాదములను ఎరుగకయేయున్నారు. కొన్ని సమయములయందు మనము ఆయనక ప్రసన్నతను నిర్లక్ష్యము చేసి తూలనాడినను, ప్రభువు అయితే ప్రేమగలవాడై మనతో కూడా ఉండుటకే కోరుచున్నాడు.
యేసు చెప్పెను: “ఎవడైనను నా స్వరము విని, తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి, అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము” (ప్రకటన. 3:20). దేవుని బిడ్డలారా, ఆయన మనతో కూడా ఉండుట కొరకే తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “శుభప్రదమైన మన నిరీక్షణ నిత్యమైన ధన్యత నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, …. మనకు భోధించుచున్నది” (తీతుకు. 2:12,13).