AppamAppam - Telugu

అక్టోబర్ 31 – బుద్ధియు, జ్ఞానమకగు సంపద!

“బుద్ధి జ్ఞానములను సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి”    (కొలస్సీ. 2:3).

యేసుక్రీస్తు నందుగల బుద్ధియు మరియు జ్ఞానము మొదలగు అమూల్యమైన సంపదలన్నిటిని ఆయన తనకు చిత్తమైనవానికి దయ చేయుచున్నాడు.

ప్రభువు మాత్రమే సమస్తమును ఎరిగినవాడు. మనుష్యుని యొక్క తలంపులు, ఊహలు, ఆలోచనలు, క్రియలు సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏదియు లేదు. అపో. పౌలు,  దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో (గంభీరము) లోతైనది అని చెప్పి మిగుల ఆశ్చర్యపరుచున్నాడు (రోమీ. 11:33). మీరు తీక్షనతో ఉన్నట్లయితే ప్రభువు మీకును కావలసిన జ్ఞానమును నిశ్చయముగా దయచేయును.

ఈ శతాబ్దమునందు మనిష్యుని యొక్క తెలివి మిగుల అత్యధికమైయున్నది (దాని. 12:4). విమానములును, రాకట్టులును మనిష్యుడు చంద్రునిలో నడుచు సంభవములును, కంప్యూటర్ జ్ఞానమును, లోకమును విస్మయము చెందునట్లు చేయుచున్నది. అదే సమయమునందు కొన్ని జ్ఞానములు మనుష్యుని అపాయకరమైన పతనపు త్రోగవయందు తీసుకొని వెళ్లి నిలబెట్టియున్నది.

అయితే ప్రభువు, తన యొక్క బిడ్డలకు ఆత్మీయ జ్ఞానమును దయచేసియున్నాడు. నిత్యత్వమును గూర్చిన, పరలోకపు జ్ఞానమును దయచేసి ఉన్నాడు. ఇట్టి జ్ఞానమును లోకజ్ఞాని ఎవరు ఎరుగడు. ప్రభువు అనుగ్రహించుచున్న ఇట్టి జ్ఞానమైయున్న సంపద ఆరు విధములయందు మీకు ప్రయోజనకరమైనదై ఉన్నది.

మొదటిగా, ప్రభువును గూర్చిన జ్ఞానము. రెండోవదిగా, లేఖన వాక్యము యొక్క లోతులను, రహస్యములను ఎరుగు జ్ఞానము. మూడోవదిగా, మిమ్ములను మీరే ఎరిగేటటువంటి జ్ఞానము. నాల్గోవదిగా, ఆత్మ సంబంధమైన పరుస్థుతులను గూర్చిన జ్ఞానము.

ఐదోవదిగా, ఒక మనిషిని గూర్చినదైన, ఒక స్థలమును గూర్చినదైన, పరిస్థితులను గూర్చినదైన జ్ఞానము. ఆరోవదిగా, పరలోకమును గూర్చియు, పాతాళమును గూర్చియు, ఆత్మల యొక్క లోకమును గూర్చియు ఎరిగేటువంటి జ్ఞానము. ఇవి అన్నియును గొప్ప అమూల్యమైన సంపదలే కదా?

“యెహోవాను (ఆశ్రయించువారు) వెదకుచున్నవారు సమస్తమును గ్రహించుదురు”    (సామెతలు. 28:5). గొప్ప స్థాయిలో నడిపించబడుచున్న సువార్త మహోత్సవములయందు, సమస్యలుగల వారిని, వ్యాధిగ్రస్తులను పేరు చెప్పి పిలుచుటయును, వారికి గల సమస్యలను, వ్యాధులను గూర్చి చెప్పుటయును కూడా, ఇట్టి పరలోకపు జ్ఞానము చేతనే.

మీరు అనేకమంది వ్యక్తులను కలుసుకుంటూ ఉండవచ్చును. ఈయన ఎటువంటివాడో, ఎట్టి ఉద్దేశముతో వచ్చియున్నాడో,  లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుచున్న వాడో, మంచివాని వలె నటిస్తూ మనస్సునందు వంచనను పెట్టుకుని ఉన్నావాడో, అను సంగతి నంతటిని ఇట్టి జ్ఞానమైయుున్న సంపద మనకు గ్రహింపచేయును.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది:   “ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక, ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేకుండెను”   (యోహాను. 2:25).

నేటి ధ్యానమునకై: “వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు  వాడునైయున్నాడు. ఆయనే మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయన యొద్దనున్నది”    (దాని. 2:21,22)

Leave A Comment

Your Comment
All comments are held for moderation.