bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

ఆగస్టు 06 – తండ్రి చిత్తప్రకారము….!

“ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు  గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును”    (మత్తయి. 7:21

“ప్రభువా,  ప్రభువా”  అని నాలుకటంచులతో ఉచ్చరించుట సులువే. అయితే పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తప్రకారము సంపూర్తిగా సమర్పించుకొనుట అనేది బహు కట్టినమైనదే. ప్రభువును ప్రేమించుచున్నాను అని నోటితో చెప్పుట సులువే. అయితే ప్రభువు ఎదురుచుచున్నది ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడవలెను అనుటయే. నోటిమాటలతో ప్రభువును స్తుతించుట మాత్రము గాక, దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును చేయుటకు మిమ్ములను సంపూర్తిగా సమర్పించుకొనుటయే మిగుల ప్రాముఖ్యము.

ఒకసారి ఒక సహోదరి వద్ద బాప్తిస్మము పొందవలసిన అవశ్యతను గూర్చి లేఖన గ్రంథ వాక్యములతో ఒక వ్యక్తి వివరించెను.  అయితే ఆ సహోదరి ఆ సంగతిని వినుటకు ఇష్టపడలేదు. నేను ప్రభువును ప్రేమించుచున్నందున పరలోకమునకు వెళ్ళుదును అని చెప్పి వెళ్ళిపోయెను. లేఖన  గ్రంథమునందు సూచింప బడియున్న సత్యములను వెంబడింపవలెను అనుటయే, ప్రభువు యొక్క చిత్తమును తెలుసుకొనుటకు గల ప్రాముఖ్యతనే ఆ సహోదరి తెలుసుకొనలేదు.

ప్రభువు యొక్క చిత్తప్రకారము చేయుటకు ఇష్టము లేక, ప్రభువును  చూచి  ప్రభువా, ప్రభువా అని చెప్పుకొనుచు ఉండుటచేత ప్రయోజనము లేదు.  ప్రభువును ప్రేమించుచున్నవాడు విడిచి పెట్టవలసిన పాపములను విడిచి పెట్టవలెను, నెరవేర్చవలసిన నియమములను నెరవేర్చవలెను. దేవుని యొక్క చిత్తమునకు తన్ను పరిపూర్ణముగా సమర్పించుకొని ముందుకు కొనసాగుతు వెళ్ళవలెను.

యోనాను చూడుడి! ఆయన, ప్రభువును గూర్చి ప్రసంగించిన ఒక బలమైన సేవకుడైయున్నాడు.  అయితే ప్రభువు నీనెవేకు వెళ్ళమని చెప్పినప్పుడు దైవ చిత్తమును అతిక్రమించి తర్షీషునకు పోవునట్లు ఓడను ఎక్కెను. ప్రభువు ఆ విషయమును అంగీకరించెనా?

కొద్దిగా ఆలోచించి చూడుడి! దీని కారణము చేత ప్రభువు యోనా యొక్క జీవితమునందు ఒక సముద్రపు ఉప్పెనను ఏర్పరచి,  పెద్ద మత్స్యమను సిద్ధపరచి, అతనిని మింగునట్లు చేశెను. దైవ చిత్తమును నెరవేర్చవలసిన ప్రాముఖ్యతను నేర్పించెను.

దావీదు రాజు యొక్క విజయమంతయును,   “నీవే నా దేవుడవు; నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు  నాకు నేర్పింము, దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను  నడిపించును గాక”    (కీర్తన .143:10) అనుటయై యుండెను.

మీరు ప్రభువు యొక్క చిత్తమును చేయుటకు మిమ్ములను సమర్పించుకున్నప్పుడు, ప్రభువు  యొక్క కుటుంబమునందు కనబడుదురు. ఆయనతో సహవాసము కలిగియుందురు. యేసు సెలవిచ్చెను,   “పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నాకు సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియునై యుండును”    (మత్తయి .12:50).  దేవుని బిడ్డలారా దేవుని యొక్క చిత్తమును చేయుటకు మిమ్ములను పరిపూర్ణముగా సమర్పించుకొనుడి.

 నేటి ధ్యానమునకై: “యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక; యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌”     (హెబ్రీ. 13:21).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.