Appam, Appam - Telugu

ఆగస్టు 17 – యెహోవాతెరవజేయువాడు!

“యెహోవాగ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు; యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు; యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు”     (146:8,9).

యేసుక్రీస్తు మీశరీరిక  కన్నులను  తెరచుటకు శక్తి గలవాడు. ఆత్మీయ కన్నులనుప్రకాశింపజేటకు శక్తిగలవారు. అపో. పౌలు,   “తన శక్తియొక్కఅపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,మీకు జ్ఞానమునుప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు,  నేను నాప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను”     (ఎఫెసీ.1:18-19) అని చెప్పెను.

ఒకవైపున ప్రభువు,గ్రుడ్డివారి యొక్కకన్నులను తెరచినను, మరోవైపున సాతానుతరవబడియున్న కన్నులకు గ్రుడ్డితనమును కలుగజేయుచున్నాడు. ఒకసారి అతి గొప్ప ధనికునియొక్క ఏకైక కుమారుని కొందరు ఎత్తుకెళ్లి అతని యొక్క కన్నులయందు బొద్దింక పురుగునుకట్టి, ఒక చీకటి గృహలోపడవేసిరి. రెండు మూడు దినములుగా ఈ బొద్దింక పురుగు, అతని రెండు కన్నులను తొలపించి వేసేను. అతడుపూర్తిగా చూపును కోల్పోయెను.

దాని తరువాత,బిక్షము ఎత్తుకొను వారివద్ద మంచి రేటునకు అమ్మి వేసిరి. బహు సంపన్నముగా జీవించిన ఆ చిన్న పిల్లవాడు,కన్నులు తెలియనిస్థితియందు దౌర్భాగ్యముగా బిక్షమెత్తుకొనుచు ఉండెను. సాతాను కూడా దానినే ఆదామునకుచేసెను. ఆశను చూపించి, పాపము చేయునట్లుచేసి, ఆదాము యొక్కఆత్మీయ నేత్రములకు  గ్రుడ్డితనమునుకలుగచేసేను.  సాతాను ఒక హంతకుడును, దొంగయు కూడాను.

యేసుచెప్పేను:    “దొంగ దొంగతనమును హత్యనునాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగాకలుగుటకును నేను వచ్చితిని”    (యోహాను. 10:10).

బహు చక్కగాప్రభువు చేత వాడబడిన వాడు సంసోను. అయితే సాతాను, జారత్వపు మత్తును ఇచ్చి, సంసోను కన్నులను తొలిపించి, రక్తశిక్తముగా చేసి చెరిపి వేసేను. ముంజుకాయినిదాని బెజ్జములో నుండి త్రొవ్వితీయునట్లు సంసోను యొక్క కన్నులను త్రొవ్వితీసివేసిరి.

అయ్యో! ఇకజీవితకాలమంతయును అతడు గ్రుడ్డివాడు. ఫిలిస్తీయ్యుల కోతులాడించువాడు కోతులనుపెట్టుకొని వింతలను చూపించునట్లు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతియైయున్న సంసోనునుప్రదర్శన వస్తువుగా చేసి, వింతలనుచూపించిరి. కన్నుల యొక్క ఇచ్చయు, వ్యభిచారము యొక్కమత్తు మీలో ప్రవేశింపకుండునట్లు కాపాడుకొనుడి. ఆత్మీయ దర్శనమును ఇచ్చు మనోనేత్రములను కోల్పోకుడి.

ఇశ్రాయేలీయులయొక్క రాజుగా ఉన్న సిద్కియాకు ఏర్పడినది ఏమిటి? యిర్మియాచే ప్రకటించబడిన ప్రభువు యొక్క మాటకు,ఆ రాజు చెవియోగ్గలేదు.బబులోను రాజు దండెత్తి వచ్చెను.

బైబిలు గ్రంథముసెలవిచ్చుచున్నది:    “సిద్కియాకన్నులు ఊడదీయించి, అతనినిబబులోనునకు తీసికొనిపోవుటకై అతనిని రెండు ఇత్తడి సంకెళ్లతో బంధించెను” (యిర్మీయా.39:7).  మరియు. “రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోనునకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనినిపెట్టించెను”     (యిర్మియా. 52:11).

దేవుని బిడ్డలారా,ప్రభువు యొక్కహెచ్చరికలకు ప్రధానమైన ప్రాముఖ్యతను ఇవ్వుడి. ఎల్లప్పుడును పరిశుద్ధముగా నడిచిప్రభువు యొక్క కృపయందు మిమ్ములను కాపాడుకొనుడి.

నేటి ధ్యానమునకై:”దేహమునకు దీపము కన్నే; గనుక నీ కన్నుతేటగా ఉండినయెడల, నీ దేహమంతయువెలుగు మయమైయుండును”    (మత్తయి. 6:22).

ఈ రోజు బైబిల్ రీడింగ్

Leave A Comment

Your Comment
All comments are held for moderation.