Appam, Appam - Telugu

ఆగస్టు 22 – ప్రభువు దయచేయుచున్న విశ్రాంతి!

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, మీరందరు నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతిని కలుగజేతును”    (మత్తయి. 11:28

విశ్రాంతిని ప్రభువు మనకు పాతనిబంధన యందును వాగ్దానము చేసియున్నాడు  (నిర్గమ.33:14), క్రొత్త నిబంధన యందును వాగ్దానము చేసియున్నాడు (మత్తయి. 11:28). కావున విశ్రాంతి మన యొక్క జన్మహక్కు. ప్రభువు మన కొరకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానము. అది దైవీక ఆశీర్వాదములయందు ఒకటైయున్నది.

‘నా యొద్దకు రండి’. అవును, అదియే ప్రభువు విశ్రాంతిగా మనకు ఉంచియున్న ఒక మార్గము.   ‘వ్యర్థముగా ప్రయాసపడి భారము మోసుకొనుచు ఆలయుచు తిరుగుతూ ఉండవద్దు,  నా యొద్దకు రండి. రోగముల చేతను, వ్యాధుల చేతను దుఃఖపడి,  కలతతోను కన్నీటితోను జీవించవద్దు, నా యొద్దకు రండి. నా భారమును ఎక్కడ దించి పెట్టెదవలెను అని కలత చెంది తపనపడవద్దు, నా యొద్దకు రండి’  అని ప్రేమతో యేసుక్రీస్తు తన రెండు చేతులను చాపి పిలుచుచున్నాడు.  నిశ్చయముగానే ఆయన వద్ద విశ్రాంతి కలదు.

ఒక యవ్వనస్థుడు అతి భయంకరమైన లారీ ప్రమాదమునకు గురైన్నప్పుడు, అతనికి  ఒక కాళ్లు నుజునుజ్జై విరిగిపోయెను. మరో కాళ్లునకు భయంకరమైన దెబ్బ, మరియు వేదన.  అతనిని వైద్యశాలయందు అనుమతించిరి.  అక్కడ ఒక కాళ్ళను శస్రసికిత్స చేసి కోసి తీసివేయవలసినదై ఉండెను.  నొప్పిని, వేదనను తట్టుకోలేక రాత్రింబగళ్లు విలవిలలాడుచుండెను.   ‘అయ్యా నేను చనిపోయినట్లయితే బాగుండును’ అని రాత్రంతయు అతడు వేదనతో విలపించుచు ఉండెను.

అతని ప్రక్క పరుపునందు ఒక సేవకుడు ఆరోగ్యము బాగోనందున చికిత్స పొందుచు ఉండెను. ఇతడు విలపించుచు ఏడ్చుచున్న శబ్దము ఆ సేవకుని యొక్క చెవులయందు మానక వినబడుచు ఉండెను.

ఆయన ప్రేమతో అతని వద్ద సమీపమునకు వెళ్లి,    ‘తమ్ముడా నేనొక పాటను పాడనా?’  అని అడిగి, ‌ ‌ ‘కాచును నిన్ను కాచును,  ప్రభువు కాచును ఇకను ఇకమీదటను కాపాడును. కలత చెందకు కుమారుడా కాపాడును’  అను  పాటను గొప్ప శబ్దముతో పాడి, అతని కొరకు ఆశక్తితో ప్రార్థన కూడా చేసెను.

ఆ సమయమునందు, ప్రభువు యొక్క హస్తము అతనిని అక్కున చేర్చుకొనినందున అతడు కన్నీటితో ఏడ్చేను.  దైవీక ఆదరణయు, సమాధానమును అతని హృదయములోనికి వచ్చెను. ప్రభువు అతని యొక్క వేదనంతటిని మార్చివేసేను. అతని యొక్క శరీరక ఆరోగ్య స్థితియందు మంచి  అభివృద్ధి ఏర్పడెను. ఒక కాలు అతనికి లేకుండుట ఎట్టి చింతయు కలగకుండెను

ప్రభువు విశ్రాంతిని వాగ్దానము చేయుటకు గల కారణము ఏమిటి? ఆయన ముందుగానే మన యొక్క దుఃఖములను, వేదములను, రోగములను, బలహీనతలను శిలువయందు మోసి తీర్చివేయుటయే దీనికి గల కారణము. ఆయన ప్రయాసపడి వేదనను అనుభవించినందున మన యొక్క బాధలను, వేదనలను బాగుగా ఎరుగును. అంత మాత్రమే కాదు, దానిని తొలగించుటకు శక్తిగలవాడై ఉన్నాడు.   “ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి”  అని హృదయ కనికరముతో పిలుచుచున్నాడు

నేటి ధ్యానమునకై: “తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు (నెమ్మది) విశ్రాంతి దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు”      (1. రాజులు 8:56).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.