bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam - Telugu, AppamAppam - Telugu

ఫిబ్రవరి 17 – పారిపోవును!

వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారైవచ్చెదరుదుఃఖమును నిట్టూర్పును పారిపోవును”    (యెషయా. 35:10).

ఆనందమును సంతోషమును యెహోవా చేత విమోచింపబడినవారి వైపునకు వేగముగా పరిగెత్తుకొని వచ్చును.  అదే సమయమునందు దుఃఖమును నిట్టూర్పును వారిని విడిచి తొలగిపోవును.  ఇదియే విమోచింపబడినవారు యేసుక్రీస్తుని వద్దనుండి  పొందుకొనే  గొప్ప ఆశీర్వాదము.

ఆదాము అవ్వలు ఎన్నడైయితే పాపము చేసారో, ఆనాడు మొదలుకొని భూమికి శాపము అను వేదనవచ్చెను. స్త్రీ వేదనతో పిల్లలను కనవలసినదాయెను.  బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,‌‌  “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై,  మిక్కిలి బాధనొందును”   (యోబు. 14:1).

ప్రతి ఒక్క మనుష్యునికి ఒక్కొక్క విధమైన  దుఃఖమును, ఆవేదనయు, నిట్టూర్పును, బాధలు.  యాకోబు సెలవిచ్చుచున్నాడు,   “నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి, అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదు”  (ఆది.  47:9).

సొలోమోనునకు విస్తారమైన జ్ఞానమును, ధనమును, ఐశ్వర్యమును, పేరును ప్రఖ్యాతులును  ఉండినప్పటికి,  వేదనలు ఆయనను కూడా విడిచిపెట్టలేదు.  అయిన సెలవిచ్చుచున్నాడు,   “సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలనన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి”   (ప్రసంగి. 1:14).

యేసుక్రీస్తు ఇట్టి వేదనగల నిట్టూర్పుబారి నుండి మిమ్ములను విమోచుంచున్నట్లు సంకల్పించెను. అందుచేతనే ఆయన  ఇట్టి వేదనతో నిండియున్న లోకమునకు వచ్చెను.  దుఃఖములోనుండి నిట్టూర్పులలోనుండి మిమ్ములను విమోచించునట్లు తన యొక్క రక్తమునే అర్పించెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది.   “వెండి, బంగారముల వంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని, అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా”   (1పేతురు. 1:18,19).

మీరు వేధనపడుచున్నవారి గుంపులో నిలబడక,  విమోచింపబడినవారి గుంపులో నిలబడుచున్నారు. బైబుల్లో గ్రంథము సెలవిచ్చుచున్నది,.  “యెహోవాచేత విమోచింపబడినవారు ఆనంద సంతోషాలతో పాటలుపాడుచు తిరిగి  సీయోనునకు వచ్చెదరు”   (యెషయా. 35:9).  యెహోవాచేత విమోచింపబడినది వాస్తవమైతే, మీరు దేనికిని కలత చెందవలసినదైనను, వేదన పడవలసినదైనను ఉండదు.  ‘నేను ఏసుక్రీస్తునిచే విమోచింపబడియున్నాను, రాజాధి రాజుయొక్క బిడ్డను, ప్రభువు యొక్క స్వాస్థ్యమును’  అని ఉత్సాహముగా చెప్పగలము.

దేవుని బిడ్డలారా, పలువిధములైన వేదనలను మీరు సంధించుచున్నప్పుడు, మిమ్ములను విమోచించిన యేసుని తట్టు చూడుడి.  ఆయన మిమ్ములను వాటి బారినుండి తప్పించి కాపాడును.

నేటి ధ్యానమునకై: “ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.  హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు”   (విలాప.  3:32,33).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.