No products in the cart.
జూన్ 14 – అద్భుతములను చేయువాడు!
“పరిశుద్ధతనుబట్టి నీవు మహనీయుడవు, స్తుతుకీర్తనలనుబట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవైన నీవంటివాడెవడు” (నిర్గమ.15:11)
అద్భుతములను చేయుటయందు, ప్రభువునకు సాటియైనవారు ఎవరునులేరు. ప్రభువు చేయుచున్న అద్భుతములు నిత్యమైనవి, ఔన్నత్యమైనవి, మిక్కిలి ఆశీర్వాదములైనవి. ఆయన నిశ్చయముగానే నీ యొక్క జీవితమునందును అద్భుతములను చేయును.
అద్భుతములను చేయుచున్న అపవిత్రాత్మలు కలవు. బైబిలు గ్రంధమునందు అనేక స్థలములయందు దీనిని గూర్చి మనము చదువుచున్నాము. ఐగుప్తునందును మాంత్రికులు మోషే యెదుట అద్భుతము చేయలేదా? ‘అంత్యదినములయందు అబద్ధపు క్రీస్తు లేచి సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారినికూడా మోసపుచ్చుటకై గొప్ప అద్భుతములను, సూచకక్రియలను అగపరచును’ అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. అయితే ఇవన్నియు ప్రభువు ఎదుట నిలబడలేవు. అందుచేతనే మోషే, “యెహోవా, అద్భుతములను చేయుచున్న నీకు సాటియైన వారు ఎవరు?” అని అడిగెను. మీకు కావాల్సిన అద్భుతములు అన్నిటిని ప్రభువు మీకై జరిగించుటకు ఆసక్తిగలవాడైయున్నాడు.
నీళ్లను ద్రాక్షారసముగా చేసి, అద్భుతమును చేసెను. చేప నోటిలోనుండి షెకెలును తీసి అద్భుతమును చేసేను. ఐదురొట్టెలను, రెండు చేపలతో ఐదువేల మందిని పోషించి అద్భుతమును చేసేను. మృతులను సజీవులుగాలేపి అద్భుతములను చేసెను. బైబిలు గ్రంథము చెప్పుచున్నది, “ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు”(యోబు.9:10).
మీరు ప్రభువు వద్దనుండి అద్భుతములను ఎదురుచూడవలెనంటే, మీయొక్క జీవితమునందు విశ్వాసము మిక్కిలి అవశ్యము. విశ్వాసముంచు స్థలములయందే అద్భుతములు జరుగును. ‘నీవు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూచెదవు’ అని యేసు చెప్పెను.
విశ్వాసము వినుటవలన కలుగును, వినుట దేవుని గూర్చిన మాటవలన కలుగును. ఎంతకెంతకు ప్రభువు చేసిన అద్భుతములన్నిటిని ధ్యానించుచున్నారో, అంతకంతకు మీయొక్క అంతరంగమునందు నాకు కూడా దానిని చేయును అను విశ్వాసము పొంగుచుండును. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకును ప్రభువు చేసిన అద్భుతములన్నిటిని చదివిచూడుడి, ‘ ఆయన యొక్క ఆశ్చర్య కార్యములన్నిటిని ధ్యానించి సంభాషణచేయుడి”(కీర్తన.105:2).
అద్భుతములకొరకు ప్రభువును విశ్వసించుటతోపాటు, నోటిని తెరిచి ఆయనవద్ద అడగవలెను. ‘ఆశ్చర్యకార్యములను చేయుచున్న దేవా, నా జీవితమునందును ఒక అద్భుతమునుచేయుము’ అని గోజాడుడి. హిజ్కియా యెహోవాకు మొఱ్ఱపెట్టను, ఆయన అతనికి ఒక అద్భుతమును ఆజ్ఞాపించెను (2. దినవృ.32:24). ఎర్ర సముద్రపు ఒడ్డున జనులు దేవునికి మొరపెట్టిరి. ప్రభువు అద్భుతముగా ఎర్రసముద్రమును రెండుగా చీల్చి అద్భుతము చేసెను. దేవుని బిడ్డలారా, ప్రభువు మీ ప్రార్థనను విని నిశ్చయముగా అద్భుతములను చేయును. ఎందుకంటే ఆయన ప్రభువు, ఆయన మారనివాడు (మలాకీ.3:6).
నేటి ధ్యానమునకై: “ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే; జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు.” (కీర్తన.77:14).