bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam - Telugu

ఆగస్టు 09 – “జీవము కలుగునట్లు….!”

“నేనైతే గొఱ్ఱలకు జీవము కలుగుటకును, అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని”   (యోహాను.10:10) 

నేను వచ్చితిని,  పరిపూర్ణముగా జీవమును ఇచ్చుటకై వచ్చితిని’  అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అబ్రహామునకు పూర్వమునందే ఉండిన వాడను అని చెప్పినవాడు. ఈ భూమి మీదకు దిగివచ్చెను. జగత్తుత్పత్తికి ముందుగానే మనలను ఏర్పరచు కొనిన శాశ్వతుడైన దేవుడు సమృద్ధిగల జీవమును ఇచ్చుటకు ఈ భూమి మీదకు వచ్చెను. ఉన్నవాడనై ఉన్నానని మోషేతో వాగ్దానము చేసినవాడు. నిత్యజీవమును మనము కలిగి ఉండుటకు, మనవలె రక్త మాంసములును కలిగినవాడై ఈ లోకమునకు వచ్చెను.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది,    “దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేని వాడే. మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు  మీకు ఈ సంగతులను  వ్రాయుచున్నాను”    (1.యోహాను. 5:11,12).

యేసుక్రీస్తు ఇచ్చుచున్న ఆ జీవము సాధారణమైన  జీవము కాదు. అది అంతములేని, నిత్యమైన, వాస్తవమైన జీవితమునకు కావలసిన జీవము. దానిని ఇచ్చుటకై ఆయన తన జీవమును అర్పించెను.  అనేకులు తమ యొక్క జీవితమును ద్వేషించుచు, ఎంత కాలము నేను ఈ వ్యాధి చేత బాధపడవలెను? ప్రభువు నా జీవమును తీసుకున్నట్లయితే మేలుకరమై ఉండునే అని అంగలార్చుచున్నారు.  వ్యాధితోను, వేదనతోను, దుఃఖముతోను దీర్ఘ కాలము జీవించుట అనేది నెమ్మదిలేని జీవితముగానే ఉండును.

అయితే ప్రభువు మీకు జీవమును, సౌఖ్యమును, బలమును మరియు ఆరోగ్యమును మొదలగు వాటిని ఇచ్చుటతోపాటు సంతోషకరమైన దీర్ఘాయువును ఇచ్చెదను అని వాక్కునిచ్చుచున్నాడు. నిత్యజీవము  అనుట సంపూర్ణమైన జీవితము. క్రీస్తునందు సమాధానమును, సంతోషమును సమృద్ధి గల జీవితము. క్రీస్తును నిజముగా కనుకొనిన జీవితమునందు ఇట్టి మహదానందము కలదు!

ఒక బండి యొక్క చక్రము తిరుగుతున్నప్పుడు దాని మధ్యన అమర్చబడియున్న శీలను విడిచి తిరిగినట్లయితే బండి ఒరిగి పోవును. అదేవిధముగా ఆత్మీయ జీవితమునందు సంచక్కరుగా ఉన్న క్రీస్తును విడచి వయితొలగి జీవించినట్లయితే, మీ జీవితము కూడా వేదనలోనే ముగియును. అదే సమయమునందు క్రీస్తును కేంద్రముగా కలిగియున్న ఒక జీవితమును అమర్చుకున్నట్లయితే, మీ జీవితము నిత్యాసిర్వాదముగలదై ఉండును. నిత్యజీవమును పొందుకొని జీవించెదరు.

కొందరు సంపదయందు తులతూగుచున్నారు. బడాయితో కూడిన జీవితమును జీవించుచున్నారు. పేరును, ప్రక్రాతియు, ధనమును, బందువర్గమును ఉండుటయే వాస్తవమైన జీవితము అని పొరపాటుగా భావించుచున్నారు. అయితే అట్టి జీవితము అశ్వతమైన ఒక జీవితమైయుండును ఆని వారు గ్రహించుటలేదు.  మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఉండుటతోపాటు ఆయనయే మి జీవితము నడిపించు చున్న ప్రభువుగా కలిగియున్నారు. అయననే ఆధారభూతుడుగా కలిగి జీవించుచున్నప్పుడు మీ జీవితము పూర్ణ ఆనందముతోను, సమాధానముతోను  నిండియుండును.

నేటి ధ్యానమునకై: “నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును”    (యోహాను.6: 27).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.