AppamAppam - Telugu

జూన్ 28 – తెలియజేయువాడు!

“తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు”(ఆమోసు 3:7)

మీరు ప్రభువునకు సేవచేయుటకు అప్పగించుకొని, మీకు చేతనైనంత మట్టుకు ప్రభువు యొక్క పనిని చేయుచున్నప్పుడు, ప్రభువు మీకు ఇచ్చుచున్న ఆశీర్వాదములు బహు ఔనత్యముగలవి. శ్రేష్టమైనవి. ఆయన తనయొక్క సేవకులకు తన రహస్యములను హృదయపూర్వకముగా తెలియజేయుచున్నాడు.

బైబిలు గ్రంధమునందు అనేక రహస్యములును, మరియు మరుగైయున్న సంగతులును కలవు. ప్రభువు తన రహస్యములను అపోస్తులుడైన పౌలునకు తెలియజేసినందున, ఆయన తనను “దేవుని రహస్యముల గృహనిర్వాహకుడు” అని తెలియజేయుచున్నాను. అవును, దేవునియొక్క రహస్యములన్నియు ఆయన యొక్క సేవకుల ద్వారా బయలుపరచబడుచున్నది.

సొదొమ గొమొఱ్ఱా పట్టణము నాశనముచేయబడుట ఆ పట్టణమునందుగల ఏ ఒక్కరికి తెలియకుండెను. అయితే ప్రభువుచేత ఆ రహస్యము అబ్రాహామునకు మరుగుచేయలేకపోయెను. నేరుగా సొదొమ గొమొఱ్ఱా తట్టుకు వచ్చిన ప్రభువు మార్గమధ్యములో అబ్రహామును దర్శించి, “నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?”(ఆది. 18:17) అని చెప్పి, అబ్రాహామునకు ఈ రహస్యమును తెలియజేయుటను చూడగలము.

మీరు ప్రార్థనలయందు ప్రభువుతో మనసారా మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు కూడా మీతో మనసారా మాట్లాడను. అంత మాత్రమే గాక, అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను, మరుగుచేయబడియున్న రహస్యములను మీకు తెలియజేయును. ఫరో చూచిన కల గూడార్థముగా ఉండెను. ఆవులను గూర్చియు, యేడు నిన్నులను గూర్చియు ఆయన చూచిన కలకు ఎవరును భావము చెప్పలేని పరిస్థితులయందు, ప్రభువు మరుగైయున్న రహస్యమును తన సేవకుడైన యోసేపునకు బయలుపరచి చూపించెను.

అదే విధముగా, నెబుకద్నేజరు ఒక దినమున ఒక పెద్ద ప్రతిమను కలలో చూచి కలతచెందినప్పుడు, బబులోనునందుగల జ్ఞానియైనను, శకునగాండ్రులైనను కలయొక్క భావమును బయలుపరచ లేకపోయెను. అదే సమయమునందు ప్రభువు దానియేలునకు రాత్రియందు ఆ కలయొక్క భావమును బయలుపరచుటకు సంకల్పించెను. మీరు ప్రభువును ప్రేమించి, ఆయన యొక్క సేవను చేయుచున్నప్పుడు, నిశ్చయముగానే మీకు ప్రభువు యొక్క రహస్యములను బయలుపరుచును.

అపోస్తలుడైన యోహాను జీవితమును చూడుడి! ప్రభువు ఆయనపై అమితమైన ప్రేమను కలిగి తనయొక్క రహస్యములన్నిటిని తెలియజేసెను. ఒంటరిగా పద్మాసు ద్వీపమునకు తీసుకువెళ్లి పరలోకమును తెరచి, వర్తమానకాలమును భవిష్యత్కాలమును, రానైయున్న నిత్యత్వము, మొదలగు వాటియొక్క ప్రత్యక్షతలన్నిటిని ఇచ్చెను. దేవుని బిడ్డలారా, అట్టి దేవుడు మీకును మరుగైయున్న సంగతులను బయలుపరచును. మీరు ప్రభువుయొక్క మహిమగల పరిచర్యను చేయుట ద్వారా అటువంటి ఆశీర్వాదమును పొందుకొనగలరు.

నేటి ధ్యానమునకై: “మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని”(యోహాను.15:15).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.