No products in the cart.
అక్టోబర్ 27 – “హెచ్చింపు వచ్చు కొండ”
“ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను” (కీర్తన. 123:1)
దావీదురాజు, ప్రభువు తట్టున తిన్నగా తన కన్నులను ఎత్తి, వేల సంఖ్యలో ఆశీర్వాదములను పొందుకొనెను. ఆయన ఎంతకంతకు ప్రభువు తట్టున తేరిచూచెనో, అంతకంతకు ఆయన గొప్ప ఔన్నత్యమునకు హెచ్చింపబడుచు వచ్చెను. ఆయన గొర్రెలను మేపేటువంటి స్థితిలో నుండి రాజుగా హెచ్చింపబడినది ఎంతటి గొప్ప హెచ్చింపు!
దేవుని బిడ్డలారా ఎవరైతే ప్రభువు తట్టు తేరి చూచుచున్నారో, అట్టివారు రాను రాను వృద్ధి చెందెదరు. రాను రాను అభివృద్ధి చెందెదరు. అట్టివారు బహు అత్యధికముగా హెచ్చింపబడుదురు.
మీయొక్క లోక సంబంధమైన జీవితమును, ఆత్మ సంబంధమైన జీవితమును ఎల్లప్పుడును అంచలంచెలుగా హెచ్చింపబడుచున్న స్థితిలోనే ఉండవలెను. ఆ పరమ యెరూషలేమును తేరిచూచుచు, సీయోను పర్వతములను తేరిచూచుచు, బలము నుండి అత్యధిక బలమును పొంది, మహిమ నుండి అత్యధిక మహిమను పొంది హెచ్చింపబడుచు ఉండవలెను. ఒక మంచి ప్రార్ధన జీవితమును జీవించుట ద్వారానే మీరు ఇట్టి ప్రయత్నమునందు జయమును పొందగలరు.
అనేకులు తమ యొక్క ఆత్మీయ జీవితమునందు, ఒక్క అడుగు పైకి ఎక్కుటయు, రెండు అడుగులు క్రిందకు జారుటయైయున్నారు. ఎక్కుటయును, దిగుటయైయుండక, రెండు రకాల పరుస్థుతులుయందు మెత్తనడవకగా నడచు అనుభవమును కలిగియుండక, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, తడబడుచున్న స్థితియందు ఉండక, ఏకముగా దృఢనిశ్చయముతో ఎక్కుచూనే ఉండవలెను, హెచ్చింపబడుచునే ఉండవలెను.
దావీదు రాజు అట్టి కొండను ఎక్కి ఒలివ కొండలోని శిఖరమందు గల దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళినప్పుడు, ఆయన యొక్క హృదయము సంతోషముతో నిండెను. “యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి” (కీర్తన. 122:2) అని చెప్పి అత్యధికముగా సంతోషించెను.
అదేవిధముగా ఒక దినమున మీ యొక్క పాదములు హెచ్చింపబడి హెచ్చింపబడి పరమ యెరూషలేమునందు నిలబడుచున్నప్పుడు, అట్టి అనుభవము మీకు మిగుల ఆనందమును కలుగజేయును.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు, “ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైయున్న దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైయున్న యేసునొద్దకును …మీరు వచ్చియున్నారు” (హెబ్రీ. 12:22-24).
అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు: “మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సును పెట్టుకొనకుడి” (కొలస్సీ. 3:1,2).
దేవుని బిడ్డలారా, ఈలోక సంబంధమైన జీవితమునందు తుది ఘట్టమునుకు మీరు వచ్చియున్నారు. నశించిపోవుచున్న ఈ లోకమును గాని, దాని భోగేచ్ఛలను గాని, ఎన్నడును దాని వైపు తేరి చూడకుడి. మిమ్ములను మహిమ నుండి అత్యధిక మహిమను పొందునట్లు చేయుచున్న ప్రభువునే తేరిచూడుడి.
నేటి ధ్యానమునకై: “జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి నడిచివచ్చెదరు” (యెషయా. 60:3).