Appam - Telugu, AppamAppam - Telugu

మార్చ్ 31 – పడిపోయిన గొడ్డలి!

“ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా;  వాడు: అయ్యో నా యేలినవాడా, అది యెరవుతెచ్చినదని మొఱ్ఱపెట్టెను”   (2.రాజులు. 6:5).

బైబిలు గ్రంథమునందు ఏలియా చేసిన ఏడు అద్భుతములును,  ఎలీషా చేసిన పద్నాలుగు అద్భుతములును  చోటు చేసుకొని ఉన్నది.  పైనున్న వచనమునందు కనబడుతున్న సంఘటణ అనేది  ఎలీషా చేసిన అద్భుతములయందు  ఒకటైయున్నది.  ప్రభువు ఎందుకని అద్భుతములను, సూచక క్రియలను చేయుచున్నాడు?  బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును, ఇవి వ్రాయబడెను”   (యోహాను. 20:31).

ఎలీషా యొక్క దినములయందు ప్రవక్తల శిష్యులు తాము నివాసము ఉండుటకై ఇల్లును కట్టుటకు కోరుకొనిరి. అందులో ఒకడు చెట్టుదూలము నరికుచున్నప్పుడు  గొడ్డలి యోధానునది యొక్క లోతట్టు నీటి భాగమునందు పడిపోయాను.  “అయ్యో నా యేలినవాడా,  అది ఎరవుగా తెచ్చినది”  అని  విలపించెను.

ఎరువుగా తెచ్చినట్లైతే  నిశ్చయముగా అది తిరిగి ఇవ్వవలసినదైయున్నది.  మీ యొక్క శరీరము కూడా దేవుని యొద్దనుండి ఎరవుగా తీసుకుని రాబడినదే. కావున దానిని పవిత్రమైనదిగా కాపాడవలసినది మీ యొక్క బాధ్యత. కొందరు తమ యొక్క శరీరమును పాపములయందును, ఇచ్ఛలయందును విడిచిపెట్టుచున్నారు.  ఆత్మ ప్రాణము శరీరమును మాలిన పరచుకొనుచున్నారు. శరీరము గూర్చి దేవుని ఎదుట ఎలాగున లెక్క అప్పచెప్పుట?

బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది,   “మీ దేహము మీకు దేవునివలన  అనుగ్రహింపబడి, మీలో నివాసము చేయుచున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదనియు, మీరు మీ సొత్తు కారనియు  మీరెరుగరా? విలువపెట్టి కొనబడినవారు; గనుక  దేవునికి సొంతమైయున్న మీ దేహముతోను మీ ఆత్మతోను  దేవుని మహిమపరచుడి”   (1.కోరింథీ. 6:19,20).

దైవజనుడైయున్న  ఎలీషా చెట్టు దూలము నరికిన ప్రవక్తను చూచి,   “అది ఎక్కడ పడెను?”  అని  అడిగెను. ఎక్కడ పడెను అని పరిశీలించి చూడవలసిన బాధ్యత మీకు కలదు. మీ యొక్క జీవితము నందు ఏ భాగములో లోపము ఏర్పడెను? ఎట్టి పాపము మిమ్ములను అధిగమించెను? మీరు ఇప్పుడు ఏ స్థితియందు  నిలబడియున్నారు.

నేడు మిమ్ములను మీరు పరిశీలించి చూచుకొనుడి.  దావీదు వలె   “దేవా, నన్ను పరిశోధించి, నా హృదయమును తెలిసి కొనుము; నన్ను పరీక్షించి, నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్యమార్గమున నన్ను నడిపింపుము”  (కీర్తన. 139:23,24).  అని  ప్రార్ధించుడి. దేవుని బిడ్డలారా,  మొదటనున్న ప్రేమకు తిరుగుడి. మొదటనున్న ప్రార్థన జీవితమునకు తిరుగుడి. ప్రభువు  కృపతో మిమ్ములను లేవనెత్తి, నిలబెట్టుటకు శక్తి గలవాడైయున్నాడు.

 నేటి ధ్యానమునకై: “నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము,  సమ్మతిగల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచుము”   (కీర్తన. 51:12).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.