bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

ఆగస్టు 11 – వాగ్దానమువలన విశ్రాంతి!

“ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక”.     (1. రాజులు. 8:56) 

“ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను, అపాయమేమియు కలుగకుండను, నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మదిని దయచేసియున్నాడు”   (1. రాజులు. 5:4). ఇశ్రాయేలీయుల రాజ్యమును సొలోమోను చేతికి అప్పగించుచున్నప్పుడు దావీదు ఇచ్చిన సాక్ష్యమే ఇది.

మీ యొక్క విశ్రాంతిని చెరిపివేయుచున్న శత్రువులను ప్రభువు తొలగించి వేయను. మీ శత్రువులకు ఆయనే శత్రువుగా మారి, మీకు సమాధానమును ఆజ్ఞాపించును. కావున, విశ్రాంతిని స్వతంత్రించుకొనుడి.

“ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది;  యెహోవా రక్షించిన జనమా, నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము;  నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు; నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు”     (ద్వితి. 33:29).

అవును, ఒక మనుష్యుడు అతని యొక్క శత్రువులు చుట్టూతా ఆవరించియున్నప్పుడు, అతని వల్ల విశ్రాంతి పొందలేడు. శత్రువులు ఏమి చేయుదురో, ఎట్టి గుంటనక్క తంత్రము పన్నుదురో, ఎట్టి గుంటను త్రవ్వి ఉంచుచున్నారో, అని యంతా తలంచుచునే ఉండును.

ఉదాహరణనకు, రాత్రి పది గంటలకు పండుకొనుటకై దీపములన్నిటిని ఆర్పేటువంటి సమయము వరకు మీ యొక్క కుమారుడు ఇంటికి తిరిగి రాలేదంటే, పోతే పోనీ  అని తలంచి మీ వల్ల నిద్రించి విశ్రమింపగలరా?   ‘అయ్యో!  పిల్లవాడు ఎక్కడికి వెళ్లాడో, అతనికి ఏమి సంభవించెనో? అను భయము ఏర్పడి మీ విశ్రాంతిని చెరిపివేయను కదా?

కనాను దేశమునందు ఏడు జనాంగములును, ముప్ఫై ఒక్క రాజులును ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉండిరి. వారిని నిర్మూలము చేసేంతవరకు అక్కడ విశ్రాంతికి చోటు లేదు. యెహోషువా యొక్క నాయకత్వమునందు, ఇశ్రాయేలీయులు యుద్ధమును చేసి,  సమాధానమును పొందుకొనిరి.  న్యాయాధిపతుల కాలమునందు వారు విశ్రాంతిలోనికి ప్రవేశించిరి.

అదేవిధముగా దావీదు యొక్క దినములయందు నలభై సంవత్సరములు శత్రువులతో యుద్ధమును చేసి,  విజయమును పొంది, ఇశ్రాయేలీయులను సమాధానములోనికి నడిపించెను. అందువలన దావీదు యొక్క కుమారుడైయున్న సొలోమోను యొక్క  దినములయందు నలభై సంవత్సరములు దేశమునందు యుద్ధము  లేకుండా  శాంతిని  కలిగి ఉండెను. అట్టి సమాధానముగల కాలమునందే  యెరూషలేము దేవాలయము కట్టబడెను.  యెరూషలేము అనునది ప్రాకారమును, గొళ్లెములు గల పట్టణముగా మారినది.

“నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధాన కర్తగానుండును; చుట్టూతా ఉండు అతని శత్రువులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును    (1. దిన. 22:9). దేవుని బిడ్డలారా, మీ కొరకు కల్వరి యుద్ధమును చేసినందున, ప్రభువు ఇచ్చుచున్న విశ్రాంతిలోనికి ప్రవేశించుడి.

నేటి ధ్యానమునకై: 📖”యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేక పోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను”     (2. దిన. 14:6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.