situs toto musimtogel toto slot musimtogel link musimtogel daftar musimtogel masuk musimtogel login musimtogel toto
AppamAppam - Telugu

జూన్ 21 – బుద్ధి జ్ఞానముగల మనుష్యుడు!

“దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకు లగుదురు; బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిర పరచబడును”(సామెతలు 28:2)

సామెతల గ్రంథమును మక్కువతో చదువుతున్న వారి జీవితము అమోఘమైన శక్తికలిగినదై ఉండును. పరిశుద్ధ జీవితమును జీవించుటకును, విజయవంతమైన జీవితమును జీవించుటకును,  పరిచర్యకును ఇట్టి అజ్ఞానపు చందస్సు బహు ప్రయోజనకరముగా ఉండును.

లోకమునందు తమయొక్క వివాహపు జీవితమును ప్రారంభించుటకు ముందుగా యవ్వనస్తులైన ప్రతి పురుషుడును, ప్రతి స్త్రీయు ఇట్టి జ్ఞానపు చందస్సులోని లోతులోనికి వెళ్లి, అమూల్యమైన ముత్యములైయున్న దేవుని ఆలోచనలను మక్కువతో  గైకొని ఆచరింపవలెను.

గొప్ప  ఔన్నత్యముగల ప్రసంగీకుడైన అలెగ్జాండరు మెక్లీన్ అనువారు, “సామెతలు అనేది మీతో ఎల్లప్పుడును వెంటబెట్టుకుని వెళ్లి ఉంచుకొనవలసిన మహా గొప్ప ఔషధ మూలికలను, అమోఘమైన ఔషధముగాను ఉన్నది. యవ్వనకాలపు కల్మషములను తొలగించి ఆరోగ్యమును ఇచ్చును” అని చెప్పెను. ఎంతటి వాస్తవమైన మాటలు!

సామెతల పుస్తకమును చదువుట ద్వారా అనేకమంది యవ్వన పురుషులును,  యవ్వన స్త్రీలును క్రీస్తును గూర్చిన విశ్వాసమునందు వచ్చియున్నారు. లోక జ్ఞానమును పొందుటకు చదువుటకై ప్రారంభించినవారు ప్రభువుయొక్క జ్ఞానముచేత ఆకర్షింపబడి ఈడ్వబడియున్నారు. వారియొక్క సాక్ష్యము ఏమిటి? ‘లోక జ్ఞానము కొరకు ఈ గ్రంథమును చదువుటకు ప్రారంభించినవారు. అయితే ఈ పుస్తకమునందుగల జ్ఞానము, ఈ గ్రంథమును దయచేసిన దేవుని తట్టు మమ్ములను మార్గము నడిపించెను. అక్షరములను చదువుట ద్వారా అక్షరములయొక్క కర్తయైన ప్రభువును తెలుసుకున్నాము’ అని చెప్పుచున్నారు.

సువార్తను ప్రకటించుటకు చక్కటి మాటలు గల ఒక లేఖన భాగము సామెతల గ్రంథము. సామెతలను చదివినట్లయితే, క్రీస్తును యెరిగేటువంటి జ్ఞానమును ఎరుగగలము. విజ్ఞానపు మాటలే మీ జీవితమునకు అవసరమైన పరిపూర్ణమైన, స్థిరమైన   స్తంభముగా నిలుచుచున్నది.

మీ యొక్క కుటుంబము నందు గల బాలురను, యవ్వనులను సామెతల గ్రంథమును చదువునట్లు ఉత్సాహపరచుడి. అప్పుడు దేవుని జ్ఞానము చిరుప్రాయము నుండే వారియందు నిండియుండును. ఎంతకెంతకు దానిని చదివి ధ్యానించుచున్నారో, అంతకంతకు దేవుని మాటలు వారి అంతరంగమునందుగల లోతులయందు వేరుపారును. వారు మాటలయందును చేతలయందును జ్ఞానముగలవారై వర్ధిల్లుదురు.

ఎవరెవరు ప్రభువు దయచేయుచున్న ఉన్నతమైన జ్ఞానమును నిర్లక్ష్యము చేయుచున్నారో, వారు తమయొక్క జీవితమును తమకు తెలియకుండగనే మలీనపరచుకొనుచున్నారు. దేవుని యొక్క మాటలు ఆత్మయు, జీవమునై మాత్రము కాదు, వెర్రివారిని సహితము విజ్ఞానవంతులుగా చేయు జ్ఞానముయొక్క ఆయుధములైయున్నది. ఆత్మయొక్క శక్తియైయున్నది. అది మిమ్ములను బహుచక్కగా మార్గమునందు నడిపించును.

 

నేటి ధ్యానమునకై: “జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఎంత అధికముగా ఉన్నవి?ఆలోచనయు వివేచనయు ఆయనయందే కలవు”(యోబు. 12:13).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.