No products in the cart.
ఆగస్టు 02 – “పేరు పెట్టునట్లు…!”
“దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను” (ఆది. 2:19)
ప్రభువు మృగములను, పక్షులను, చెట్టు చేమలను సృష్టించినప్పుడు, అవి అభివృద్ధి చెందుటకు హేతువగునట్లు సృష్టించెను. ఫలించి అభివృద్ధి చెందునట్లు ఆజ్ఞాపించెను. ప్రతి ఒక్క మొక్కయు తన వలే మొక్కలను పుట్టించవలెను. ప్రతి ఒక్క మామిడి పండును వేలకొలదిగా మామిడి పండ్లను కలుగజేయవలెను. మనుష్యులు శిశువులను, జంతువులు పిల్లలను పెట్టి సంతతిని అభివృద్ధి చేయవలెను.
మిరపకాయను తీసుకొనుడి. అందులో వేల సంవత్సరములకు పూర్వము ఎట్టికారము ఉండెనో, అదే కారణమైనది నేడును ఉంటున్నది. అలాగైతే, క్రీస్తు యొక్క పోలిక చొప్పున రూపించబడియున్న మీయందు ఆయన యొక్క శక్తియు ఆయన యొక్క ఏలుబడియు అలాగే ఉండవలెను కదా?
మీరు దేవుని యొక్క పోలిక యందు రూపించబడినవారు. మీ యొక్క పోలిక దేవుని యొక్క పోలికయందు కొనసాగింపబడి ఉండవలెను. మీ యొక్క నడక రాజాధిరాజు యొక్క నడకగా ఉండవలెను. మీ ముఖము నందుగల కళ దేవుని యొక్క ముఖకలగా ఉండవలెను. దేవుని వద్ద ఎలాంటి శక్తి ఉండెనో, అదేవిధముగా మీ యొక్క శరీరమందును అట్టి శక్తి ఉండవలెను. గొర్రెపిల్ల గొర్రెపిల్లవలె అరచుచున్నది. ఏనుగు ఏనుగు వలె నడుచుచున్నది. సింహమనేది పిల్లగా ఉన్నప్పుడే సింహము వలె ఎగసి వచ్చును. ప్రభువు యొక్క పోలిక చొప్పునను, ఆయన యొక్క స్వారూప్యము చొప్పునను కలుగజేయబడిన మీరు ఆయన వలె నడువవలెను కదా?
దేవుడు కొన్నిటికి మాత్రమే పేరు పెట్టెను. వెలుగునకు పగలనీయు, చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అయితే మిగతా సృష్టి అంతటికిని మానవుడే పేరు పెట్టవలెనని ఆశించెను. తనకు పేరు పెట్టుచున్న శక్తి ఎలాగైతే ఉన్నదో, అదే శక్తిని మనుష్యుడును పొందుకొనవలెను అనియె ఆయన ఆశించెను.
ప్రభువు పది ఆజ్ఞలను ఇచ్చి, మానవజాతి అంతయును ఆ కట్టడలను అనుసరింపవలెను అను నీతిని కలుగజేసియున్నాడు. అదే సమయము నందు మనము ప్రభువుల ప్రభువు యొక్క పిల్లలమై ఉండుటచేతను, రాజాధిరాజు యొక్క పిల్లలమై ఉండుటచేతను మనకంటూ కొన్ని అధికారములను ఇచ్చియున్నాడు. దానిని బట్టియే మృగములకును, పక్షులకును మిగతా జీవరాసులకును చెట్టు చేమలకును మనుష్యుడే పేరును పెట్టియున్నాడు. రకరకాల జీవరాశులకును, రకరకాల చెట్టు చేమలకును ఆదాము పెట్టిన పేర్లనే నేడును మనము కొనసాగించి వాడుకొనుచు వచ్చుచున్నాము.
దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క బిడ్డలనుటను మరిచిపోకుడి. అట్టి అనుబంధమును బట్టియే ప్రభువు మీకు దయచేసియున్న ఏలుబడియు, అధికారములను జరిగించుడి.
నేటి ధ్యానమునకై: “యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీయొద్దకు వచ్చెదరు” (కీర్తన.110:3).