AppamAppam - Telugu

జూన్ 16 – అగ్నిమయమైన గుఱ్ఱములు!

జూన్ 16 – అగ్నిమయమైన గుఱ్ఱములు!

“యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు. ఎలిషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రధములచేతను నిండియుండుట చూచెను” (2.రాజులు.6:17)

ప్రభువు తనయొక్క జనులను కాపాడుటయైనా సరే, లేక తమయొక్క జనుల కొరకు పోరాడి యుద్ధము చేయుటయైనా సరే ఆయన వాడుతున్న పద్ధతులు ఆశ్చర్యమైనదిగాను, అద్భుతమైనదిగాను ఉండుటను చూడుడి! ఇక్కడ తనయొక్క సేవకుడిని కాపాడుటకు ప్రభువు తనయొక్క అగ్నిమయమైన గుఱ్ఱములను రథములను పంపెను.

ఎలీషా ఒక సాధారణమైన, సామాన్య జీవితమును జీవించువాడు. ఎలీషాతోకూడా ఉన్నది ఒకేఒక పనివాడు మాత్రమే. ఆ దైవజనిపై అసూయకలిగిన సిరియా రాజు అతనికి విరోధముగా గుఱ్ఱములను రథములను గొప్ప బలమైన సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనిరి(2. రాజులు 16:14). ఎవరు ఎలీషాకొరకు యుద్ధము చేయును?  ఎవరు సిరియా రాజు హస్తమునుండి ఆయనను విడిపించును? ఎలీషా పనివాడు కలవరపడిపోయెను. “అయ్యో నా యేలినవాడా మనము ఏమీ చేయుదము? అని చెప్పెను.

అందుకు ఎలీషా చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? “భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులైయున్నారు” అని చెప్పెను.  అవును, ఎలీషాకు ఆత్మీయ కనులు ఉండెను. ఆ కన్నులచే ప్రభువు తనకు సహాయమునకై పంపియున్న అగ్నిమయమైన గుఱ్ఱములను రథములను చూచెను. అందుచేతనే ఆయన హృదయము కలవరపడలేదు.

ప్రభువు మీకు సహాయముకై ఎంతమహత్తరమైన కార్యములను చేయుచున్నాడో చూడుడి. “నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను  దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును(జెకర్యా. 2:5) అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యెహోషువా గ్రంథమును, న్యాయాధిపతుల గ్రంథమును, 1 మరియు 2 రాజుల గ్రంథములను చదువుతున్నప్పుడు, ప్రభువు ఏ విధముగా తనయొక్క జనులను కాపాడెను.  ఎలాగున  తన జనులకై పోరాడెను, వాదించెను, యుద్ధమును చేసెను అనుసంగతినెల్ల మీరు ఎరుగుదురు.

ఇశ్రాయేలు జనులకు విరోధముగా సీసెరా యుద్ధమునకు వచ్చినప్పుడు, ఆకాశమునుండి యుద్ధము మొదలాయెను అనియు, నక్షత్రములు తమ మార్గంలో నుండి  సీసెరాతో యుద్ధము చేసెను (న్యాయాది.5:30) అని  బైబిలు గ్రంథము చెప్పుచున్నది. అదే విధముగా ఇజ్రాయేలీయుల ఎదుట ప్రభువు కనానీయులను వెళ్ళగొట్టుటకై పెద్దకందిరీగలను పంపెను. వేలసంఖ్యలయందు కందిరీగలు ఎగిరి వచ్చి యుద్ధసైన్యుకులుగా నిలిచెను అవి కనానీయులను వెళ్లగొట్టెను( నిర్గామ.23:28;  ద్వితి.7:20).

ఇశ్రాయేలు జనులను  ఐగుప్తీయులు తరుముకొనుచు వచ్చినప్పుడు, ప్రభువు అగ్నిస్తంభమును ఇరువురికి మధ్య ఉంచెను. అది ఐగుప్తీయులకు దట్టమైన మేఘముగాను,  అందకారముగానుండెను. ఇశ్రాయేలీయులకు అది రాత్రి అంతయు వెలుగునిచ్చేను (నిర్గమ.14: 20). దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను కాపాడువాడు, ఆయన మీపై అత్యధిక అక్కరను కలిగియున్నవాడై యున్నాడు.

 

నేటి ధ్యానమునకై: “తనఎడల యధార్థహృదయముగలవారిని బలపరచుటకై, యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” (2. దినవృ.16:9).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.